తమిళనాడులో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వం రేపు అసెంబ్లీలో బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. బలపరీక్షలో పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని విపక్ష డీఎంకే ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రేపు అసెంబ్లీ హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు.