► అభ్యర్థులను అనర్హులను చేయండి
►తంజావూరు, అరవకురిచ్చిల ఉపఎన్నికలపై వ్యాజ్యం
►విచారిస్తామని న్యాయమూర్తుల హామీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన తంజావూరు, అరవకురిచ్చి అభ్యర్థులు తాజా ఉపఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. కరూరు జిల్లా పల్లపట్టి గ్రామానికి చెందిన ఏఏ సాధిక్ ఆలి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అందులో ఈ ఏడాది మేలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో మధురై జిల్లా అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థిసెంథిల్ బాలాజీ, డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామి, తంజావూరు నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఓటర్లను మభ్యపెట్టే రీతిలో వ్యవహరించారు.
ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులపై అనేక క్రిమినల్ కేసులు దాఖలయ్యారుు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. ప్రస్తుతం ఇవే నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు, 19వ తేదీన పోలింగ్ జరుగుతుండగా గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న అభ్యర్థులే పోటీ చేస్తున్నారు. ఎన్నికల నిబంధనలను ధిక్కరించి అక్రమాలకు పాల్పడిన రాజకీయ పార్టీలు, ఎన్నికల చిహ్నం, అభ్యర్థులపై భారత ఎన్నికల కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. అలాగే సదరు అభ్యర్థులకు సంజారుుషీ నోటీసులు జారీచేయాల్సి ఉంది. వారి నుంచి వివరణ వచ్చే వరకు ఆయా పార్టీలు, అభ్యర్థులు, చిహ్నం లపై తాత్కాలిక నిషేధాన్ని విధించాల్సి ఉంది. అరవకురిచ్చి, తంజావూరు నియోజకవర్గాల్లో అటువంటి చర్యలు ఏమీ చేపట్టలేదు.
అరవకురిచ్చి, తంజావూర్లలో ఈనెల 19వ తేదీన ఉప ఎన్నికలు సజావుగా, నీతిబద్ధంగా జరగాలంటే అన్నాడీఎంకే, డీఎంకే తదితర అభ్యర్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సెంథిల్ బాలాజీ, కేసీ పళనిస్వామి పేర్లను ఉప ఎన్నికల బ్యాలెట్ పేపర్ల నుంచి తొలగించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి. అన్నాడీఎంకే, డీఎంకే ఎన్నికల చిహ్నంను వారికి కేటారుుంచరాదు. ఎన్నికల్లో పోటీకి వారు అనర్హులని ప్రకటించాలని ప్రజాప్రయోజన వాజ్యంలో పేర్కొన్నాడు.
ఈ వాజ్యం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఆర్ మహాదేవన్‌ల ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన న్యాయవాది తన వాదనను వినిపిస్తూ, క్రిమినల్ కేసుల్లో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం అమల్లో ఉంది. క్రిమినల్ కేసుల్లో చార్జిషీట్ దాఖలైన వారిని కూడా అనర్హులుగా చేయాలనే అంశం ఎన్నికల కమిషన్ పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. తంజావూరు, అరవకురిచ్చిలపై ఇప్పటికే మరో కేసు విచారణలో ఉన్నందున ఈ వాజ్యాన్ని సైతం వాటితో కలిపి విచారిస్తామని న్యాయమూర్తులు బదులిచ్చారు.
ఉపఎన్నికలపై పిల్
Published Tue, Nov 8 2016 3:49 AM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM
Advertisement
Advertisement