విశ్లేషణ
అధికారులు పూనుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచగలరు. హఠాత్తుగా వీధి వ్యాపారులు మటుమాయం కావడమే అందుకు నిదర్శనం. కానీ, వీధి వ్యాపా రుల విధానాన్ని తేలేకపోతే వారి జీవనోపాధి హక్కుకు భంగం కలుగుతుంది.
రెండు ఘటనలు, ముంబై ప్రాంత స్థానిక రైల్వే స్టేషన్ల లోకి ప్రయాణికుల రాకపో కలు, స్టేషన్ లోపలి కదలికలు స్వేచ్ఛగా సాగడానికి ఉన్న అడ్డంకులను తొలగించాయి. ఒకటి, ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాట. మరొ కటి, స్టేషన్ల బయటా లోపలా ఉండే వీధి వర్తకులు (హాకర్స్) 15 రోజులలోగా ఖాళీ చేయాలని రాజ్ ఠాక్రే జారీ చేసిన హెచ్చరిక. అలా చేయక పోతే, పరిణామాలు హింసా త్మకంగా ఉండగలవని ఆయన సంకేతించారు కూడా.
వీధి వ్యాపారులతో తలెత్తున్న ఈ సమస్య పట్ల అధి కారులు ఎప్పటికప్పుడు అలసత్వం చూపుతూ వస్తు న్నారు. ఒక సందర్భంలోనైతే ప్రజలు వారిని ఆదరించ రాదని కోరుతూ, ఆ బాధ్యతను వారి మీదకే నెట్టేశారు. ఎంత గట్టి చర్యలను చేపట్టినా వీధి వ్యాపారులు మొండి కేస్తున్నారని తరుచుగా అధికారులు చెబుతుండేవారు. కాబట్టి ప్రజలు తమను తామే తప్పు పట్టుకోవాలని అర్థం. వీధి వ్యాపారులు మొండివారు నిజమే, కానీ అధి కారులు పట్టుదలతో ప్రయత్నించారనడం మాత్రం నిజం కాదు.
రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సమితి కొంత కాలంగా పలుకుబడిని కోల్పోతోంది. దాని క్యాడర్ పునాది బలహీనపడింది. పని ప్రదేశాలకు సురక్షి తంగా Ðð ళ్లి రావడం అనే సమస్య సరిగ్గా సమయానికి వారి చేతికి అందివచ్చింది. రాజ్, రైల్వే కార్యాలయాలను సందర్శించి వచ్చి ‘‘15 రోజుల్లోగా వీధి వ్యాపారులను తొలగించకపోతే మా తదుపరి మోర్చా శాంతియుతంగా జరగకపోవచ్చు’’ అని చెప్పారు. ఇది అందరి మనసు ల్లోని ఆందోళనను తాకింది. రాజ్ వ్యతిరేకించే బిహార్, యూపీ వారు సహా ప్రతి ప్రయాణికుడి హృదయాన్నీ ఆయన మీటారు. ఈ సమస్య అంత సార్వత్రికమైనది మరి. ఇది, తెలివి ఉన్నా చాకచక్యంలేని ముంబై నగర నిర్వహణా వ్యవస్థలోని ఒక ముఖ్య బలహీనతకు సంబంధించినది. వీధివర్తకుల సంఖ్య ఎంతో కూడా తెలియని నగర పాలక సంస్థల నిర్వహణకు సంబంధించిన ఈ బలహీనత... విధానాలు సహా అన్ని స్థాయిలలో వీధి వర్తకులతో వ్యవహరించే అందరిలోనూ ఉంది.
అయితే, ఈ కాలమ్‌లో రాజ్ ఠాక్రేపై కంటే ఎక్కు వగా వీధి వర్తకులపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. సమస్యా త్మకమైన ముంబై నగర జీవితంలో వారు ఒక భాగం. అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ పుట్టుకొచ్చేసి వీధి వర్తకులు స్టేషన్లకు వెళ్లివచ్చే దారులను, కాలినడక వంతెనలను, వీధి పక్క పాదచారుల బాటలను ఆక్రమిం చేస్తుంటారు. ప్రయాణికులు వారి సమస్యగురించి చికాకు పడుతూనే వారిని ఆదరిస్తుంటారు. అందుబాటులోని దుకాణాలుగా వ్యవహరిస్తూ వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో భాగమై పోయారు. వలస వచ్చినవారికి, ఇటీవలి కాలంలో స్థానికులకు సైతం అది తేలికగా, త్వరితగతిన సంపాదించుకోగలిగిన జీవనోపాధి కావడమే అందుకు కారణం. నగర ప్రాంత స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు బహుశా వీరికి సంబంధించిన గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఉండరు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ ధరల మూలంగా చిన్న ఇంటి దుకాణం పెట్టుకోవడం కూడా అసాధ్యంగా మారింది.
ఇది కూడా వారి ఉనికికి కారణం. పార్లమెంటు, వీధి వ్యాపారంపై చట్టపరమైన నిబం ధనలను, రూపొందించింది. వీధి వ్యాపారుల జీవనో పాధి హక్కుకు రక్షణను కల్పించే తీర్పును సుప్రీం కోర్టు 2014లోనే ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వీధి వ్యాపార విధానాన్ని ఇంతవరకు రూపొందించనే లేదు. వారు చెల్లించే రూ. 2,000 కోట్ల విలువైన ముడుపులే ఇందుకు కారణమని, కనీసం ఒక వీధి వ్యాపారుల ట్రేడ్ యూనియన్ చెప్పింది.
ఆ సంఖ్య బహుశా ఎక్కువగా చేసి చెప్పనది కావచ్చు. కానీ, వీధి వ్యాపారులతో వ్యవహరించే శాఖకు చెందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి స్వార్థ ప్రయో జనం ఉన్నది నిజమే. వీధి దుకాణదారులను తొలగిం చాక, వారు జరిమానా చెల్లించేసి తిరిగి వస్తారు, జరిమా నాల పెంపుదల వారిని నిరోధించేదిగా ఏం పని చేయక పోగా, లంచాల మొత్తంలో పెరుగుదలకు కారణమౌ తుంది. ముంబై నగర జనాభాను బట్టి చూస్తే చట్టప్రకా రమే మూడు లక్షల మంది వీధి వ్యాపారులను వారి వృత్తులను కొనసాగించుకోడానికి అనుమతించవచ్చు.
రహదారుల పక్క కాలిబాటలకు, రోడ్లపై పయ నించే వారికి కనీసమైన అటంకం మాత్రమే కలిగించే విధంగా వారిని వేరే చోట్లకు తరలించడంతోపాటూ, వారి ప్రయోజనాలను కూడా కాపాడటం సులువేమీ కాదు. ప్రధాన రహదారులకు దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతాల నివాసులు వారిని ఆహ్వానించరు. వీధివ్యాపారులూ అలాంటి చోట్లకు వెళ్లాలని కోరుకోరు. వీధి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పే వారిలో చాలా మంది ఇంత జాగా సంపాదించుకోవాలనుకునే నకిలీ వ్యాపారులని ఒక సర్వేలో తేలింది. అధికార యంత్రాం గం నివారించగలిగిన తలనొప్పులే ఇవన్నీ.
ప్రస్తుతానికే అయినా రైల్వే స్టేషన్ల లోపల, చుట్టూతా ఉండే వీధి వర్తకులంతా రాత్రికి రాత్రే ఒక్కరూ కనబడకుండా మటుమాయం కావడం అనే ఘటన.. అధికారులు కోరుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచ గలరనే భరోసాను మనకు తిరిగి కల్పించాలి. అయితే, వీధి వ్యాపారుల విధానాన్ని రూపొందించడంలో అన వసర జాప్యం చేయడం వల్ల నగర జనాభాలోని గణ నీయమైన భాగపు జీవనోపాధి హక్కుకు భంగం కలి గించినట్టు అవుతుంది. కావాలంటే ఆ చట్టాన్ని ప్రశ్నించ వచ్చుగానీ, అలాంటి చట్టం ఉన్నదని విస్మరించలేం.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com
Comments
Please login to add a commentAdd a comment