Edappadi Palaniswami
-
తమిళ రాజకీయాల్లో కలకలం; పన్నీరు సెల్వంపైకి బాటిళ్లు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరుతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలో ఆధిపత్యం కోసం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), ఓ పన్నీర్‌సెల్వం(ఓపీఎస్) పోటీ పడటంతో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలని పళనిస్వామి పట్టుబడుతుండగా.. అలాంటిదేమి కుదరదంటూ పన్నీర్‌సెల్వం అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వెంకటాచలపతి ప్యాలెస్‌లో గురువారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ రసాభాసగా ముగిసింది. సమావేశం ముగియడానికి కొద్దిసేపు ముందు పళనిస్వామి వర్గీయులు పన్నీర్‌సెల్వంపైకి వాటర్ బాటిళ్లు విసిరారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కారు టైర్లలో గాలి తీసేయడంతో మరో వాహనంలో ఓపీఎస్ వెళ్లిపోయారు. ‘సింగిల్ లీడర్షిప్’కు అనుకూలంగా పలువురు సీనియర్ నాయకులు మాట్లాడారు. అయితే కోర్టు తీర్పు కారణంగా దీనిపై ఎటువంటి తీర్మానం చేయలేకపోయారు. 23 తీర్మానాలు తిరస్కరణ ఓపీఎస్ ఆమోదించిన 23 తీర్మానాలను తిరస్కరిస్తూ అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 23 తీర్మానాలను జనరల్ కౌన్సిల్ సభ్యులంతా వ్యతిరేకించారని, పార్టీ పగ్గాలు ఒక్కరి చేతిలోనే ఉండాలని వారంతా కోరుకుంటున్నారని అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ మునుస్వామి తెలిపారు. జనరల్ కౌన్సిల్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మాజీ మంత్రి జయకుమార్ చెప్పారు. ‘సింగిల్ లీడర్షిప్’ తీర్మానాన్ని తర్వాతి సమావేశంలో ఆమోదింపజేసుకుంటామన్నారు. నాటకీయ పరిణామాలు అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరగకుండా చూడాలని పన్నీర్ సెల్వం.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో వివాదం ముదిరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఓపీఎస్ మరోసారి కోర్టు తలుపులు తట్టింది. దీనిపై మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టింది. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకునేందుకు అనుమతి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మిగతా అంశాలపై చర్చపై జరగాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ‘సింగిల్ లీడర్షిప్’పై తీర్మానాన్ని ఆమోదించడానికి వీలు లేకుండా పోయింది. దీనంతటికీ కారణమైన పన్నీర్ సెల్వంపై పళనిస్వామి మద్దతుదారులు కోపంతో రగిలిపోతున్నారు. (క్లిక్: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?) -
తమిళనాడు ప్రభుత్వం సంక్రాంతి కానుక
చెన్నై: తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్కొక్కరుగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా.. డీఎంకే ఆ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. ఇక సూపర్ స్టార్ రజనీ కాంత్ కొత్త పార్టీపై ప్రకటన చేసేశారు. డిసెంబర్ 31న పార్టీ పేరు… జనవరి ఒకటిన పూర్తి వివరాలు వెల్లడిస్తానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈపీఎస్ పళనిస్వామి తన స్వస్థలం ఎడప్పాడిలోని సేంద్రయ్య పెరుమాళ్ల కోయిల్ ఆలయంలో పూజల అనంతరం ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రేషన్ కార్డు లబ్దిదారులకు సంక్రాంతి కానుకగా రూ.2500 చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. సీఎం నిర్ణయంతో తమిళనాడులోకి 2.06 కోట్ల రేషన్‌కార్డు దారులు లబ్ది పొందనున్నారు. దాంతోపాటు కిలో బియ్యం, కిలో చక్కెర, ఒక చెరుకు గడ, 20 గ్రాముల కిస్మిస్, 20 గ్రాముల జీడిపప్పు, 5 గ్రాములుయాలకులు కూడా ఉచితంగా అందివ్వనున్నట్టు సీఎం తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి ప్రకటనపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. వరదల సమయంలో ప్రజలు కష్టాల్లోఉన్నప్పుడు ఎటువంటి సాయం అందించని సీఎం, ఎన్నికలు సమీపిస్తుండటంతో వరాలు కురిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. లాక్డౌన్, వరదల కారణంగా ప్రభావితమైన కుటుంబాలకు రూ.5000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, స్టాలిన్ విమర్శలపై స్పందించిన సీఎం పళనిస్వామి.. రేషన్ కార్డుదారులకు సంక్రాంతి సందర్భంగా 2014లో రూ.100, కిలో బియ్యం, కిలో చక్కెర ఇచ్చామని, 2018లో ఆ మొత్తాన్ని రూ.1000కి పెంచామని తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పుడు రూ.2500 ఇస్తున్నామని తెలిపారు. -
కుర్చీ కొట్లాట: పన్నీరు మంతనాలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో కుర్చీ కొట్లాట వేడెక్కింది. సర్వ సభ్య సమావేశంలో సాగిన వ్యవహారాల్ని పరిగణించిన పన్నీరుసెల్వం సచివాలయానికి దూ రంగా గ్రీన్‌వేస్ రోడ్డుకే పరిమితమయ్యారు. సీఎం పళనిస్వామి కరోనా సమీక్షను సైతం బహిష్కరించి, మద్దతుదారులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం సోమవారం వాడివేడిగా సాగిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామి ఈ సమావేశం వేదికగా వాదులాటకు దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం ఎవరో, 11 మందితో మార్గదర్శక కమిటీ వ్యవహారంలో ఈ ఇద్దరు నువ్వా, నేనా అన్నటు వాదులాడుకోవడమే కాదు, ఎవరు ఏ ద్రోహం చేశారో, తలబెట్టారో అంటూ తీవ్రంగానే విడుచుకు పడ్డారు. దీంతో అక్టోబర్ 7న అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి ఎవరో అన్న ప్రకటన అంటూ సభను ముగించేశారు. అలాగే, కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. చదవండి: అన్నాడీఎంకేలో కుర్చీ వార్ దూరంగా.. మద్దతు మంతనాల్లో సీఎం, కో కన్వీనర్ పళనిస్వామి వ్యాఖ్యల దాడి కాస్త స్వరాన్ని పెంచినట్టుగా సంకేతాలు వెలువడ్డ నేపథ్యంలో మంగళవారం సాగిన పరిణామాలు ఆసక్తికరంగా, చర్చకు దారి తీసే రీతిలో మారాయి. కరోనా వ్యవహారం, లాక్డౌన్ ఆంక్షలపై సీఎం పళనిస్వామి సచివాలయంలో కలెక్టర్లు, మంత్రులు, డాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేయగా, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం డుమ్మా కొట్టారు. సచివాలయానికి దూరంగా ఉన్న ఆయన గ్రీన్‌వేస్ రోడ్డులోని నివాసంలో మద్దతుదారులతో మంతనాల్లో మునిగారు. పార్టీ సమన్వయ కమిటీ ప్రతినిధులు కేపీ మునుస్వామి, వైద్యలింగం సైతం గంటల తరబడి పన్నీరుతో భేటీ కావడం గమనార్హం. ఈ భేటీకి ప్రా«ధాన్యత పెరగడంతో పన్నీరు అడుగులు ఎలా ఉంటాయో అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో పన్నీరు ఢిల్లీ వెళ్తారని కొందరు, సొంత జిల్లా తేనికి వెళ్లనున్నారంటూ మరి కొందరు చర్చించుకోవడంతో చర్చ రచ్చ వేడెక్కింది. అమ్మ మరణం తర్వాత పరిణామాలతో పార్టీ చీలిక సందర్భంలో సాగిన పరిణామాలను ద్రోహం అంటూ తనను ఉద్దేశించి పళనిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని పన్నీరు జీర్ణించుకోలేకున్నట్టుందని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. పన్నీరు చుట్టూ పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు చేరడం, కొందరు మంత్రులు ఆయనతో ఫోన్లో మాట్లాడడం వంటి పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే కుర్చీ కొట్లా ట వేడెక్కింది. ఈభేటీ ముగించుకుని బయటకు వచ్చిన వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ మనస్పర్థలు, విభేదాలు లేవని, అందరూ ఒక్కటేనని, పన్నీరు, పళని ఇద్దరికీ తన మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, మంత్రి జయకుమార్‌ను సచివాలయంలో మీడియా కదిలించగా, పార్టీలో చి న్నచిన్న వ్యవహారాలు ఉంటాయని, అయితే, తామంతా ఒక్కటే అని, ఐక్యతతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని, మళ్లీ అధికారం కైవ సం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం పళనిస్వామి నివాసంలో మంత్రి ఎస్పీ వేలుమణి సాయంత్రం భేటీ కావడం గమనార్హం. మంగ ళవారం సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఇళ్లకు అన్నాడీఎంకే నేతలు క్యూ కట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎన్నికల ప్రచారంలో సీఎంపై చెప్పు దాడి!
తంజావురు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావురులో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై చెప్పు దాడి జరిగింది. ప్రజల్లోని ఓ దుండగుడు ఆయన లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, పార్టీ నేత నాటరాజన్ అనుకోకుండా చేయి అడ్డుపెట్టడంతో చెప్పు సీఎంకు తాకలేదు. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరఫున తంజావురులో సీఎం పళనిస్వామి రోడ్‌షో నిర్వహిస్తుండగా.. జనంలోని ఓ వ్యక్తి సీఎం లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, నాటరాజన్ చేయి అడ్డుపెట్టడంతో అది సీఎంకు తగలలేదు. అయితే, చెప్పు విసిరిన దుండగుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. జనం భారీగా ఉండటం..అక్కడ కెమెరాలు కూడా లేకపోవడంతో దుండగుడు ఎవరు అన్నది తెలియరాలేదు. అయితే, సీఎం పళనిస్వామి ప్రచారం చేస్తున్న వాహనంపై దుండగుడు విసిరిన చెప్పు కొన్ని సెకండ్లపాటు అలానే ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
తమిళనాడులో జోరుగా సంప్రదాయ క్రీడ
-
పట్టురా.. పట్టు.. జల్లికట్టు..!
సాక్షి, చెన్నై: సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ జల్లికట్టు క్రీడ జోరుగా సాగింది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తమిళులు జల్లికట్టును జోరుగా నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులు హింసకు గురి అవుతున్నాయని జంతుప్రేమికులు గగ్గోలు పెట్టడంతో గతంలో సుప్రీంకోర్టు ఈ క్రీడపై ఆంక్షలు విధించింది. ప్రస్తుతం ఆంక్షలులేని వాతావరణం ఉండటంతో తమిళులు రెట్టించిన ఉత్సాహంతో జల్లికట్టు ఆటలో పాల్గొన్నారు. కోడెద్దులను మైదానంలోకి వదిలి.. వాటిని అదుపుచేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఈ ఘటనల్లో పలుచోట్ల హింస కూడా చోటుచేసుకుంది. పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం మదురై జిల్లాలోని అలంగనల్లూరులో మంగళవారం జరిగిన జల్లికట్టు క్రీడలో సీఎం ఎడపాటి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం పాల్గొన్నారు. జల్లికట్టు కోసం ముస్తాబు చేసిన ఎద్దులకు మొక్కి వారు వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ అట్టహాసంగా జరిగిన జల్లికట్టు క్రీడకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. అపశృతి.. తమిళనాడులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే జల్లికట్టు సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. మధురై జిల్లా పలమేడులో నిర్వహిస్తున్న జల్లికట్టు వినోదం చూసేందుకు వచ్చిన ఓ యువకుడిని బుల్ కలెక్షన్ పాయింట్ వద్ద ఎద్దు పొడిచింది. దాంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని దిండిగల్ జిల్లాకు చెందిన కాలిముత్తు(19)గా గుర్తించారు. -
పళనిస్వామికి దినకరన్ చెక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పళనిస్వామి, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక పదవి నుంచి ‘చిన్నమ్మ’ను తొలగించిన మరుసటి రోజే సీఎం ఎడపాడి పళనిస్వామికి టీటీవీ దినకరన్ ఝలక్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. ఆయన స్థానంలో పి. పళనియప్పన్‌ను నియమించినట్టు తెలిపారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి దిందిగల్ సి శ్రీనివాసన్‌ను తప్పించి, ఎం. రంగస్వామిని నియమించినట్టు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు గత నెలలో దినకరన్ తెలిపారు. తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి అప్పుడే తప్పించారు. రాజేంద్రన్ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్ తొలగిస్తున్నారు. అంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. కాగా, ఇప్పటివరకు సీఎం మార్పు కోసమే ప్రయత్నించానని, ఇకపై పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ నిన్న ప్రకటించారు. -
ఎడపాడికి ఎదురుదెబ్బ!
