
ముద్రలూ... హక్కులూ
గోపాల్ గాంధీ, రాజ్‌మోహన్ గాంధీ, తుషార్ గాంధీ వంటి కొద్దిమందిని మినహాయిస్తే, అసం ఖ్యాకులైన మహాత్మాగాంధీ వారసులలో ఎవరైనా గాంధీ టోపీ తమకు చెందుతుందని క్లెయిమ్ చేయడాన్ని ఊహించుకోండి. ఆయన పేరుతో ముడిపడిన జనరంజక సంస్కృతిలోని సంప్రదా యం ద్వారా ఆ టోపీకి బ్రాండ్ విలువ ఏర్పడిం ది. గాంధీ వారసత్వ కుటుంబాలలో కానీ, గాంధీ వాదుల్లో కానీ ఏ ఒక్కరూ ప్రస్తుతం ఆయన టోపీని ధరించడం లేదు. బహుశా అనేకమంది గాంధీవాదులు ఆ టోపీని ఉపయోగించడం లేదు కాబట్టే గాంధీవాదుల్లా నటిస్తున్న గాంధీయేతర రాజకీయవాదులే నేడు రాజ్యమేలుతున్నారు.
గాంధీ టోపీపై హక్కులను అడగటం అనేది ఇప్పుడు శక్తివంతమైన ప్రకటన అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అర వింద్ కేజ్రీవాల్‌కు గతంలో తానిచ్చిన బ్లూ వేగన్ కారును వెనక్కు పంప వలసిం దిగా కుందాన్ శర్మ ఇటీవలే అడిగేశారు కూడా. ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో శర్మ విసిగిపోయారు. పైగా అంతర్గత ప్రజాస్వామ్యం వంటి సమస్యలపై కేజ్రీవాల్‌తో నేరుగా చర్చించ లేకపోవడం కూడా శర్మకు చికాకు పుట్టింది. కేజ్రీవాల్ ఇప్పుడు సామాన్యులకు అంత సులు వుగా అందుబాటులో లేని నేతగా మారారు.
శర్మలాగే మరొక మద్దతుదారైన సునీల్ లాల్ తనదైన బాణీ వినిపించారు. ఒక స్వచ్ఛంద సేవకుడిగా తాను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి లోగోను తయారు చేసి ఇచ్చానని, ఇప్పుడు దాని హక్కులను వెనక్కు తీసుకోవాలనుకుంటున్నా నని బాంబు పేల్చారు. చెప్పినదానికి కట్టుబ డని, తానెలా ఉండాలనుకున్నాడో, అలా ఉండని పార్టీపట్ల ఆశాభంగం చెందిన వ్యక్తి నుంచి వచ్చి న మరొక శక్తివంతమైన ప్రకటన ఇది.
ఒక పార్టీగా కాంగ్రెస్ పని ముగిసిపోయింది కాబట్టి, మహాత్మాగాంధీతో తన అనుబంధానికి గుర్తుగా గాంధీ టోపీని ఉపయోగించడాన్ని కాం గ్రెస్ మానుకోవాలన్న డిమాండ్ వినిపించటం లేదు. కాంగ్రెస్ వాదులు కొన్ని సందర్భాల్లో మా త్రమే గాంధీ టోపీని ధరిస్తున్నారు. అయితే గాం ధీ ఆగమనానికన్నా ఎంతో ముందే ఆ టోపీని మహారాష్ట్రలో వాడేవారు. కాకపోతే అది తెల్ల రంగులో ఉండేది కాదు. గాంధీ ధరించి వదిలి వేసిన టోపీని ఆమ్ ఆద్మీ ఒక శక్తివంతమైన బ్రాం డ్‌గా, గుర్తింపుగా మార్చివేసింది.
స్థానిక దర్జీ సైతం దాన్ని సులువుగా కుట్టగలిగేలా, ఖాదీ భండారులో అమ్ముతూ కనిపించేలా ఆ టోపీని ఆమ్ ఆద్మీ ఒక గౌరవ బ్యాడ్జ్‌గా మార్చేసింది. ఇతర పార్టీలు కూడా కాం గ్రెస్‌ను కాకుం డా ఆప్‌నే అనుకరించి తమ టోపీలపై పార్టీ పేరు వచ్చేలా చూసుకున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ రెడ్ క్యాప్‌లాగా. చివ రకు బీజేపీ సైతం దాన్ని స్వీకరించింది. ఫార్మాసూటికల్ కంపెనీ తను పేటెంట్ తీసు కున్న మాలిక్యూల్‌ను కొత్త ఔషధంగా మార్కెట్ చేసినట్లుగా ఆప్ మటుకు గాంధీ టోపీకి నిఖార్స యిన మాట్లు వేసింది.
ఆప్ అనేది ఒక భావనగా కూడా లేని రోజు ల్లో (క్షమించండి యోగేంద్ర యాదవ్) ఇండియా ఎగెనైస్ట్ కరప్షన్ సంస్థలోని నిబద్ధ భాగస్వాములు జనలోక్‌పాల్ కోసం డిమాండ్ వంటి నినాదాల ను ఆ టోపీపై ముద్రించేవారు. అచిరకాలంలోనే ఆ క్యాప్ పరివర్తన చెందింది. మై ఆమ్ ఆద్మీ హూ.. అని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు గర్వం గా చెప్పుకునేలా చేసింది. కాని మండిస్తున్న ఢిల్లీ ఉక్కపోతలో దాన్ని ధరించడమే ఇప్పుడు సులు వు. అంతేకానీ టీవీల్లో కూడా కార్యకర్తలు ఎవరూ దాన్ని ఇప్పుడు ధరించడం లేదు.
ఆప్ తన విలువల వలువలను ఒకటొక్కటిగా వదిలివేస్తున్న తరుణంలో గాంధీ టోపీకి మెరుగులద్ది అది తీసుకొచ్చిన ఆ గొప్ప బ్రాండ్ భవిష్యత్తు ఏమిటి? ఎవరూ ధరించని గాంధీ టోపీలాగే కొన్నాళ్లకు దీని కథ కూడా ముగియనుందా?
- మహేష్ విజాపుర్కార్
(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు)
mvijapurkar@gmail.com