తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం | Jallikattu in Tamil Nadu, Woman Died | Sakshi
Sakshi News home page

తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. విషాదం

Published Thu, Jan 16 2020 2:33 PM | Last Updated on Thu, Jan 16 2020 2:43 PM

Jallikattu in Tamil Nadu, Woman Died - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని మధురై జిల్లాలో జల్లికట్టు పోటీలు జోరుగా కొనసాగుతున్నాయి. అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో పోటీలు జరుగుతున్నాయి. తెల్లవారుజామునే జల్లికట్టు ప్రాంగణానికి ఎద్దులు, ఔత్సాహికులు చేరుకున్నారు. ఈ రోజు పాలమాడులో పోటీల్లో పాల్గొనడానికి 700 ఎద్దులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయని అధికారులు తెలిపారు. పోటీల్లో పాల్గొనే ఎద్దులకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు కొనసాగుతున్నాయి. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు. బుధవారం జరిగిన జల్లికట్టు పోటీల్లో 32 మంది గాయపడ్డారు.

విషాదం
చెన్నై: తిరుచ్చి సురయూర్‌లో గురువారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో విషాదం చోటుచేసుకుంది. జల్లికట్టు పోటీల్లో భాగంగా ఎద్దులు జనంపైకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందగా, ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement