భక్తులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ | tirumala police arrest attacker in devotees | Sakshi
Sakshi News home page

భక్తులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

Published Sat, Feb 15 2014 10:50 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

భక్తులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్ - Sakshi

భక్తులపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్

తిరుమల : తిరుమల నడకదారిలో భక్తులపై దాడి చేసిన మతి స్థిమితంలేని వ్యక్తిని తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. సైకోలా ప్రవర్తించిన వ్యక్తి తమిళనాడు అంబత్తూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. ఇతను కొన్ని రోజులుగా అలిపిరి నడకదారి పరిసరాల్లో తిరుగుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది.

శనివారం తెల్లవారుజామున నరసింహ స్వామి ఆలయ సమీపంలో తమపై కుమార్‌ రాళ్లు కర్రలతో దాడి చేసినట్టు భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దాడి చేసి పరారైన కుమార్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. కుమార్‌ను వైద్య చికిత్స కోసం రుయాకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement