విశ్లేషణ
‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు ఒక మిత్రుడు. చివరకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు.
ముంబై వాసులు దిటవు గుండెల వారు. ఎలాంటి ఇబ్బందినైనా త్వరితగతిన అధిగమించగలుగుతారు. 1993 నాటి మతకల్లోలాలను, ఆ తదుపరి సంభవించిన ముంబై వరుస బాంబు దాడు లను, చివరికి 2005 నాటి కుంభవృష్టి సృష్టించిన ఉప ద్రవాన్ని కూడా వారు తట్టుకోగలిగారు. అయితే, ఆనాటి కుంభవృష్టి మాత్రం వారి మనస్సుల్లో సజీవంగా నిలి చిపోయింది. భారీ వర్షాలు పడ్డప్పుడల్లా వారు ఆందో ళనకు గురవుతుంటారు. ఆగస్టు 29న కూడా అదే జరి గింది. నగరం తిరిగి కోలుకుని యథాత«థ స్థితికి చేరింది. ఆ రోజున ఒక డాక్టర్ మూతలేని ఓ మ్యాన్‌హోల్‌లో పడి, కొట్టుకుపోయిన ఘటనకు కారణాలను నగర ప్రభు త్వానికి, కోర్టులకు వదిలేశారు. సెప్టెంబర్ 20న ఆ ప్రాంతంలో మరోమారు గాలివానలు కురిసినప్పుడు అనవసరమైన భయం వ్యాపించింది.
ఆ భయానికి కారణం సామాజిక మాధ్యమాలు. ఆ రోజున మధ్యాహ్నం సరిగ్గా 3 గంటలకు తుఫాను కేంద్రం ముంబైను తాకుతుందనే ఒక సందేశం సోషల్ మీడి యాలో చక్కర్లు కొట్టడంతో ఆందోళన తారస్థాయికి చేరింది. కార్యాలయాలన్నీ ఖాళీ అయిపో యాయి. భారీ వర్షాలకు ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ముందే మూసే శారు. కానీ, ఆగస్టులో విద్యామంత్రి పంపిన ట్వీటర్ సందేశాన్ని ఎవరో కొందరు సెప్టెంబర్ 20న తిరిగి ట్వీట్ చేశారు. అసలు తుపాను ఏర్పడే పరి స్థితులు పెంపొందుతున్నాయనే ప్రకటనే వెలువడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ సందే శాలు ఉద్దేశపూర్వకంగా చేసిన తుంటరి పనుల కోవకు చెందుతాయి. తుపాను పరిస్థితులు నిజం గానే పెంపొందడానికి నాలుగు నుంచి ఆరు రోజులు పట్టింది. దాని కదలికలను చక్కగా గుర్తించగలిగారు. కాబట్టి అది హఠాత్తుగా ప్రజలపైకి వచ్చి పడలేదు.
అంతకు ఒక వారం ముందు, ఆహారం, నీళ్లు, పాలు, మందులు తదితరాలను నిల్వ చేసుకోమని ప్రజలు కోరుతూ మరో సందేశం చక్కర్లు కొట్టింది. అది కూడా ఒక్క కుదుపు కుదిపేసింది. తుపాను హెచ్చరిక ఏదీ జారీ చేయలేదనే వివరణతో మునిసిపల్ కార్పొ రేషన్, పోలీçసులు ప్రకటించారు. కానీ, ముంబై వాసులు తాము దేన్ని నమ్మదలుచుకునారో దాన్నే... ఎక్కడ నుంచి వచ్చిందో తెలియని ఓ వాట్సాప్ సందేశాన్ని నమ్మారు. ఎందుకైనా మంచిదని ప్రజలు జాగ్రత్త వహిం చారని దీని గురించి అనుకోవచ్చు. కానీ ఇది రెండు కీలక అంశాలను సూచిస్తోంది. ఒకటి, క్షీణిస్తున్న మీడియా విశ్వసనీయత. టీఆర్‌పీ రేటింగ్‌ల కోసం దేనినైనా సరే సంచలనాత్మకం చేయా లని కొత్త వార్తా చానళ్లు పడే ఆరాటం దీనికి కారణం. రెండు, ఏ ప్రయోజనాలనూ ఆశించని వారు ఇతరులకు సహాయం చేయాలనే కోరికతో పంపినది కాబట్టి సోషల్ మీడియా సందేశం నమ్మదగినదనే విశ్వాసం. బూటకపు వార్తల ప్రచారానికి ఎక్కువగా వాడేది సోషల్ మీడి యానే. కాగా, సంప్రదాయక మీడియాను బూటకపు వార్తలను వ్యాపింపజేసిదిగా చూస్తున్నారు.
వాతావరణ సంస్థ కార్యాలయం వారి చిత్రాల సహాయంతో నేను ఈ తుపాను పుకార్లను అదే సామా జిక మధ్యమాన్ని వేదికగా చేసుకుని ఎదుర్కొన్నాను. ‘సామాజిక మాధ్యమాల’కు వంచించగల సామర్థ్యం ఉన్నదనడం ఎక్కువ మందినేం చికాకు పెట్టలేదు. సామాజిక మాధ్యమాలను వాడుకుని నిరాధారంగా అబ ద్ధాలను, అతిశయోక్తులనూ చెబుతూ ప్రత్యర్థులపైన ఎలా అప్రతిష్టపాలు చేశారో కొందరు గుర్తు చేశారు. ఇది ‘సామాజికమైనది’ కాదు, ‘అసామాజికమైనది’ అనేది చికాకు పడ్డవారందరి సాధారణాభిప్రాయం. వాటిని ఉపయోగిస్తున్నది అందుకోసమేనని వారి వాదన. సరిచూసుకోలేని సమాచారం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుండగా, తాము సమకూర్చుకునే సమాచారం విశ్వసనీయతను రూఢిచేసుకునే ఏర్పాట్లున్నాయని ఆశిం చగల వ్యవస్థాగత మీడియా ఇప్పడు అనుమానాస్పదమై నదిగా మారింది. ‘‘మీరు నా పై ఆరోపణ చేస్తారా? మీరు అదే చేశారుగా, మీరు చెయ్యలేదూ?’’ అనే ఇలాంటి కుతర్కపు చర్చలు సైతం ఇతర వేదికలపై సాగుతున్నాయి. ఈ కపట తర్కం, ముఖ్యమైన సమస్యలను విస్మరించి సమాజానికి అపారమైన నష్టాన్ని కలు గజేస్తుంది.
ఊరి బావి వద్ద ఊసుపోత కబుర్లు తక్కువ హానికరం. అవి ప్రచారమయ్యే క్రమంలో మరిన్ని మసాలాలను పులు ముకునే క్రమంలో అతిశయోక్తులకు దారి తీస్తాయి. ఇదొక ముఖ్యాంశమే. కానీ దాని భౌగోళిక ప్రాంతం తక్కువ. మెరుపు వేగంతో సామాజిక మాధ్యమాలు సరిహద్దు లను దాటుతాయి. వార్తా పత్రికలు, టీవీల వార్తలపై ఆధారపడేవారు ‘‘ఇది వాట్సాప్‌లో వచ్చింది. టీవీలో ఎందుకురాలేదు?’’ అని అడుగుతారు.
ఇటీవలే హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక మిత్రుడు ‘‘చిట్టచివరకు ఒక భీకర శక్తి వేళ్లూనుకుంది. అది నిజం గానే భయం పుట్టించేది’’ అన్నాడు. మరో మిత్రుడు ‘‘విచక్షణాశక్తిని అతి తక్కువకు కుదించడంగా సోషల్ మీడియా మారిపోయింది. మా దేశంలో విచక్షణా శక్తి మరీ అధ్వానమైనంత తక్కువగా ఉంది’’ అన్నాడు. చివ రకు ఎవరైనా అదే నిర్ధారణకు వస్తారు. సందేహాస్ప దమైన సందేశాలను ఎలాంటి ఆలోచనాలేకుండా ఫార్వార్డ్ చేయడాన్ని పక్కన పెడితే... సోషల్ మీడియా వల్ల ముఖ్యమైన, సహాయకరమైన ప్రయోజనాలు ఉన్న మాట నిజమే. కాకపోతే, వాటిలో సభ్యులుగా చేరే వారు ‘ఫార్వార్డ్’ కీ నొక్కడానికి ముందు ఒకటికి రెండుసార్లు తీవ్రంగా ఆలోచించాలి.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com