చెన్నై: సాంప్రదాయికంగా నిర్వహిస్తోన్న ప్రసిద్ధ జల్లికట్టు క్రీడను జరుపుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. మకర సంక్రాంతి సందర్భంలో వచ్చే నెలలో ఈ క్రీడ జరుపుకుంటారు. అయితే కోవిడ్ –19 నేపథ్యంలో అన్ని నిబంధనలు పాటిస్తూ జల్లికట్టు క్రీడను జరుపుకోవాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. క్రీడా ప్రాంతంలోకి అడుగిడే ముందు ప్రేక్షకులు థర్మల్ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీరంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులను ధరించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రీడలో భాగస్వాములయ్యే వారు ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment