అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. అసెంబ్లీలో రేపు పళనిస్వామి ప్రభుత్వం బలం నిరూపించుకోనున్న నేపథ్యంలో సెల్వం వర్గం దూకుడు పెంచింది. పార్టీపై పట్టు సాధించేందుకు శశికళ వర్గీయులను బయటకు పంపుతోంది. ఏకంగా మఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామినే పార్టీ పదవి నుంచి తప్పించినట్టు ప్రకటించింది. సాలేం జిల్లా కార్యదర్శిగా ఉన్న పళనిస్వామితో సహా 13 మంది జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శులను తొలగిస్తున్నట్టు పన్నీర్ వర్గంలో ఉన్న ప్రిసిడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. అన్నా డీఎంకే నుంచి శశికళను, ఆమె బంధువులు దినకరన్, వెంకటేష్‌లను బహిష్కరించినట్టు ఈ ఉదయం ఆయన తెలిపారు.