♦ మైనార్టీలోకి పడిపోయిన ప్రభుత్వం ♦ అదృష్ట సంఖ్యకు ఆమడదూరం ♦ గోడ దూకకుండా దినకరన్ జాగ్రత్తలు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మంగళవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్గ పోరు, అసంతృప్తివాదులతో ఊగిసలాడుతున్న ఎడపాడి ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. అదృష్ట సంఖ్యకు ఆమడ దూరంలో ఉండే ఈ సర్కారు ఉండేనా ఊడేనా అనే చర్చ మొదలైంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పన్నీరు కలయికతో సంబరపడ్డ పళని స్వామికి వెంటనే షాక్ తగిలింది. దీంతో ప్రభుత్వం పరిస్థితే అయోమయంలో పడిపోయింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో 32 ఏళ్లపాటూ వెన్నంటి నిలిచిన శశికళ జయ మరణం తరువాత పార్టీ, ప్రభుత్వం ఇక తన చెప్పు చేతుల్లోనే అని ఆశించారు. ఆమె ఆశించినట్లుగానే కొన్నాళ్లు సాగింది. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన నాటి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. శశికళ జైలు కెళ్లడం, తన ప్రతినిధిగా నియమితుడైన దినకరన్ సైతం పార్టీకి పూర్తిగా దూరం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. 36 మంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారని భావిస్తూ వచ్చిన దినకరన్ మద్దతుదారుల సంఖ్య 19కి పడిపోయింది. ఎడపాడి, పన్నీర్ ఏకం కావడం శశికళ వర్గాన్ని మరింతగా బాధించింది. శశికళ సుదీర్ఘ రాజకీయ ఎత్తుగడలతో చేజిక్కించుకున్న అన్నాడీఎంకేలోనూ, ప్రభుత్వంలోనూ తమకు స్థానం లేకపోవడం ఏమిటని దినకరన్ వర్గం ప్రశ్నించడం ప్రారంభించింది. 22 మంది ఎమ్మెల్యేలు కలిగి ఉన్న తమను కాదని 11 మంది ఎమ్మెల్యేల బలం కలిగిన పన్నీర్‌ను అక్కున చేర్చుకోవడం ఏమిటని నిలదీసింది. నాడు కూవత్తూరు.. నేడు పుదుచ్చేరి జయ మరణం, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, దినకరన్ కుట్రలతో రాష్ట్ర ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కులా నెలలుగా ఊగిసలాడుతోంది. ఎడపాడి, పన్నీర్ వర్గాల విలీనంతో ప్రభుత్వం మరింత సంక్లిష్ట దశలో పడిపోయింది. ఐదుగురు ఎమ్మెల్యేల కోసం ఎడపాడి ఎత్తువేసేలోగా ముందుగానే చిత్తు చేయాలని దినకరన్ వేగంగా కదిలారు. విలీనం అయిన మరుసటి రోజునే 19 మంది ఎమ్మెల్యేల చేత ఖంగు తినిపించారు. అంతేగాక తన వైపున గట్టిగా నిలిచి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలను ప్రారంభించారు. పన్నీర్‌సెల్వం తిరుగుబాటు సమయంలో మహా బలిపురం సమీపం కూవత్తూరులో శశికళ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలను నడిపించి సఫలీకృతులైనారు. ఆ అనుభవాన్ని ఒంటబట్టించుకున్న దినకరన్ మంగళవారం ఒక ప్రత్యేక బస్సులో పుదుచ్చేరికి తరలించారు. డీఎంకే అవిశ్వాస పరీక్ష పెట్టడం లేదా, గవర్నరే బలపరీక్షకు ఆదేశించడం పూర్తయితేగానీ 19 మంది ఎమ్మెల్యేలకు విముక్తి ఉండదని సమాచారం. -
ఆందోళన వద్దు!
ఎట్టి పరిస్థితుల్లోనూ హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న తన ప్రభుత్వం రైతులకు నష్టం కల్గించే నిర్ణయాన్ని తీసుకోదని హామీ ఇచ్చారు. నెడువాసల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న ప్రతినిధులతో బుధవారం సీఎం భేటీ అయ్యారు. సాక్షి, చెన్నై : హైడ్రో కార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పుదుకోట్టై జిల్లా నెడువాసల్ వేదికగా ఉద్యమం బయలు దేరిన విషయం తెలిసిందే. యువత, విద్యార్థిలోకం, రాజకీయ, సినీ వర్గాలు సైతం ఉద్యమంలో భాగస్వామ్యం కావడంలో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండడం, పుదుకోట్టైలో బుధవారం బంద్‌కు పిలుపునివ్వడం వెరసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. పుదుకోట్టై, అరంతాంగి, తిరుమయం, ఆలంకుడి, కీలనూర్, విరాలిమలై, పొన్ అమరావతి, గందర్వకోట్టైలలో బంద్ సంపూర్ణ విజయవంతమైంది. దుకాణాలు మూత బడడంతో, రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. కూడంకులం అణు వ్యతిరేక ఉద్యమనేత ఉదయకుమార్, సినీ నటుడు మన్సూర్ అలీఖాన్, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న పేరరివాలన్ తల్లి అర్బుతమ్మాల్ నెడువాసల్‌కు చేరుకుని ఉద్యమానికి సంఘీభావం తెలియజేశారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి, ఈ ప్రాజెక్టును వెనక్కు తీసుకోవాల్సిందేనని పట్టుబడుతూ నెడువాసల్ వేదికగా ఉద్యమకారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వారితో సీఎం ఎడపాడిపళని స్వామి భేటీ అయ్యారు. ఆందోళన వద్దు...అనుమతి ఇవ్వం: నెడువాసల్ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న వేలుమణి, పన్నీరుసెల్వం, జయకుమార్, సెంథిల్, రామనాథంలతోపాటు 11 మంది ప్రతినిధులు సచివాలయం చేరుకున్నారు. వీరితో సీఎం భేటీ అయ్యారు. ఆ ప్రాజెక్టు గురించి తాము సేకరించిన వివరాలు, ఆ పరిసరాల్లో ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వకుండా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతూ నివేదిక రూపంలో వినతి పత్రాన్ని సీఎం పళనిస్వామికి అందజేశారు. కేవలం పరిశీలన మాత్రమే సాగిందని, ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని, ఇవ్వబోదని ఈసందర్భంగా సీఎం స్పష్టం చేశారు. రైతులకు నష్టం, ప్రమాదం వాటిళ్లే నిర్ణయాన్ని తీసుకోమని ఉద్యమ కారులకు ఆయన హామీ ఇచ్చారు. మీడియాతో వేలుమణి మాట్లాడుతూ, రైతుబిడ్డగా సీఎంకు తమ కష్టాలు తెలిసే ఉంటాయన్నారు. అమ్మ జయలలిత మార్గదర్శకంలో సాగుతున్న తన ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోదని తమకు హామీ ఇచ్చారని, ఇది సంతృప్తికరంగాఉందన్నారు. నెడువాసల్‌లో ఉన్నవారితో చర్చించి ఉద్యమాన్ని కొనసాగించాలా, సీఎం హామీ మేరకు విరమించాలా అన్నది గురువారం ప్రకటిస్తామన్నారు.రామనాథపురం జిల్లాలోనూ ఈ ప్రాజెక్టు తగ్గ పరిశీలను సాగుతున్నట్టు, అడ్డుకోవాలని కోరుతూ ఎంఎంకే నేత జవహరుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సీఎం పళనిస్వామిపై వేటు
-
తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్
-
సీఎం పళనిస్వామిపై వేటు
చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. అసెంబ్లీలో రేపు పళనిస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో సెల్వం వర్గం దూకుడు పెంచింది. పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ వర్గీయులను బయటకు పంపుతోంది. ఏకంగా మఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామినే పార్టీ పదవి నుంచి తప్పించినట్టు ప్రకటించింది. సాలేం జిల్లా కార్యదర్శిగా ఉన్న పళనిస్వామితో సహా 13 మంది జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శులను తొలగిస్తున్నట్టు పన్నీర్ వర్గంలో ఉన్న ప్రిసిడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించినట్టు ఈ ఉదయం ఆయన తెలిపారు. పార్టీ నిబంధనల ప్రకారం శశికళను తొలగించే అధికారం మధుసూదనన్ కు లేదని అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా నియమితులైన విద్యాశాఖ మంత్రి సెంగోట్టయన్ అన్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని పన్నీర్ సెల్వం వర్గం ఇప్పటికే జాతీయ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సంబంధిత కథనాలు ఇక్కడ చదవండి... తమిళ రాజకీయాల్లో తాజా ట్విస్ట్ పోలీసులకు పన్నీర్ సెల్వం లేఖ ‘అమ్మ’ పార్టీలో న్యూ పవర్ సెంటర్! పన్నీర్ తిరుగుబాటు చేయకుంటే..? ఎమ్మెల్యేల ఝలక్.. పళనిస్వామికి టెన్షన్!