
అశ్విన్ రైలెక్కాడు...
చెన్నై: భారత ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సొంతగడ్డపై కొత్త అనుభవం ఎదురైంది. మూడో వన్డే తర్వాత అతను కోల్‌కతా నుంచి సోమవారం చెన్నై చేరుకున్నాడు. అయితే జల్లికట్టు వివాదం కారణంగా రోడ్లన్నీ స్థంభించిపోవడంతో అక్కడినుంచి తన కారులో ఇంటికి చేరుకోవడం అసాధ్యంగా కనిపించింది. దాంతో అశ్విన్ మెట్రో రైల్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. ఎయిర్‌పోర్ట్ నుంచి తన ఇల్లు ఉన్న వెస్ట్ మాంబళంకు అతను ట్రైన్‌లో ప్రయాణించాడు.
సహచర ప్రయాణీకులు కూడా అశ్విన్ తమతో పాటు రైలులో రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ‘ఇలాంటి పరిస్థితులే మనల్ని ప్రజా రవాణా వ్యవస్థను వాడేటట్లు చేస్తాయి. నన్ను భద్రంగా తీసుకెళ్లిన ఎయిర్ పోర్ట్ పోలీసులకు కృతజ్ఞతలు’ అని అశ్విన్ ట్వీట్ చేశాడు.