సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు జల్లికట్టును జోరుగా నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులు హింసకు గురి అవుతున్నాయని జంతుప్రేమికులు గగ్గోలు పెట్టడంతో గతంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆంక్షలులేని వాతావరణం ఉండటంతో తమిళులు రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆటలో పాల్గొన్నారు. కోడెద్దులను మైదానంలోకి వదిలి.. వాటిని అదుపుచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనల్లో పలుచోట్ల హింస కూడా చోటుచేసుకుంది.
తమిళనాడులో జోరుగా జల్లికట్టు క్రీడ
Published Tue, Jan 16 2018 9:15 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
Advertisement