దహి హండీపై సర్కారుకు సుప్రీం ఆదేశం | Dahi Handi: SC Says No to Minors, Human Pyramids Shouldn't Exceed 20 feet | Sakshi
Sakshi News home page

దహి హండీపై సర్కారుకు సుప్రీం ఆదేశం

Published Wed, Aug 17 2016 2:38 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

దహి హండీపై సర్కారుకు సుప్రీం ఆదేశం - Sakshi

దహి హండీపై సర్కారుకు సుప్రీం ఆదేశం

న్యూఢిల్లీ: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముంబైలో నిర్వహించే అతిపెద్ద మానవ పిరమిడ్ ఉత్పవం 'దహి హండీ' పై సుప్రీం కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందులో 18 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు పాల్గొనరాదని, పిరమిడ్ ఎత్తు 20 అడుగలకు మించరాదని కోర్టు తీర్పునిచ్చింది. ఉత్కర్ష్ మహిళా సామాజిక్ సంస్థ కార్యదర్శి స్వాతి పాటిల్ ప్రభుత్వం  'దహి హండీ' ఉత్సవం సందర్భంగా కోర్టుతీర్పును పాటించడం లేదని ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో దాఖలుచేశారు. గతంలో మహారాష్ట్ర్ర  న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్పష్టత ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అగస్టు 3న సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన  కోర్టు పై విధంగా తీర్పు నిచ్చింది.
దహి హండీ అంటే:
ముంబైలో మట్టి కుండలో  పెరుగును నింపి దాన్ని అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు.  ఈ మట్టి కుండను పగులగొట్టడానికి యువకులు అద్భుతంగా మానవ పిరమిడ్లను ఏర్పాటు  చేసి కుండను పగులగొట్టేందుకు పోటీపడతారు.  ఈ క్రమంలో కొందరు గాయాలపాలవుతుంటారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement