ఎన్నికల ప్రచారంలో సీఎంపై చెప్పు దాడి! | Slipper hurled at Tamil Nadu CM during election campaign | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రచారంలో సీఎంపై చెప్పు దాడి!

Published Mon, Apr 1 2019 3:51 PM | Last Updated on Mon, Apr 1 2019 4:10 PM

Slipper hurled at Tamil Nadu CM during election campaign - Sakshi

తంజావురు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావురులో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై చెప్పు దాడి జరిగింది. ప్రజల్లోని ఓ దుండగుడు ఆయన లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, పార్టీ నేత నాటరాజన్‌ అనుకోకుండా చేయి అడ్డుపెట్టడంతో చెప్పు సీఎంకు తాకలేదు.

అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్‌ తరఫున తంజావురులో సీఎం పళనిస్వామి రోడ్‌షో నిర్వహిస్తుండగా.. జనంలోని ఓ వ్యక్తి సీఎం లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, నాటరాజన్‌ చేయి అడ్డుపెట్టడంతో అది సీఎంకు తగలలేదు. అయితే, చెప్పు విసిరిన దుండగుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. జనం భారీగా ఉండటం..అక్కడ కెమెరాలు కూడా లేకపోవడంతో దుండగుడు ఎవరు అన్నది తెలియరాలేదు. అయితే, సీఎం పళనిస్వామి ప్రచారం చేస్తున్న వాహనంపై దుండగుడు విసిరిన చెప్పు కొన్ని సెకండ్లపాటు అలానే ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement