భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగ్గా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజ నాల కారణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టం గానే కనిపిస్తుంది. పార్టీ ఆశయాలకంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది.
శతాధిక వృద్ధుడు శ్యామ్ శరణ్ నేగీ నిజంగానే అద్భు తమైన వ్యక్తి. ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చేలా ఉత్తే జితులను చేయడం కోసం ఎన్నికల కమిషన్ ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకోవడంలో ఆశ్చర్య మేమీ లేదు. హిమాచల్‌ప్రదేశ్ వాసి నేగీ స్వాంతంత్య్రానంతరం జరిగిన తొలి సార్వ త్రిక ఎన్నికల్లో ఓటు చేసిన ఏకైక వ్యక్తేమీ కాడు. కానీ అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ తప్పని సరిగా ఓటు చేస్తూ వస్తున్న ఏకైక వ్యక్తి.
ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటు చేయడానికి వచ్చినçపుడు ఆయనకు ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగతం పలికారు. వృద్ధుడు, దుర్బ లుడైన ఆయనను కల్పా పోలింగ్ స్టేషన్‌కు తీసుకు రావడానికి రవాణా సదుపాయాన్ని కూడా కల్పిం చారు. మరెవరైనా, అంటే ఏ అభ్యర్థో లేదా పార్టీనో ఇలా ఓటర్‌ను పోలింగ్ బూత్‌కు తరలించడం నిషిద్ధం. అది, ఓటర్లను ప్రలోభపెట్టడం అవుతుంది. కానీ, ఓటు విలువపై నేగీ ఉంచిన నమ్మకాన్ని గౌరవించాలని ఎన్నికల కమిషన్ ఈ ఏర్పాటు చేసింది.
సగటు పోలింగ్ రేటు 65 శాతాన్ని దాటడం కష్ట మయ్యే మన దేశంలో ఇతరులకు ఆదర్శంగా నేగీ నిలు స్తారు. ప్రత్యేకించి, ప్రజాస్వామిక ప్రక్రియలో పాల్గొన డానికి బదులు, పడక కుర్చీ విమర్శకులుగానే ఉండి పోయే పట్టణ మధ్యతరగతి వారిలోని చాలా మంది ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి. దేశ భవి తను నిర్ణయించడంలో తన ఓటు నిర్ణయాత్మకమైనది కావ చ్చునని ఓటరు అర్థం చేసుకోవాలి. ఓటరుగా తన పౌర ధర్మాన్ని పాటించాలనేదానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కట్టుబడి ఉండటం మాత్రమే కాదు, ‘‘రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయి’’ అని ఆయన గుర్తించారు. అయితే, ఆ విషయాన్ని ఆయన అంతకంటే వివరించలేదని ఓ మరాఠీ వార్తాపత్రికలో చదివాను.
అయినా, ఆయన వ్యాఖ్యను నేను బెదిరింపులు, బుజ్జగింపుల రాజకీయాల్లోకి దేశం జారిపోయినట్టు కనిపించడంపై చేసినదని వ్యాఖ్యానిస్తాను. అభ్యర్థిని ఎంచుకోవడానికి తనకున్న హక్కును ఉపయోగించు కోవడానికి ఓటర్లు ఎంత దృఢంగా కట్టుబడినాగానీ, ఎంచుకోవడానికి వారి ముందు ఉండే అభ్యర్థుల జాబితా ఏమంత ఆకర్షణీయమైనదిగా ఉండటం లేద నేది ఆయన వ్యాఖ్యకు అర్థమని అనుకుంటాను. దేశం కంటే కుటుంబాన్నే ముందుంచడం, నియోజకవర్గాల్లో వంశపారంపర్య రాజకీయ వారసత్వాన్ని పెంపొందిం పజేయడం నేడు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ధోరణి. బహుశా అది ఆ వృద్ధునికి చికాకు కలిగించిందేమో.
జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో రాజకీయ పార్టీలపై వంశపారంపర్య ఆధిపత్యపు నమూనా నుంచే నియోజకవర్గాల్లో అవినీతి, వంశపారంపర్య ఆధి పత్యాలు కూడా పుట్టుకొచ్చాయి. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయంసింగ్, లాలూప్రసాద్ యాద వ్‌ల కుటుంబాలు, పవార్ కుటుంబీకులు వగైరాలు ఉన్నత స్థాయిలవి. ఆ స్థాయిలలోనే ఇది జరుగు తుంటే, నియోజకవర్గం స్థాయిలోని అంతకంటే అతి చిన్న నేతలు కూడా ఇది సరైనదేనని అనుకుంటారు. వాస్తవంగానూ, వ్యక్తిగతంగానూ అది వారికి ఉపయో గకరమైనది.
మరి అలాంటప్పుడు ఓటరు ఎందుకు ఓటు వేయాలి? కారణాలు చెప్పాలంటే బారెడంత జాబితా ఉంది. వాటిలో కొన్ని ఇవి: హక్కుగా ప్రభుత్వం చేయాల్సిన పనిని అధికార యంత్రాంగపు కాలయా పన, లంచాల డిమాండ్లు లేకుండానే ఓటరుకు రాజ కీయవేత్త చేయించి పెడతాడు. తద్వారా ఓటరుకు వ్యక్తిగతంగా లబ్ధి కలుగుతుంది కాబట్టి ఓటు వేయొచ్చు. లేదంటే సదరు నేత ఓటరుకు ఏదైనా చట్టవిరుద్ధమైన పనిని చేసి పెట్టవచ్చు, అందుకు కృతజ్ఞతగా ఓటు వేయాలి. లేకపోతే ఆ రాజకీయవేత్త ఆగ్రహాన్ని చవి చూడాలి. లేదా, నిబంధనల ప్రకారం సరైన పనిని చేయడం కంటే గుట్టుచప్పుడు కాకుండా హాని చేయగలిగిన శక్తివంతుడైన రాజకీయవేత్త దృష్టి లో మంచి అనిపించుకోవడం కోసమే కావచ్చు.
ఎప్పుడు ఏ విధివశాన ఓటరు, రేపటి ఎన్నికల పోరాట యోధుడిని ఆశ్రయించక తప్పని పరిస్థితి సంభవిస్తుందో ఎవరికి తెలుసు. వారి దృష్టిలో బుద్ధి మంతుల్లా ఉండటం ఉపయోగకరం. అంతకంటే విస్తృ తమైనదైన భావజాలం, అభ్యర్థుల ఎంపికలో నిర్ణయా త్మకంగా ఉండే అవకాశాలు చాలా సందర్భాల్లో అతి స్వల్పం.
నిజానికి భావజాలం నేడు అవకాశవాదానికి ముసుగుగా ఉంటోంది. వ్యక్తిగత ప్రయోజనాల కార ణంగా వ్యక్తులు ఒక పక్షాన్ని వీడి, మరో పక్షాన చేరిపోవడం స్పష్టంగానే కనిపిస్తుంది. పార్టీ ఏ ఆశ యాల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెబు తోందో, వాటికంటే గెలుపే ఎక్కువగా లెక్కలోకి వస్తోంది. ఒక భావజాలానికి నిన్నటి ప్రత్యర్థి, సరిగ్గా అందుకు విరుద్ధమైన భావజాలానికి నేడు కొత్త అనుయాయిగా మారుతున్నాడు.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
ఆదర్శ ఓటరు అంతరంగం
Published Tue, Nov 14 2017 1:43 AM | Last Updated on Tue, Nov 14 2017 1:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment