thanjavur
-
రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు.. పాఠశాలలు, కళాశాలలకు సెలవు
చెన్నై: తమిళనాడు, శ్రీలంక తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తంజావూరు, పుదుకోటై జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు అధికారులు. జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు జిల్లాల కలెక్టర్లు వెల్లడించారు. నగరంలో శనివారం ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలుగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా నైరూతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శ్రీలంక తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. ఈ ప్రభావం తమిళనాడులోని డెల్టా జిల్లాలైన పుదుకోటై, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాథపురం, తెన్కాశి, తిరునల్వేలి జిల్లాలపై కూడా పడింది. అలాగే, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాలోనూ అనేక చోట్ల వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 11 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కాగా, వాయువ్య భారతదేశంలో ఈ నెలలో సాధారణ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. రానున్న రోజుల్లో చలిగాలుల ప్రభావం తగ్గుతుందని పేర్కొంది. Tamil Nadu Rains: Schools, Colleges Shut In Thanjavur and Pudukottai Districts Amid Heavy Rainfall#TamilNaduRains #Thanjavur #Pudukottai #HeavyRainfall #IMDhttps://t.co/URLQXV6A0u — LatestLY (@latestly) February 4, 2023 వాయుగుండం రూపంలో ఎదురైన గండం డెల్టా అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల్లో వరి వర్షార్పణమైంది. వేల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది. ఈ నష్టం పరిశీలనకు శుక్రవారం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. గురువారం రాత్రి, శుక్రవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కొనసాగాయి. అధికంగా డెల్టా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిరువారూర్ జిల్లాలో 75 వేల ఎకరాల వరి పంట దెబ్బతింది. తంజావూరు, పుదుకోటై జిల్లాల్లోని వేలాది ఎకరాలు దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, డెల్టా జిల్లాలో పెద్ద ఎత్తున వేరుశనగ పంట కూడా దెబ్బతింది. ఆయా జిల్లా అధికారులు నష్టం తీవ్రతను పరిశీలిస్తున్నారు. -
పళణి కోటలోకి శశికళ!
సాక్షి, చెన్నై : మాజీ సీఎం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళని స్వామి సొంత జిల్లాలో పర్యటించేందుకు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ సిద్ధమయ్యారు. చెన్నై నుంచి బుధవారం ఆమె తంజావూరు మీదుగా పర్యటనకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చిన్నమ్మ శశికళ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తన మద్దతుదారులను ఏకం చేస్తూ పర్యటనలపై దృష్టి పెట్టారు. ఈసారి ఆమె అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి జిల్లాను టార్గెట్ చేశారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, పళణి స్వామి మధ్య వివాదం సాగుతోన్న నేపథ్యంలో చిన్నమ్మ శశికళ సేలం, నామక్కల్ జిల్లాలపై దృష్టి పెట్టడం రాజకీయంగా ప్రాధాన్యతకు దారి తీసింది. పళణి స్వామి ఆయన సన్నిహితుడు, మాజీ మంత్రి తంగమణి మద్దతుదారుల్ని తన వైపునకు తిప్పుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటనలో చిన్నమ్మ వ్యూహరచన చేసినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో తాను జైలుకు వెళ్తూ పళణి స్వామిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆమెను పళణి స్వామి సాగనంపి ఆ పార్టీని తన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితుల్లో పళణి సొంతజిల్లాలో పర్యటించే చిన్నమ్మ శశికళ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. రెండు రోజుల పర్యటన ఖరారు సేలం, నామక్కల్‌లో చిన్నమ్మ శశికళ పర్యటన రెండు రోజులు సాగనుంది. ఇందుకు తగ్గ రూట్ మ్యాప్‌ను మంగళవారం విడుదల చేశారు. బుధవారం ఉదయం టీ నగర్ నివాసం నుంచి తంజావూరు వైపుగా శశికళ పర్యటన ప్రారంభమవుతుంది. గురువారం తిరుత్తొరై పూండిలో కొత్తగా నిర్మించిన షిరిడీ సాయిబాబా ఆలయ కుంభాభిషేకం వేడుకల్లో ఆమె పాల్గొంటారు. తంజావూరు, తిరువారూర్, సేలం, నామక్కల్, పుదుకోట్టై, ఈరోడ్ జిల్లాల నేతలతో 9.10 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తారు. 11వ తేదీ ఉదయం తంజావూరు నుంచి తిరువయ్యారు. తిరుమానూరు, కీల పలలూరు, అరియలూరు, పెరంబలూరు జిల్లాల వైపుగా ఆమె పర్యటన ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం సేలంలో పలు ప్రాంతాల్లో శశికళ పర్యటించనున్నారు. పార్టీ కేడర్, నాయకులతో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆ రాత్రి సేలంలో బస చేసి 12వ తేదీ నామక్కల్ జిల్లాలో, అరియలూరు కొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శశికళ పర్యటన నేపథ్యంలో తన మద్దతు దారులు, సర్వ సభ్య సభ్యులు, ముఖ్యులు చేజారకుండా పళణిస్వామి ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
తంజావూరు రథోత్సవంలో విషాదం
సాక్షి, చైన్నై: తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు. తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్ స్వామి మఠం ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు అప్పర్ సత్య జాతరని నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్ ఆలయానికి చెందిన పండుగలో రెండో రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. తంజావూర్–బూదలూర్ రహదారిపై రథం వెళుతుండగా తెల్లవారుజాముయ సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మృతుల్లో 13, 14, 15 ఏళ్ల ముగ్గురు బాలురు, తండ్రీ, కుమారుడు ఉన్నారు. కరెంట్ షాక్ కొట్టిన వెంటనే రథాన్ని లాగుతున్న కొందరు భక్తులు కుప్పకూలిపోయారు. కరెంట్ షాక్‌కి మంటలు వ్యాపించడంతో రథం నిలువునా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘటనకి రథోత్సవం తిలకించడానికి వచ్చిన ప్రజలు బెదిరిపోయారు. చెల్లాచెదురుగా పరుగులు తీస్తూ హాహాకారాలు చేశారు. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ. 2 లక్షలు, గాయపడిన కుటుంబాలకు రూ.50 వేలు సహాయంగా ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షలు, డీఎంకే తరపున తలా రూ.2 లక్షలు సాయంగా అందజేశారు. -
Tamil nadu: రథయాత్రలో అపశ్రుతి.. ఘోర ప్రమాదం
తమిళనాడులో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. తంజావూరులో రథయాత్ర సందర్భంగా.. షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని తంజావూరులో ఆలయ రథోత్సవం సందర్భంగా విద్యుదాఘాతంతో 11 మంది మృతి చెందారు. కలిమేడు గ్రామంలో, ఎగువ గురుపూజ కోసం చిత్రై పండుగ ఊరేగింపు సాధారణంగా అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ నేపథ్యంలో కలిమేడు ఎగువ ఆలయంలో తిరునారు కరసు స్వామి 94వ చిత్రై ఉత్సవాల సందర్భంగా నిన్న(మంగళవారం) రాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథాన్ని బంకమట్టిలోని పలు వీధుల గుండా తీసుకొచ్చారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కలిమేడు ప్రాంతంలోని పూతలూరు రోడ్డులో రథం నిలిచిపోగా, హైవోల్టేజీ వైరు తగిలి రథంపైకి విద్యుదాఘాతం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో.. ఇద్దరు పిల్లలు సహా పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో మరొకరు మృతి చెందడంతో.. మృతుల సంఖ్య 11కి చేరింది. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి తంజావూర్ ప్రమాదంపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు సీఎంవో కార్యాలయం తెలిపింది. అంతేకాదు.. క్షతగాత్రులను సీఎం స్టాలిన్ పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. தஞ்சாவூர் மாவட்டம் களிமேடு கிராமத்தில் மின்சார விபத்தில் உயிரிழந்தவர்களின் குடும்பத்தாருக்கு ஆறுதல் மற்றும் நிவாரண உதவிகளை மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள் அறிவித்துள்ளார். pic.twitter.com/v4FSMClq0q — CMOTamilNadu (@CMOTamilnadu) April 27, 2022 మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ కూడా విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించారాయన. అంఏతకాదు.. పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ప్రకటించారు. Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi — PMO India (@PMOIndia) April 27, 2022 -
అమ్మ చేతి పంట
విద్యార్థులు ఏటా పరీక్షలు రాసి ఉత్తీర్ణులవుతూ పై తరగతులకు ప్రమోట్ అవుతుంటారు. పట్టభద్రులైన తర్వాత ఇక పుస్తకాలుండవు, తరగతులుండవు, పరీక్షలూ ఉండవు. రైతుకి అలా కాదు. వ్యవసాయం అనే పరీక్షను ఏటా ఎదుర్కోవాల్సిందే. తన జీవితకాలమంతా ఏటా పరీక్ష కు సిద్ధం కావాల్సిందే. కాలం కలిసి వచ్చి ప్రకృతి కరుణిస్తేనే ఉత్తీర్ణత. ఎన్నేళ్లు ఎన్ని పరీక్షలు రాసినా ప్రమోషన్ ఉండదు. అదే పొలం, అదే పంట. భూమితో అనుబంధం తెంచుకోలేక, ఉత్తీర్ణత ప్రశ్నార్థకమవుతున్నా సరే మళ్లీ మళ్లీ పరీక్షకు సిద్ధం కావాల్సిందే. ఇన్ని పరీక్షలతో అలసిపోయిన రైతులు తర్వాతి తరాన్ని పొలానికి దూరంగా పెంచుతున్నారు. వ్యవసాయం మీద మమకారం పెంచుకుంటారేమోనని భయపడుతున్నారు కూడా. తమిళనాడులోని ఈ కుటుంబం కూడా అలాంటిదే. ఓ అమ్మ పిల్లల బాధ్యతలు పూర్తయిన తరవాత అదే పొలంలో అడుగుపెట్టి, ప్రయోగాల పంట పండించింది. కావేరి తీరం! భువనేశ్వరి పుట్టింది తమిళనాడు, తంజావూరు జిల్లాలోని కల్యాణోదయ్ గ్రామంలో. వాళ్ల ఇంటికి దగ్గరగా కావేరి నది ప్రవహిస్తుండేది. నీరు, మట్టి, చెట్టు, పండు అన్నీ స్వచ్ఛమే. కలుషితం కావడం అంటే ఏమిటో తెలియని ప్రకృతి ఒడిలో పెరిగిన బాల్యం ఆమెది. పెళ్లి తర్వాత మధురైకి దగ్గరలోని పుదుకొటై్టకి వెళ్లింది. అత్తవారిది కూడా వ్యవసాయ ప్రధానమైన కుటుంబమే. కానీ ఈ తరంలో అందరూ ఇతర వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కౌలు రైతుల కెమికల్ ఫార్మింగ్ వల్ల పొలం బీడువారింది. అత్తగారింట్లో వాళ్లెవరూ తమకు పదెకరాల పొలం ఉందనే సంగతి కూడా పట్టించుకోవడం లేదు. భువనేశ్వరి మొక్కల హాబీ పెరటిసాగుకే పరిమితమైంది. పిల్లలు పెద్దయిన తర్వాత ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. ఇంట్లో వాళ్లను అడిగి ఒకటిన్నర ఎకరా పొలంలో సాగు చేయడానికి అనుమతి తీసుకుందామె. పొలానికి వెళ్లి సేద్యం చేయడానికి అనుమతి ఇస్తూ ఇంట్లో వాళ్లు ‘వ్యవసాయం అంటే పెరట్లో కూరగాయలు పండించినట్లు కాదు’ అని హెచ్చరించారు కూడా. సేద్యంలో మెళకువల కోసం కరూర్‌లోని ‘వనగమ్ నమ్మళ్వార్ ఎకలాజికల్ ఫౌండేషన్’లో శిక్షణ తీసుకుంది. అన్నింటికీ తలూపి సేంద్రియ పద్ధతిలో సేద్యం చేయడం మొదలుపెట్టిందామె. అలా ఆమె రైతుగా మారింది. ఇది 2013 నాటి మాట. ప్రయోగాత్మకంగా మొదలు పెట్టిన సాగు మంచి ఫలితాలనిచ్చింది. సాగు విస్తీర్ణాన్ని విస్తరించింది. ఇప్పుడు పదెకరాల పొలాన్ని ఒంటి చేత్తో సాగు చేస్తోంది. నేలకు ఎప్పుడు ఏ సేవ చేయాలో, ఎప్పుడు ఏ పంట వేయాలో క్షుణ్నంగా వివరించగలుగుతోంది. కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే వాళ్లకు సలహాలిస్తోంది. వంట కోసమా! పంట కోసమా!! భువనేశ్వరి సేంద్రియ సేద్యంలో నేర్చుకున్న ఆవుపేడ, ఆవు మూత్రంతో కూడిన పంచగవ్యాన్ని ఉపయోగించడం వంటి మెళకువలకు తోడు తాను మరికొన్ని జోడించి చేసిన సొంత ప్రయోగాలు ఫలించాయి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మెత్తగా నూరి ఆ ముద్దను మజ్జిగలో కలిపి పంటల మీద చల్లేది. కీటకాలు మొక్కలోని సారాన్ని పీల్చేసి ఆకులు తెల్లగా మారిపోయినప్పుడు ఆమె ఈ పని చేసింది. కీటకాలు నశించి మొక్కలు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. ఆమె ప్రయోగాలను చూసి ఆమె పిల్లలు ‘అమ్మా! వంట చేస్తున్నావా? పంట పండిస్తున్నావా’ అని చమత్కరించేవారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల మీద ప్రయోగాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు అంతరించిపోతున్న ధాన్యాలను పరిరక్షించే పనిలో ఉందామె. అందరికీ ఉండేది రోజుకు ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయుక్తంగా మలుచుకునే వాళ్లు చరిత్ర సృష్టిస్తారు... అచ్చం భువనేశ్వరిలాగానే. -
బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే మరకత లింగం
సాక్షి, చెన్నై: తంజావూరులోని ఓ వ్యక్తి బ్యాంకు లాకర్లో రూ.500 కోట్లు విలువ చేసే పచ్చవర్ణ మరకత(ఎమరాల్డ్) లింగం బయట పడింది. తిరుక్కువలై ఆలయంలో అపహరణకు గురైన ఆ విగ్రహం లాకర్లోకి ఎలా వచ్చిందనే విషయాన్ని తేల్చేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తంజావూరు అరులానందనగర్‌లోని ఓ ఇంట్లో పురాతన విగ్రహం ఉన్నట్టు చెన్నైలోని విగ్రహాల అక్రమ రవాణా నియంత్రణ విభాగానికి సమాచారం అందింది. దీంతో ప్రత్యేక బృందం శుక్రవారం ఆ ఇంట్లోని అరుణా భాస్కర్‌ను ప్రశ్నించారు. తమ ఇంట్లో ఏమీ లేవని, తన తండ్రి స్వామియప్పన్ మరణించారని, అంతకుముందు ఆయన వద్ద ఉన్న మరకత లింగం బ్యాంక్ లాకర్లో ఉండొచ్చని చెప్పారు. దీంతో బృందం లాకర్‌ను తెరిచి చూశారు. అందులో పచ్చవర్ణ మరకత లింగం బయట పడింది. దీని విలువ రూ.500 కోట్లు ఉంటుందని అంచనా. ఆ విగ్రహం మైలాడుతురై జిల్లా శీర్గాలి సమీపంలోని తిరుక్కువలై శివాలయంలో మూడేళ్ల క్రితం చోరీకి గురైనట్టు తేలింది. దీంతో అధికారులు శనివారం ఆ విగ్రహాన్ని చెన్నైలోని కార్యాలయంలో భద్రపరిచారు. -
వనితపై బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆగ్రహం
సాక్షి, చెన్నై : ఇటీవలే మూడో వివాహం చేసుకున్న నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే ఆమె తాజాగా రాజకీయ నాయకుల ఆగ్రహానికి గురవుతున్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వనిత వివాహంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు. అలాంటి వారిపై ఎదురు దాడి చేసే పనిలో భాగంగా ఆమె తంజావూర్ ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వనిత చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. (నటి వనితపై విమర్శలు.. యువతి అరెస్ట్) ఆ వ్యాఖ్యలు ఆ ప్రాంత కాంగ్రెస్, బీజేపీ వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యవహారంపై తంజావూర్ జిల్లా, పుదుక్కొటై నగర పోలీస్ స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ యువజన పార్టీ కార్యదర్శి శివ ఫిర్యాదు చేశారు. తంజావూరు మట్టికి, ప్రజలకు ఒక చరిత్ర ఉందని అన్నారు. అలాంటి ప్రజలను మనోభావాలను కించపరిచే విధంగా వనిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. తంజావూరు ప్రజలందరినీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన వనితపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తంజావూర్ కలెక్టర్ గోవిందరావు, ఎస్పీ దేశ్‌ముఖ్ శేఖర్ సంజయ్‌కు జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు ఫిర్యాదు చేశారు. వనిత వ్యాఖ్యలు తంజావూరు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసినట్లు పేర్కొన్నారు. ఆమె వెంటనే తంజావూర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వనితపై చర్యలు తీసుకోవాలని కోరారు. (నటి మూడో పెళ్లి; ఫోటోలు వైరల్) కాగా తన వ్యాఖ్యలపై వనితా ట్విటర్లో ... తన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరారు. ఒకవేళ ఆ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే సహృదయంతో తనను క్షమించాలని కోరారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. My fellow brothers and sisters from #Tanjore ...kindly dont misinterpret my anger and tone to another issue as disrespectful to you..I am very sorry if I unintentionally said anything that may have hurt your feelings...endrendrum thalaivanungugiren en thanjai mannirku 🙏 — Vanitha Vijaykumar (@vanithavijayku1) July 23, 2020 -
దొంగతనం చేశాడు; కానీ
చెన్నై: అవసరం మనిషిని దొంగను చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ అవసరం తీరిన తర్వాత దొంగిలించిన వస్తువును తిరిగి దాని యజమానికి అప్పగించడమే విశేషం. తంజావూరులోని మన్నార్గుడికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి సూలూర్‌లోని ఓ బేకరీ షాపులో పనికి కుదిరాడు. లాక్డౌన్ వల్ల పని కూడా లేకపోవడంతో ఖాళీగా ఉన్నాడు. అటు అతని కుటుంబం కూడా నగరానికి వచ్చి అక్కడే చిక్కుకుపోయింది. ఎలాగైనా ఫ్యామిలీతో కలిసి ఇంటికి వెళ్లాలని భావించాడు. కానీ అందుకు సరైన మార్గం తోచలేదు. దీంతో అతను ఓ చోట పార్క్ చేసి ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. దాని ద్వారానే స్వగృహానికి చేరుకున్నాడు. ఇదిలా వుండగా సదరు బైకు యజమాని సురేశ్ కుమార్ మే18న తన వాహనం చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (ఇలాంటి దొంగతనం ఎప్పుడూ చూడలేదు) ప్రస్తుతం కరోనా డ్యూటీలో మునిగి తేలుతున్న పోలీసులు లాక్డౌన్ తర్వాత విచారణ చేపడతామని బాధితుడితో పేర్కొన్నారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన సురేశ్ చోరీ అయిన బైకు గురించి వెతుకులాట మొదలు పెట్టాడు. ఈ క్రమంలో అతడికి సీసీటీవీ కెమెరాల్లో బైకు చోరీ అయిన దృశ్యాలు కనిపించాయి. ఆ దృశ్యాల్లో ఉన్న వ్యక్తి కోసం ఆరా తీయగా పూర్తి వివరాలు తెలిశాయి. అయితే అప్పటికే ఇంటికి చేరుకున్న ప్రశాంత్ అవసరం తీరిపోవడంతో రెండు వారాల తర్వాత బైకును తిరిగి దాని యజమానికి కొరియర్ ద్వారా పంపించాడు. దీంతో తిరిగి తన బైకు కనిపించగానే ఆ యజమాని ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. పైగా తన బైకు ఎప్పటిలాగే ఉండటంతో ఈ ఘటనపై కేసు పెట్టదలచుకోలేదని తెలిపాడు. (కరోనా ఎఫెక్ట్: మెట్రో కీలక నిర్ణయం) -
బృహదీశ్వరాలయ కుంభాభిషేకానికి పోటెత్తిన భక్తులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తంజావూరు బృహదీశ్వరాలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. దీన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 23 ఏళ్ల తర్వాత మహా కుంభాభిషేకం నిర్వహించడంతో.. దీన్ని తిలకించడానికి దేశవిదేశాల నుంచి నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. దీంతో తంజావూరు ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. బృహదీశ్వరాలయ ప్రధాన రాజగోపురంతో పాటు ఆలయ ప్రాంగణంలోని పలు దేవతామూర్తుల ఆలయ శిఖరాలపైనా శివాచార్యులు, శైవాగమ పండితులు, ఓదువార్లు పవిత్ర నదీజలాలతో గోపురాలపైనున్న స్వర్ణ, రజిత, కాంస్య కలశాలకు సంప్రోక్షణ చేశారు. ఇందుకోసం యోగశాలలో ఉంచిన గంగా, యమున, కావేరి నదుల పవిత్రజలాలతో నిండిన 705 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం మహాకుంభాభిషేకంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు తిరుమల తరహాలో దర్శన సదుపాయం కల్పించారు. రద్దీ విపరీతంగా ఉండటంతో తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా పోలీసులు, ఆలయ నిర్వాహకులు నంది మంటపం వద్ద కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులు మైమరచి, భక్తిపారవశ్యంతో ‘పెరువుడయారే వాళ్గ’, హర హర శంకరా! పెరువుడయారే (బృహదీశ్వరా) అంటూ జయజయ ధ్వానాలు చేశారు. కాగా.. బృహదీశ్వరాలయ గోపురంపైనున్న స్వర్ణకలశంపై శివాచార్యులు పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహిస్తున్న సమయంలో ఓ గరుడ పక్షి (గద్ద) ఆకాశంలో ప్రదక్షిణ చేసి వేగంగా మాయమైంది. ఆ దృశ్యాన్ని చూసి శివాచార్యులు, భక్తులు పులకించిపోయారు. -
సుఖోయ్‌కి బ్రహ్మోస్ జత కలిస్తే..
తంజావూర్: హిందూ మహా సముద్ర జలాలపై పట్టు సాధించేందుకు తంజావూరు బేస్ స్టేషన్‌గా భారత వాయు సేన (ఐఏఎఫ్) బ్రహ్మోస్ క్షిపణులను అమర్చిన సుఖోయ్ యుద్ధవిమానాలను ప్రారంభించింది. టైగర్‌షార్క్ 222 స్క్వాడ్రన్‌కు చెందిన సుఖోయ్30 ఎంకేఐ యుద్ధ విమానాలు దక్షిణ భారత జలాలపై ఆధిపత్యం సాధిస్తాయని ఐఏఎఫ్ పేర్కొంది. ఇక దక్షిణ భారత్‌లో తంజావూర్ వ్యూహాత్మక స్థావరంగా మారనుందని పేర్కొంది. భారత్–రష్యాల సంయుక్త కృషితో తయారైన బ్రహ్మోస్ క్షిపణులకు సుఖోయ్‌లు తోడై అత్యంత శక్తిమంతంగా మారాయని ప్రారంభోత్సవం సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ 300 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఈ క్షిపణులు సులువుగా టార్గెట్ చేయగలవు. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 1500 కిలోమీటర్ల పరిధిలో నిరంతరాయంగా పనిచేసే సామర్థ్యం వీటి సొంతం. -
శశికళ ఇల్లు కూల్చివేతకు నోటీసు
సాక్షి ప్రతినిధి, చెన్నై: కూలిపోయేస్థితికి చేరుకున్న ఇంటిలో కాపురమా..ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరమ్మా బాధ్యులంటూ తంజావూరు కార్పొరేషన్ అధికారులు చిన్నమ్మను నిలదీశారు. మీరు కూల్చకుంటే మేమే ఆ పనిచేస్తామని హెచ్చరిస్తూ బుధవారం సాయంత్రం ఇంటిగోడపై నోటీసు అంటించారు. తమిళనాడు ప్రజలకు చిన్నమ్మ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నెచ్చెలిగా, అమ్మ తరువాత చిన్నమ్మే అన్నంతగా పేరుబడిన శశికళ పార్టీలోనూ, పాలనలోనూ చక్రం తిప్పారు. శశికళకు సంబంధించి ఏ చిన్న అంశమైనా రాష్ట్రంలో చర్చనీయాంశమే. బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో మూడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నా ఏదోరకంగా వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తున్నారు. తంజావూరులోనిశశికళ సొంతింటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం ద్వారా చిన్నమ్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళకు చెన్నై, తంజావూరులలో సొంతిళ్లు ఉన్నాయి. తంజావూరులో 10,500 చదరపు అడుగుల్లోని సొంతింటిలో మనోహర్ అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. తంజావూరు కార్పొరేషన్ అధికారులు గత నెల ఆ ఇంటిని పరిశీలించి నివాసయోగ్యం కానంతగా పాడుబడి పోయి ఉందని నిర్ధారించారు. ఈ ఇంటిని వెంటనే కూల్చకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ శశికళ, అద్దెకున్న మనోహర్‌కు కార్పొరేషన్ కమిషనర్ జానకీ రవిచంద్రన్ నోటీసులు జారీచేశారు. నోటీసులోని వివరాలు ఇలా ఉన్నాయి. తంజావూరు కార్పొరేషన్ పరిధిలోని ఎస్పీజీ మిషన్ ఉన్నతపాఠశాల రోడ్డులో ప్రమాదస్థితిలోని ఉన్న శశికళ ఇంటిని కూల్చివేయకతప్పదు. 15 రోజుల్లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుని ఇంటిని ఖాళీచేయకుంటే ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలకు ఇంటి యజమాని బాధ్యత వహించాల్సి ఉంటుంది. అంతేగాక కార్పొరేషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటూ నిర్మాణాన్ని తొలగించేందుకు అయిన ఖర్చులను ఇంటి యజమాని నుంచి వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు జారీచేసిన తరువాత కూడా ఇంటిని కూల్చకపోవడం, ఖాళీ చేయకపోవడం తంజావూరు తహశీల్దారు వెంకటేశన్, కార్పొరేషన్ ఇంజినీర్లు బుధవారం సాయంత్రం శశికళ ఇంటికి చేరుకుని మనోహరన్‌ను విచారించారు. చెన్నైలోని శశికళ బంధువులకు నోటీసు విషయం చెప్పాను, ప్రస్తుతం ఆ ఇంటిలో ఎవ్వరూ నివసించడం లేదు, తాను వెనుకనున్న పోర్షల్ ఉంటున్నానని మనోహరన్ అధికారులకు వివరించాడు. దీంతో శశికళ ఇంటి ప్రవేశద్వారంలోని గోడపై నోటీసు అంటించారు. ఇంటిని ఖాళీచేసి కూల్చివేయాల్సిందిగా నోటీసులో ఇచ్చిన గడువు తీరిపోయింది, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులని అధికారులు మనోహరన్‌ను నిలదీశారు. ఇంటిపై నోటీసు అంటించిన కారణంగా వెంటనే ఖాళీచేయాలి, లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. శశికళ ఇంటిని కూల్చివేసేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. -
మోదీ అభిమానిపై దాడి
టీ.నగర్(చెన్నై): తంజావూరులో నరేంద్ర మోదీకి మద్దతుగా ప్రచారం చేస్తున్న వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూరు సమీపంలోని ఒరత్తనాడు తెన్నమనాడు గ్రామానికి చెందిన వృద్ధుడు గోవిందరాజ్ (75) సామాజికవేత్త. వెటర్నరీ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబంలో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా విడిగా ఉంటున్నారు. ప్రధాని మోదీ అంటే వల్లమాలిన అభిమానం. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ఒరత్తనాడు పరిసర ప్రాంతాల్లో మోదీకి ఓటేయండని ప్రాధేయపడేవాడు. ఒరత్తనాడు అన్నా విగ్రహం సమీపంలో శనివారం రాత్రి మెడలో మోదీ చిత్రపటాన్ని తగిలించుకుని దుకాణదారుల వద్ద ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ గోపినాథ్ (33) అక్కడికి వచ్చారు. మోదీకి ఎలా ప్రచారం చేస్తావని గోవిందరాజ్‌తో తగాదాకు దిగాడు. వారి మధ్య వాగ్వాదం పెరగడంతో గోపీనాథ్ ఆగ్రహంతో గోవిందరాజన్‌పై దాడి చేశాడు. దీంతో గోవంద్‌రాజన్ స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు ఒరత్తనాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీనిపై గోవిందరాజ్ కుమార్తె అర్బుతరసు ఒరత్తనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గోపీనాథ్‌ను అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ, అన్నాడీఎంకే వర్గాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించారు. గోపీనాథ్.. డీఎంకే-కాంగ్రెస్ మద్దతుదారుడిగా భావిస్తున్నారు. -
ఎన్నికల ప్రచారంలో సీఎంపై చెప్పు దాడి!
తంజావురు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావురులో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా.. ఆయనపై చెప్పు దాడి జరిగింది. ప్రజల్లోని ఓ దుండగుడు ఆయన లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, పార్టీ నేత నాటరాజన్ అనుకోకుండా చేయి అడ్డుపెట్టడంతో చెప్పు సీఎంకు తాకలేదు. అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరఫున తంజావురులో సీఎం పళనిస్వామి రోడ్‌షో నిర్వహిస్తుండగా.. జనంలోని ఓ వ్యక్తి సీఎం లక్ష్యంగా చెప్పు విసిరాడు. అయితే, నాటరాజన్ చేయి అడ్డుపెట్టడంతో అది సీఎంకు తగలలేదు. అయితే, చెప్పు విసిరిన దుండగుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. జనం భారీగా ఉండటం..అక్కడ కెమెరాలు కూడా లేకపోవడంతో దుండగుడు ఎవరు అన్నది తెలియరాలేదు. అయితే, సీఎం పళనిస్వామి ప్రచారం చేస్తున్న వాహనంపై దుండగుడు విసిరిన చెప్పు కొన్ని సెకండ్లపాటు అలానే ఉండిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
నిధి చాల సుఖమా!
త్యాగరాజు జీవితంలో ఎన్నడూ ఉద్యోగం చేయలేదు. ఒకరి దగ్గరకు వెళ్ళి చేయిచాపలేదు. తెల్లవారిలేస్తే సంధ్యావందనం చేసుకోవడం, కావేరీ నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడినుంచి వచ్చి భాగవత, రామాయణాలు, భగవద్గీతలు చదువుకోవడం. మధ్యాహ్నమయిన తరువాత కీర్తనలు చేసుకుంటూ ఉంఛవృత్తి చేసుకోవడం... అంటే తనవద్ద ఇంట్లో ఎంతమంది శిష్యులు సంగీతం నేర్చుకోవడానికి వచ్చారో వారి ఉదరపోషణకు సరిపడా పదార్థాల్ని సేకరించడానికి ఎన్ని ఇళ్ళ ముందుకు వెళ్ళి చేయి చాపవలసి వస్తే అన్ని ఇళ్ళ వద్దకు వెళ్ళి కీర్తనలు చేయడం, పెట్టినవారూ ఒకటే, పెట్టనివారూ ఒకటే. పదార్థాలు సరిపడా సమకూరాయనిపించగానే తిరిగి వచ్చి భార్య కమల (పెద్దభార్య పార్వతి శరీరం విడిచి పెట్టిన తరువాత తల్లి బలవంతం మీద ఆమె చెల్లెలు కమలను చేసుకున్నారు. వారికి ఒకే సంతానం –సీతామహాలక్ష్మి) వాటిని వండి సిద్ధం చేసేది. దానిని త్యాగరాజుగారు రామచంద్రమూర్తికి నివేదించి తాను, తన కుటుంబం, శిష్యులు స్వీకరించేవారు. దాచుకోవడం చేతకాదు. చెట్టును ఆశ్రయిస్తే, గోత్రనామాలు అడగకుండా నీడ ఎలా ఇస్తుందో అలా ఆయన పాదాలను ఆశ్రయించిన ప్రతివారికీ సంగీత విద్యను నేర్పేవారు. అలా జీవించిన త్యాగరాజు గారికి ఏం లోటు? ఎందరో మహారాజులు ఎలాగయినా వారిని తమ సన్నిధానానికి తెచ్చుకోవడానికి విఫల యత్నాలు చేసారు. తంజావూరు మహారాజయితే మారువేషాల్లో వచ్చి ఆయన కీర్తనలు విని ఆనందిస్తూండేవారు. ఒకరోజు ఆయన జోలెపట్టి వెడుతుంటే దానిలో బంగారు కాసులు వేసారు, ఏం చేస్తారో చూద్దామని. బంగారు కాసులు పడడం చేత ఈవేళ ఈ ఆహారం తినడానికి అయోగ్యమయిందని త్యాగరాజు దానిని మొత్తం తీసుకెళ్ళి చెత్తకుప్పలో వేసారు. ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా...’’ అని కీర్తన చేసారు. పక్కింట్లోనే అన్నగారు జపేశుడు ఉండేవారు. ఎంతసేపటికీ ఈ విగ్రహాలు పెట్టుకుని, మహారాజులు బహుమతులు ఇచ్చినా పుచ్చుకోనంటున్నాడని కోపమొచ్చి ఆ విగ్రహాలు పోతే తప్ప తమ్ముడికి బంగారం మీద మమకారం కలగదని ఎవరూ చూడకుండా వాటిని తీసుకెళ్ళి కావేరీనదిలో పారేసాడు. వాటికోసం త్యాగయ్య రాత్రింబవళ్ళు పరితపించిపోయి ‘నిన్ను ఎందని వెదకను హరీ...’’ అని కీర్తన చేసాడు. తన ఇష్టదైవం కలలో కనపడి కావేరీ నదిదగ్గరకు రమ్మనమని ఆదేశిస్తే అక్కడ నీటిలో తేలియాడుతూ వచ్చాయి విగ్రహాలు. వంద రెండొందల సంవత్సరాల క్రితం నాటివి ఈ సంఘటనలు.పరమేశ్వరుడున్నాడనడానికి ప్రత్యక్ష నిదర్శనాలు వీరి జీవితాలు. మనమయితే ఇంట్లో విగ్రహాన్ని పెట్టి పూజచేస్తే... కేవలం విగ్రహంగానే చూస్తాం. దీపం వెలిగించేటప్పడు పొరబాటున చెయ్యి తగిలి విగ్రహం కింద పడ్డా తిరిగి నిలబెట్టి పూజ చేసుకుని వచ్చేస్తాం. త్యాగరాజు అలాకాదు. ఆ విగ్రహాలు కావేరీ నదిమీద తేలుతూ వస్తే...‘‘సుకుమార రఘువీర రారా మా ఇంటికి’’...అని ఆర్తితో కీర్తనను ఆలపిస్తూ తీసుకెళ్ళారు. త్యాగరాజు గారి కుమార్తె వివాహం జరుగుతుంటే దక్షిణ భారతదేశం నుంచి ఒక స్నేహితుడు ఆయనకు రామచంద్రమూర్తి విగ్రహాలను తెచ్చి బహూకరించాడు. అది చూసి కన్నీటి పర్యంతమయిన త్యాగయ్య నాకోసం అంత దూరం నుంచి నడిచి వచ్చావా స్వామీ, నీ కాళ్ళెంత సొక్కిపోయాయో...అంటూ ‘‘నను పాలింపగ నడచి వచ్చితివా...’’అని కీర్తన చేసారు. త్యాగరాజు గారికి ‘సర్వం రామమయం జగత్’. -
కోట్ల విలువ చేసే విగ్రహాలు మాయం..
సాక్షి, తిరువొత్తియూరు: ప్రపంచ ప్రసిద్ధి పొందిన తంజావూరు బృహదీశ్వర ఆలయంలో రాజరాజచోళన్, రాణి లోకమాదేవి కోట్ల విలువ చేసే బంగారం, పంచలోహ విగ్రహాలు అదృశ్యమైనట్లు తనిఖీల్లో తెలిసింది. రాష్ట్రంలోని పలు ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో విగ్రహాలు మాయం అవుతున్నాయి. వీటిపై ఫిర్యాదు అందడంతో మద్రాసు హైకోర్టు రాష్ట్రంలో విగ్రహాలకు సంబంధించి ఐజీ పొన్‌మాణిక్యవేల్ నేతృత్వంలో విగ్రహాల చోరీలపై విచారణ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో విగ్రహాల తనిఖీ కోసం 250కు పైబడిన పోలీసులను నియమించారు. ఈ క్రమంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బృహదీశ్వర ఆలయంలో ఉన్న రాజరాజచోళన్, రాణి లోకమాదేవి బంగారు విగ్రహాలు అదృశ్యమై ఉన్నట్టు తెలిసింది. పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి ఆలయ నిర్వాహకులు జాయింట్ కమిషనర్ మాజీ కార్యదర్శులు సహా నలుగురిని అరెస్టు చేశారు. -
ఏసీబీకి వలలో తంజావూరు కమిషనర్
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తంజావూరు కార్పొరేషన్ కమిషనర్ వరదరాజన్ ఏసీబీ వలలో చిక్కారు. తంజావూరుకు చెందిన సంబంధం అనే వ్యక్తి తనకున్న ఖాళీ స్థలానికి పన్ను విషయమై కార్పొరేషన్ వర్గాలను ఆశ్రయించాడు. అయితే పన్ను మరీ ఎక్కువగా ఉండటంతో వ్యవహారం కమిషనర్ వద్దకు చేరింది. కమిషనర్ సన్నిహితుడు నాగరాజన్ రంగంలోకి దిగి రూ.75 వేలు ఇస్తే అన్నీ సక్రమంగా సాగేలా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం ఉదయం ఏసీబీ వర్గాలు ఇచ్చిన నోట్లను తీసుకుని కమిషనర్‌ను కలిశాడు. నాగరాజన్‌తో కలిసి ఆయనకు రూ.75 వేలు అందించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కమిషనర్, అతడి సన్నిహితుడిని అరెస్టు చేశారు. -
మళ్లీ పెళ్లి వద్దందని తల్లినే చంపాడు!
తంజావూరు(తమిళనాడు): మళ్లీ పెళ్లి చేసుకుంటానంటే అడ్డుచెప్పిందని తల్లినే చంపాడో రాక్షసుడు. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో కాదు.. భావిపౌరులను తీర్చిదిద్దే ఓ ప్రధానోపాధ్యాయుడు. తమిళనాడు తంజావూరులోని శ్రీనివాసపురం ప్రాంతానికి చెందిన కె.త్యాగరాజన్(57) ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అయితే, కొంతకాలం క్రితం అతని భార్య ఎటో వెళ్లిపోయింది. దీంతో త్యాగరాజన్ మళ్లీ పెళ్లికి సిద్ధపడ్డాడు. అతని తల్లి(80) మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మళ్లీ పెళ్లి వద్దని వాదించింది. ఈ విషయమై ఏప్రిల్ 20వ తేదీన తల్లి, కొడుకు మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఉన్న త్యాగరాజన్ తల్లి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. మరునాటి ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన తల్లిని ఎవరో చంపారని ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె కళ్లలో కారం చల్లి ఆభరణాలను దోచుకెళ్లారని తెలిపాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొడుకు త్యాగరాజన్‌ను అనుమానించారు. విచారణలో అతడు నిజాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకుంటానంటే అడ్డు చెప్పిందని చంపేశానని ఒప్పుకున్నాడు. దీంతో అతడిని బుధవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. -
తంజావూరులో మరియమ్మ విగ్రహం చోరీ
తంజావూరు: పురాతన ఆలయంలోని మరియమ్మ అమ్మవారి కాంస్య విగ్రహం చోరీకి గురైంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఆలయ తలుపులు పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు సుమారు 20 కిలోల బరువైన అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించడానికి గుడికి వెళ్లిన స్థానికులు చోరీ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వందల ఏళ్లనాటి మరియమ్మ అమ్మవారి విగ్రహం ఖరీదు లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఉపఎన్నికలపై పిల్
► అభ్యర్థులను అనర్హులను చేయండి ►తంజావూరు, అరవకురిచ్చిల ఉపఎన్నికలపై వ్యాజ్యం ►విచారిస్తామని న్యాయమూర్తుల హామీ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన తంజావూరు, అరవకురిచ్చి అభ్యర్థులు తాజా ఉపఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కరూరు జిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన ఏఏ సాధిక్ ఆలి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మధురై జిల్లా అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థిసెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామి, తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్లను మభ్యపెట్టే రీతిలో వ్యవహరించారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులపై అనేక క్రిమినల్ కేసులు దాఖలయ్యారుు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఇవే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, 19వ తేదీన పోలింగ్ జరుగుతుండగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ధిక్కరించి అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలు, ఎన్నికల చిహ్నం, అభ్యర్థులపై భారత ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సదరు అభ్యర్థులకు సంజారుుషీ నోటీసులు జారీచేయాల్సి ఉంది. వారి నుంచి వివరణ వచ్చే వరకు ఆయా పార్టీలు, అభ్యర్థులు, చిహ్నం లపై తాత్కాలిక నిషేధాన్ని విధించాల్సి ఉంది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో అటువంటి చర్యలు ఏమీ చేపట్టలేదు. అరవకురిచ్చి, తంజావూర్లలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికలు సజావుగా, నీతిబద్ధంగా జరగాలంటే అన్నాడీఎంకే, డీఎంకే తదితర అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సెంథిల్ బాలాజీ, కేసీ పళనిస్వామి పేర్లను ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ల నుంచి తొలగించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి. అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికల చిహ్నంను వారికి కేటారుుంచరాదు. ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులని ప్రకటించాలని ప్రజాప్రయోజన వాజ్యంలో పేర్కొన్నాడు. ఈ వాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం అమల్లో ఉంది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన వారిని కూడా అనర్హులుగా చేయాలనే అంశం ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తంజావూరు, అరవకురిచ్చిలపై ఇప్పటికే మరో కేసు విచారణలో ఉన్నందున ఈ వాజ్యాన్ని సైతం వాటితో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు బదులిచ్చారు. -
కావేడి
• కావేరి బోర్డు కోసం స్టాలిన్ నిరాహారదీక్ష • కేంద్రంపై విమర్శలు • వైగో ఆందోళన సాక్షి ప్రతినిధి, చెన్నై :కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం తంజావూరులో నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు తరలివచ్చి తమ మద్దతు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక మధ్య ప్రవహిస్తున్న కావేరీ జలాల వినియోగంపై ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించేందుకు కావేరీ పర్యవేక్షణ బోర్డును ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అయితే సుప్రీం తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం ప్రకటించడంతో బోర్డు ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. తమిళనాడు ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని అనేక పార్టీలు, రైతు సంఘాలు కొన్ని రోజులుగా దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కావేరీ పర్యవేక్షణ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాలిన్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ కాలు మోపలేని పరిస్థితి, కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసం కేంద్రం పాకులాడుతోందని విమర్శించారు. బోర్డు ఏర్పాటుకు మోకాలొడ్డడం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తమిళనాడుకు చేసిన పెద్ద ద్రోహమని ఆయన అన్నారు. కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుపై ప్రధాని సమక్షంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జయలలితపై ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి లేదా ఆ తరువాత ప్రాధాన్యత కలిగిన మంత్రిని ప్రశ్నించాలని చెప్పారు. ప్రతిపక్ష నేతలుగా తమ అభిపాయాన్ని ప్రజల ముందు ఉంచుతున్నామని, ఇందులో భాగంగానే నిరాహార దీక్ష చేపట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలనేది తమ అభిమతం కాదని స్పష్టం చేశారు. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని, అధికార పార్టీ జోక్యం ఉండకూడదని మాత్రమే తాము కోరుకున్నామని చెప్పారు. స్టాలిన్ దీక్ష సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండీఎంకే ఆందోళన : ఇలా ఉండగా, కావేరీ అంశంపై ఎండీఎంకే అధినేత వైగో నేతృత్వంలో శుక్రవారం తిరువారూరులో భారీ ఆందోళన చేపట్టారు. కర్నాటకకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమిళనాడు రైతులను బాధిస్తోందని ఆయన అన్నారు. కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరిచి కావేరీ పర్యవేక్షణ బోర్డు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మాల్యాను వదిలేసి.. మమ్మల్ని చితకబాదుతారా!
తంజావూరు: బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా విదేశాల్లో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. విదేశాలకు వెళ్లకుండా సీబీఐ విమానాశ్రయాల్లో లూకౌట్ నోటీసులు జారీచేసినా.. ఆయన గుట్టుచప్పుడు కాకుండా దేశం వదిలి పరారయ్యాడు. దాదాపు రూ. 9వేల కోట్లు ఎగ్గొట్టిన అలాంటి వ్యక్తిని యథేచ్ఛగా వదిలేసిన బ్యాంకు అధికారులు, పోలీసులు తమిళనాడులో ఓ అమాయక రైతును చితకబాదారు. అతడు చేసిన నేరమల్లా.. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులో రూ. 1.30 లక్షలు తిరిగి చెల్లించకపోవడమే. తంజావూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వీడియో తీసి ఆన్లైన్లో పెట్టాడు. జీ బాలన్ అనే రైతు బ్యాంకు నుంచి రూ. 3.4 లక్షలు అప్పు తీసుకొని ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు ఈ అప్పు, దాని మీద వడ్డీ కింద రూ. 4.1 లక్షల వరకు బ్యాంకుకు కట్టాడు. కరువు కారణంగా ఈసారి పంట సరిగ్గా పండకపోవడంతో రెండు నెలల వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో బ్యాంకు అధికారి వెంట వచ్చిన పోలీసులు 40 ఏళ్ల ఆ బక్క రైతును చితకబాది.. అతని ట్రాక్టర్‌ను లాక్కొని వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రైతు భార్య విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది. 'వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మల్యాను యథేచ్ఛగా వదిలిపెట్టి.. మా పేద రైతులను మాత్రం వేధిస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాలం కలిసిరాక పంటలు పండక రుణవాయిదాలు చెల్లించలేకపోయానని బాలన్ ఎంత వేడుకున్నా.. పోలీసులు కనికరించలేదు. ఆయన నుంచి ట్రాక్టర్ ను బలవంతంగా స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో చేతికొచ్చిన చెరుకు పంటను స్థానిక మార్కెట్ కు ఎలా తీసుకెళ్లాలో తెలియక బాలన్ మథనపడుతున్నారు. అయితే స్థానిక ఐజీ సెంథమరై కన్నన్ మాత్రం తాము కోర్టు ఆదేశాలను మాత్రమే అమలుచేశామని, ఆ రైతు నుంచి ట్రాక్టర్ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని విలేకరులకు తెలిపారు. -
రోడ్డుపైనే తాళి కట్టిన ప్రియుడు
చెన్నై : ప్రియురాలిని ఆమె కుటుంబ సభ్యులు తన నుంచి ఎక్కడ దూరం చేస్తారనే భయంతో ఓ ప్రియుడు రోడ్డుపైనే తాళి కట్టేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని తంజావూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అదే ప్రాంతంలోని ప్రయివేటు కళాశాలలో ఒకే తరగతిలో చదువుతున్నారు. వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియటంతో వారు ఆమెను మందలించారు. అయినా దివ్య తల్లిదండ్రుల మాట వినకపోవటంతో ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి తీసుకెళ్లి అక్కడ నిర్బంధించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వచ్చాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దివ్యను తీసుకుని బస్టాండు చేరుకున్నాడు. అయితే దివ్య ఇంట్లో లేకపోవటంతో ఆమె బంధువులు వెతుక్కుంటూ బస్టాండ్ చేరుకున్నారు. దీంతో ఆనంద్ దిక్కుతోచని స్థితిలో హఠాత్తుగా రోడ్డుపైనే తను ప్రేయసి మెడలో తాళి కట్టాడు. ఊహించని ఈ సంఘటనతో బస్టాండులోని ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా ఆ సమయంలో అక్కడే ఉన్న తంజావూరు వైద్య కళాశాల పోలీసు ఇన్స్పెక్టర్ బాలమురుగన్ ఆ ప్రేమజంటను తన జీపులో ఎక్కించుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం ప్రేమజంటను విచారించిన పోలీసులు....వారిద్దరూ మేజర్లు కావడంతో వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
కారు బోల్తా: ఇద్దరు మెడికోలు మృతి
కారు ప్రమాదంలో ఇద్దరు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మరణించగా, మరో ఏడుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటన తమిళనాడులోని తంజావూర్ సమీపంలో పుదుక్కుడిలో గురువారం చోటు చేసుకుంది. మృతులు మహ్మమద్ నియాజ్ (21), దివ్య భారతి (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను తిరుచినాపల్లిలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కారులో ప్రయాణిస్తున్నవారంతా చెన్నైలోని ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో డెంటల్ కోర్స్ అభ్యసిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థులంతా పట్టుకొటాయి నుంచి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
భక్తులపై దాడి చేసిన సైకో అరెస్ట్
తిరుమల : తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని తిరుపతి క్రైం బ్రాంచ్‌కు విచారణ నిమిత్తం తరలించారు. ఈనెల 19న తమిళనాడుకు చెందిన గోవింద త్యాగరాజన్ దంపతులపై సైకో దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. నిందితుడు దక్షిణామూర్తి తమిళనాడు నాగపట్నం వాసిగా పోలీసులు గుర్తించారు. అతడు మరోసారి అలిపిరి కాలిబాటలో సంచరిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకునేందుకు తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలినడక కొండపైకి బయలుదేరారు. ఆ దంపతులు అక్కగార్ల గుడి సమీపంలోకి రాగానే 25 ఏళ్ల యువకుడు వారిపై అకస్మాత్తుగా కత్తితో దాడి చేశాడు. గోవిందరాజస్వామి భార్యపై కత్తితో దూసుకువచ్చాడు. ఆ క్రమంలో ఉన్మాదిని ఆమె భర్త గోవిందరాజస్వామి అడ్డుకోబోయాడు. దాంతో ఆగ్రహించిన ఉన్మాది గోవిందరాజస్వామి గొంతు కోశాడు. ఆ తర్వాత అతడి భార్యపై దాడి చేశాడు.ఆ ఘటనలో దంపతులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని చికిత్స నిమిత్తం రుయా ఆస్పత్రికి తరలించారు. -
నడక దారిలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి: తిరుమల కాలిబాటలో భక్తులపై ఉన్మాది దాడి నేపథ్యంలో తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. నడక దారిలో భద్రతను మరింత పెంచాలని నిర్ణయించింది. ముఖ్యంగా రాత్రి వేళలో గస్తీ ముమ్మరం చేయాలని భావిస్తోంది. అలిపిరి చెక్ పోస్టు వద్ద విస్తృత తనిఖీల అనంతరమే నడకదారిలోకి భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఉన్మాది దాడిలో గాయపడిన గోవిందరాజస్వామి దంపతులు రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల తరపు బంధువులు తంజావూర్ నుంచి తిరుపతి చేరుకున్నారు. అయితే దాడి చేసింది ఉన్మాది కాదని చైన్ స్నాచర్‌గా అనుమానిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ అధికారి హన్మంతు వెల్లడించారు. బంగారం, నగదు కోసమే ఆ దాడి చేసి ఉంటాడని తాము భావిస్తున్నామని తెలిపారు.