తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన దంపతులపై కత్తితో దాడి చేశాడు.
తిరుమల : తిరుమల నడక దారిలో వెళ్తున్న భక్తులపై ఓ ఉన్మాది దాడికి పాల్పడ్డాడు. తమిళనాడుకు చెందిన దంపతులపై కత్తితో దాడి చేశాడు. తంజావూర్‌కు చెందిన గోవిందరాజస్వామి దంపతులు కాలిబాటను తిరుమలకు బయలు దేరారు. బుధవారం ఉదయం ఐదు గంటల సమయంలో అక్కగార్ల గుడి దగ్గర సుమారు 25 ఏళ్ల ఉన్మాది ఒక్కసారిగా దంపతులపై దాడి చేశాడు.
నల్ల రంగు ఫ్యాంట్, టీ షర్ట్ ధరించిన ఉన్మాది.. కత్తితో గోవిందరాజస్వామి భార్యపై దూసుకువచ్చాడు. దీంతో అడ్డుకోబోయిన గోవిందరాజస్వామిని బలంగా గొంతుపై కోశాడు. ఆ తరువాత... అతని భార్యపై కూడా దాడి చేశాడు. గాయపడినవారిని మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు మాట్లాడుతూ ఉన్మాది కోసం నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు.