Dahi Handi
-
తీర్పులపై తిరస్కారం
విశ్లేషణ కృష్ణాష్టమి సందర్భంగా జరుగుతున్న దహిహండి కార్యక్రమాలు రాజకీయ ప్రదర్శనగా మారిపోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యానిస్తూ బాలకృష్ణుడు వెన్న దొంగిలించాడే కానీ విదూషక పాత్ర పోషించలేదన్నది. న్యాయ విచారణను ఎదుర్కొనే పరిస్థితులు ఎదురైనప్పుడు సాధా రణంగా మన రాజకీయ నేతలూ, పార్టీలూ తమకు న్యాయ వ్యవస్థ అంటే ఎనలేని విశ్వాసం ఉం దని, తీర్పుకోసం వేచి ఉంటా మని చిలక పలు కులు వల్లిస్తుంటారు. కానీ కోర్టు ఎదుట హాజరు కావడానికి ముందు కూడా వారు న్యాయస్థానాన్ని ఏమాత్రం ప్రశ్నించలేకపోతున్నందున వీరి చిలక పలుకులు ఇప్పుడు మీడియా ముందు గొట్టిమాట లుగా కనిపిస్తున్నాయి.తీర్పు నేతలకు వ్యతిరేకంగా వచ్చిన తర్వాత కూడా, ఇప్పటికీ తమకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉందని మాట్లాడుతూనే వారు అప్పీలుకు ప్రయత్ని స్తారు. కానీ షా బానో కేసు వంటి ఉదంతాల్లో న్యాయవ్యవస్థ తీర్పులను మొదట ఒక ఆర్డినెన్సు ద్వారా, పార్లమెంటు తోసిపుచ్చుతూ ఉంటుంది. తర్వాత ఆ తీర్పును పూర్తిగా వెనక్కు మళ్లించే పాత్రను శాసనాధికారం పోషిస్తుంది. కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు (దహిహండి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ల ఎత్తు 20 అడు గులకు మించి ఉండరాదని, 18 ఏళ్లలోపు వయస్సు వారు ఆ పిరమిడ్లలో భాగం కాకూడదని బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీ వల ఎత్తిపట్టినప్పుడు మహారాష్ట్రలో దాదాపు ఇలాగే జరిగింది.తీర్పు వెలువడగానే, మహారాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించి దహిహండి కార్యక్రమం ఒక సాహస క్రీడ అంటూ తీర్మానం జారీ చేసింది. కాని సాంప్రదాయం ప్రకారం ఇది మతపర కార్యక్ర మంగా ఉన్నందున అలాంటి పరిమితులు మనోభా వాలను గాయ పర్చవచ్చని అదే రోజు ప్రారంభంలో ప్రభుత్వ లాయర్లు వాదించారు. ఇది రెండు నాలి కల వ్యవహారమే కాకుండా న్యాయ ప్రక్రియకు ఎంతో దూరం జరుగుతుంది కూడా. అయితే అనూహ్య పరిణామం ఏమంటే, కోర్టు తీర్పును అత్యంత పరిహాసాస్పదంగా తోసిపుచ్చిన ఘటన చోటు చోసుకోవడమే. రాజ్‌థాకరే నేతృ త్వంలో శివసేన నుంచి చీలివచ్చిన మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన కోర్టు తీర్పును ధిక్కరించాలని నిర్ణయిం చుకుంది. మనిషిపైన మనిషిని ఎత్తుగా నిలబె డుతూ సాగే ఈ క్రీడ కు ప్రధాన కేంద్రంగా ఉన్న థానేలో జరిపిన భారీ కార్య క్రమాన్ని అడ్డుకునేవారే లేకపోయారు.న్యాయవ్యవస్థ తీర్పులను గౌరవించడం అంత రించిపోతున్న స్థితిలోకి దేశం వెళ్లిపోతుందా అనే సీరియస్ చర్చకు ఇది దారితీయాలి. అత్యున్నత న్యాయస్థానంలో ఇలాంటి చర్యకు వ్యతిరేకంగా ఈప్పీల్ చేయడానికి బదులుగా స్వార్థపర శక్తులు ఆ తీర్పును ప్రతి ఘటించే లేదా ధిక్కరించే మార్గాన్ని ఎంచుకున్నాయి. కానీ పార్టీలు ఈ అపరాధం నుంచి తప్పించుకోలేవు. బంద్‌పై నిషేధాన్ని ధిక్కరించిన శివసేకు బాంబే హైకోర్టు గతంలో జరి మానా విధిం చింది కూడా. ప్రధానంగా రాజ్‌థాకరే నిర్ణయం వల్లే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ధిక్కారానికి గురైంది. కోర్టు తన తీర్పు ప్రకటించిన గంటల్లోపే రాజ్‌థాకరే దాన్ని మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ అభ్యంతరం చెప్పారు. తిరస్కారం ఎంత పతాక స్థాయికి వెళ్లిందంటే ఉట్టి కొట్టే ఒక గోవిందుల బృందం ముంబైలో 40 అడుగుల ఎత్తు తాకేలా 11 అంతస్తుల మానవ పిరమిడ్‌ను నిర్మించేసింది. ఇది ఒకానొక ఘటన మాత్రమే కాదు. చాలా మంది కోర్టు ఆదేశాన్ని ధిక్కరించడానికే నిర్ణయించు కున్నారు. ఇక అధికారులు దాన్ని అడ్డుకునేందుకు బదులుగా అలాంటి ఘటనలను వీడియో తీసి ఊర కుండిపోయారు. ఇకపోతే థానే, ముంబై పురపాలక ఎన్నికల్లో శివసేనను అధిగమించి అధికార పగ్గాలు స్వీకరించాలని భావిస్తున్న బీజేపీ కూడా ఈ విష యంలో ప్రజాగ్రహానికి గురికావలసి ఉంటుందనే భీతితో మౌనంగా ఉండిపోయింది. ఉట్లు కొట్టడానికి సంబంధించిన ఈ దహి హండి కార్యక్రమాలు మత పరమైన సాంప్రదా యంగా కాకుండా రాజకీయ ప్రదర్శనగా మారి పోయాయి. సుప్రీంకోర్టు సైతం దీనిపై వ్యాఖ్యా నిస్తూ బాల కృష్ణుడు కొంటె చేష్టలకు పాల్పడి వెన్న దొంగిలించాడు తప్పితే విదూషక పాత్ర పోషించ లేదని ఎత్తి చూపింది.ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయనేతలే కీలక ఆర్గనైజర్లుగా ఉంటున్నారు. ఉట్ల ప్రదర్శనను నిర్వహిస్తున్న వీరికి చెందిన ట్రస్టులు మతపరమైన పండుగ అనే విశ్వాసం ఇప్పుడు పెద్ద ప్రదర్శన స్థాయికి చేరిందని మాట్లాడుతున్నాయి. అయితే దాని మూలాలు మతంలోనే ఉండవచ్చు కానీ బాల దేవుడి కొంటె చేష్టలను కొత్తగా అనుకరిస్తున్నప్పుడు అది పూర్తిగా మరో రకంగా కనిపిస్తూండటం గమనార్హం. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేశ్ విజాపుర్కార్ ఈమెయిల్ : mvijapurkar@gmail.com -
ఔను! చట్టాన్ని ఉల్లంఘిస్తాం!
థానే: సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) బేఖాతరు చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా గురువారం థానెలో ఉట్టికొట్టేందుకు ఏకంగా 40 అడుగుల మానవ పిరమిడ్‌ను నిర్మించింది. అంతేకాకుండా 'నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను' అనే రాతలు ఉన్న టీషర్ట్లు ధరించి ఎమ్మెన్నెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి వేడుకలపై సుప్రీంకోర్టు బుధవారం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉట్టికుండ కొట్టేందుకు 20 అడుగుల ఎత్తుకుమించి మానవ పిరమిడ్లను నిర్మించవద్దని, మైనర్లు ఈ వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉట్టి ఉత్సవాల్లో పలు ప్రమాదాలు జరిగే ప్రాణాపాయం సంభవిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. కానీ, మహారాష్ట్రలో చాలాచోట్ల ఆదేశాలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో ఘనంగా జరిగే కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. 'మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ అంచెలు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను' అని రాజ్ ఠాక్రే మీడియాతో పేర్కొన్నారు. -
దహీ హండీ ఒలింపిక్ గేమా : సుప్రీం కోర్టు
-
దహీ హండీ ఒలింపిక్ గేమా : సుప్రీం కోర్టు
ముంబై: శ్రీకృష్ట జన్మాష్టమి సందర్భంగా మహారాష్ట్రలోని ముంబైలో నిర్వహించే అతిపెద్ద మానవ పిరమిడ్ ఉత్సవం 'దహీ హండీ' పై గతంలో తామిచ్చిన తీర్పుపై పునరాలోచించే ఉద్దేశం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉట్టి ఎత్తు పెంచడమనేది భయంకరమైనదిగా కోర్టు అభివర్ణించింది. ఇందులో ఏమైనా ఒలింపిక్ మెడల్ ఇస్తారా? ఇస్తే మేము చాలా సంతోషిస్తాం అని కోర్టు వ్యాఖ్యానించింది. గతంలో ఉట్టి ఎత్తు 20 అడుగులకు మించరాదని సుప్రీం ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాల్సిందిగా ముంబైకి చెందిన కొందరు కోర్టును ఆశ్రయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ పిరమిడ్ గా 'దహీ హండీ' గిన్నిస్ రికార్డులో స్థానం సంపాదించిందని పిటిషనర్ న్యాయస్థానానికి వివరించారు. దాదాపు అన్నిపార్టీలు ఉట్టిఎత్తును పెంచమని కోరుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం పిరమిడ్ ఎత్తును 25 అడుగులకు పెంచాల్సిందిగా గతంలో కోర్టను కోరింది. ఎత్తును తగ్గించలేమని కోర్టు స్పష్టం చేసింది. దహి హండీ అంటే: ముంబైలో మట్టి కుండలో పెరుగును నింపి దాన్ని అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు. ఈ మట్టి కుండను పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు చేసి కుండను పగులగొట్టేందుకు పోటీపడతారు. ఈ క్రమంలో కొందరు గాయాలపాలవుతుంటారు. -
దహి హండీపై సర్కారుకు సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే అతిపెద్ద మానవ పిరమిడ్ ఉత్పవం 'దహి హండీ' పై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందులో 18 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు పాల్గొనరాదని, పిరమిడ్ ఎత్తు 20 అడుగలకు మించరాదని కోర్టు తీర్పునిచ్చింది. ఉత్కర్ష్ మహిళా సామాజిక్ సంస్థ కార్యదర్శి స్వాతి పాటిల్ ప్రభుత్వం 'దహి హండీ' ఉత్సవం సందర్భంగా కోర్టుతీర్పును పాటించడం లేదని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలుచేశారు. గతంలో మహారాష్ట్ర్ర న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అగస్టు 3న సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా తీర్పు నిచ్చింది. దహి హండీ అంటే: ముంబైలో మట్టి కుండలో పెరుగును నింపి దాన్ని అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు. ఈ మట్టి కుండను పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు చేసి కుండను పగులగొట్టేందుకు పోటీపడతారు. ఈ క్రమంలో కొందరు గాయాలపాలవుతుంటారు. -
విదేశీ గడ్డపై ‘ఉట్టి’
సాక్షి, ముంబై : నగరంలో మహిళా దహిహండీ బృందాలకు మొట్టమొదటిసారిగా విదేశాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం దక్కింది. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో దివాలి సంబరాల పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీన మహిళలతో నిర్వహించే దహి హండీ హైలెట్ కానుందని అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో టైమ్స్‌స్క్వేర్‌లో పురుష దహిహండీ బృందాలు ప్రదర్శన నిర్వహించాయి. అయితే మహిళా గోవింద బృందాలు అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. 20 మంది సభ్యులు గల గోవిందా బృందంలో 18 మంది మహిళా గోవిందులు కాగా, ఇద్దరు సమన్వయకర్తలు ఉంటారు. దహిహండీ సమన్వయ్ సమితి (ఎంటీడీసీ) సభ్యులు వివిధ దహిహండీ బృందాల నుంచి జట్టు సభ్యులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక విభాగం ఈ బృందం కోసం వీసాతోపాటు వసతి, భోజన సదుపాయాలను స్పాన్సర్ చేయనుంది. బృందం సభ్యులు మాత్రం తమ టికెట్ కోసం రూ.75 వేల ఖర్చును సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా బృందం సమన్వయకర్త గీతా జగాడే (32) మాట్లాడుతూ.. విదేశాలలో తాము ప్రదర్శన ఇవ్వబోతుండటం ఆనందంగా ఉందన్నారు. అయితే తమకు సహాయ సహకారాలు అందించేందుకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదన్నారు. కనీసం దహి హండీ నిర్వాహక మండళ్లు నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. తమ బృందం న్యూయార్క్ వెళ్లాలంటే సుమారు రూ.10 లక్షలు అవసరం ఉంటాయని ఆమె తెలిపారు. దహిహండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పదాల్కర్ మాట్లాడుతూ బృందం అక్కడికి వెళ్లేందుకయ్యే ఖర్చును ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుందని తాము ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను కలిశామని కాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ బృందానికి బీఎంసీ కనీసం రూ.రెండు లక్షలైనా సాయం చేయాలని స్వతంత్ర కార్పొరేటర్ విజయ్ తాండెల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళా బృందానికి మేయర్ స్నేహల్ అంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే సహాయం కూడా కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
ముంబైలో అదరగొట్టిన యువత!
ముంబై: నగరంలో లక్షల మంది భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమిని అత్యంత వైభవంగా, ఆనందోత్సాహల మధ్య జరుపుకున్నారు. 'దహి హండి' పేరుతో ఏర్పాటు చేసిన పెరుగుతో నిండిన మట్టి కుండను చేరుకొని, దానిని పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నగరంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. వీధులన్నీ గోవిందులు(దహి హండిలో పాల్గొనేవారు)తో నిండిపోయాయి. గోవిందులు పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ, రంగులు చల్లుకుంటూ ఎంతో ఆనందంతో ఈ పండుగను జరుపుకుంటున్నారు. యువకులు హిందువులు ఈరోజును శ్రీకృష్ణుడు జన్మించిన రోజుగా భావించి ఈ పండుగను జరుపుకుంటారు. దహి మండి కార్యక్రమంలో 9 అంతస్తులుగా మానవ పిరమిడ్ నిర్మిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే గ్రూపుకు కొన్ని చోట్ల మోగా ప్రైజ్ మనీ కోటి రూపాయల వరకు ఇస్తారు. ఇదిలా ఉండగా, 'దహి హండి' సందర్భంగా మానవపిరమిడ్ ఏర్పాటు చేస్తుండగా దాదాపు 20 మంది యువకులు(గోవిందులు) గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సియోన్, కెఇఎం ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 18 సంవత్సరాల లోపు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొనకూడదని బొంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.