Elphinstone Railway Station
-
సైన్యాన్ని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది?
సాక్షి, న్యూఢిల్లీ : ముంబై రైల్వే స్టేషన్లో 23 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్ఫిన్‌స్టోన్ రోడ్డు పాదాచారుల వంతెనను పునర్మించే బాధ్యతను దేశ సైన్యానికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం ఎంత మేరకు సమంజసం? ఈ నిర్ణయం వెనకనున్న ఉద్దేశం ఏమిటీ? రైల్వేకు సొంత ఇంజనీరింగ్ విభాగం, సొంత ప్రజా పనుల విభాగం ఉన్నప్పుడు సైన్యాన్ని పిలిపించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి పౌర వంతెన నిర్మాణం కోసం సైన్యాన్ని ఆహ్వానించడం బహూశ ఇదే మొదటిసారి కావచ్చు. అలా అని సైన్యాన్ని పౌర సేవలకు పిలవలేదని కాదు. ప్రకృతి విలయాలు వచ్చినప్పుడు, తీవ్రస్థాయిలో అల్లర్లు చెలరేగినప్పుడు సైన్యం పౌర సేవలను ఉపయోగించుకున్నాం. ఢిల్లీలో 2016లో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సమ్మేళనం నిర్వహించినప్పుడు యమునా నదిపై నీటిలో తేలియాడే వంతెనను సైన్యమే నిర్మించింది. ప్రకృతి విలయాల కారణంగా వరదలు వచ్చి, వంతెనలు తెగిపోయిన సందర్భాల్లో నీటిలో తాత్కాలికంగా తేలియాడే వంతెనలను నిర్మించడంలో సైన్యానికి ఎంతో నైపుణ్యం ఉంది. అందుకని యమునా నదిపై తాత్కాలిక వంతెన కోసమే సైన్యం సేవలను ఉపయోగించుకున్నారు. అంతకు మినహా పౌర సేవలకు సైన్యాన్ని అనవసరంగా ఉపయోగించిన సందర్భాలు ఇంతవరకు లేవు. మరి ఇప్పుడు ఎందుకు సైన్యానికి ఆ బాధ్యతను అప్పగించాల్సి వచ్చిందన్నది కోటి రూకల ప్రశ్న. (కూలిన వంతెన పునర్మిర్మాణంతోపాటు అదనంగా మరో రెండు వంతెనలను రైల్వేతో కలిసి సైన్యం నిర్మించనుంది) ఇదే విషయమైన కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ప్రశ్నించగా, వంతెన కూలి 23 మంది ప్రయాణికులు మరణించిన సంఘటన తీవ్ర విషాదకరమైనది కదా, అందుకే సైన్యాన్ని ఆహ్వానించామని సమాధానమిచ్చారు. అంటే, ఆమె ఉద్దేశం ఏమిటీ? రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వంతెన కూలితే ఆ విషయాన్ని ప్రజలు మరచి పోయేలా చేయడం కోసం సైన్యాన్ని పిలిచి ఆర్భాటం చేస్తున్నట్లా? సైనిక ప్రతిష్టతోనే పోయిన ప్రభుత్వం ప్రతిష్టను కాపాడుకోవాలని అనుకుంటున్నారా? అదే నిజమైతే నిర్మలా సీతారామన్ తనకు తెలియకుండానే నిజం మాట్లాడినట్లు. ప్రతిపక్ష పార్టీల సంగతి పక్కన పెడితే సైన్యాన్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రిటైర్డ్ సైనికాధికారులందరూ విమర్శిస్తున్నారు. ఇంకా సర్వీసులో కొనసాగుతున్న సీనియర్ అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. వారు విప్పకూడదు కూడా. దేశ సైనిక ప్రతిష్టను ఇనుమడింపచేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ వివరణ ఇచ్చారు. మన సైనిక నైపుణ్యం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది దోహద పడుతుందని, తద్వారా పౌరులతోని సైన్యానికి సత్సంబంధాలు ఏర్పడతాయని కూడా ఆయన చెప్పారు. ఇదే సూత్రంతో కశ్మీర్ పౌరుల్లోకి సైనికులు చొచ్చుకుపోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ నాయకులకన్నా వారే ఎక్కువ పరిపాలకులు అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాదేశాలను పట్టించుకోక పోవడం, విస్తత అధికారాలను విచ్చలవిడిగా ఉపయోగించుకోవడం వారికి అలవాటయింది. అలాంటి ప్రమాదం ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించి దేశ రాజకీయాల్లో కూడా సైనికుల జోక్యానికి ఆస్కారం ఇవ్వొచ్చు. ఆర్మీ చీఫ్‌ను నియమించేటప్పుటు ప్రధానంగా సీనియారిటీ చూస్తారు. ఈసారి సీనియారిటీని పక్కన పెట్టి బిపిన్ రావత్‌ను నియమించడంలోనే పెద్ద రాజకీయం ఉంది. అలాంటప్పుడు రాజకీయాల్లోకి సైనికులొస్తే తప్పా!! -
నిర్మలపై అమర్ మండిపాటు
సాక్షి, న్యూఢిల్లీ: ముంబైలోని ఎల్ఫినోస్టోన్ రైల్వేస్టేషన్లో బ్రిడ్జి నిర్మాణానికి ఆర్మీని రంగంలోకి దింపినట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంగళవారం ప్రకటించారు. ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జీపై తొక్కిసలాట జరిగి.. 23మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ స్టేషన్‌తోపాటు మరో రెండు రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను కట్టేందుకు ఆర్మీ సహకారం తీసుకుంటున్నట్టు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వచ్చే జనవరి 31నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని ఆయన ప్రకటించారు. తొక్కిసలాట జరిగిన ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్‌ను సందర్శించేందుకు కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ముంబైకి వచ్చిన సందర్భంగా ఫడ్నవిస్ ఈ ప్రకటన చేశారు. అయితే, సీఎం ఫడ్నవిస్ ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్మీ మాజీ జవాన్ అయిన పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్ ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. ఆర్మీ, నిర్మలా సీతారామన్‌లను ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ.. సివిల్ పనుల కోసం ఆర్మీ వనరులను వాడుకోవడం ఎంతమాత్రం సరికాదని నిర్మలను తప్పుబట్టారు. 'ఆర్మీ కర్తవ్యం యుద్ధం కోసం శిక్షణ పొందడం కానీ, సివిల్ పనుల కోసం ఉపయోగించుకోవడం కాదు నిర్మలాజీ. రక్షణ వనరులను పౌర పనుల కోసం వినియోగించరాదు. 1962 చైనా యుద్ధం సమయంలోనూ జనరల్ కౌల్ ఇదే విధంగా వ్యవహరించారు. ఇలా చేయడం సరైన సంప్రదాయం కాదు. దీనిని నివారించండి ప్లీజ్' అంటూ ఆయన కామెంట్ చేశారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ సైతం ఈ విధానాన్ని ట్విట్టర్లో తప్పుబట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆర్మీని వాడుకోవడం చూశాం కానీ, ఇప్పుడు రోడ్ల మీద గుంతలు పడినా..ఆర్మీని పిలిచేలా కనిపిస్తోందని మండిపడ్డారు. -
ముంబైపై ప్రేమను చూపిన సచిన్
సాక్షి, ముంబై : సెప్టెంబర్‌లో 23 మంది మరణానికి కారణమైన ఎల్ఫిన్ స్టోన్ బ్రిడ్జి నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి రూ. 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందుకు సంబంధించి రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు సచిన్ టెండూల్కర్ ఒక లేఖ రాశారు. ముంబై సబర్బన్ రైల్వే ఆధునీకరణ, ప్రయాణికులకు మరింత భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు సహకారమందిస్తానని ఆయన తెలిపారు. ముంబై సబర్బన్ రైల్వే.. అనేది ముంబై సిటీకి గుండెలాంటిదని ఆయన పేర్కొన్నారు. వందల మంది రైల్వే ఉద్యోగులు ప్రజలకోసం అనుక్షణం పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ముంబై రైల్వేని అభివృద్ధి చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నించాలని రైల్వే మంత్రిని సచిన్ టెండూల్కర్ కోరారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనను అభివృద్ధి చేయడం, ప్రయాణికుల భద్రత కోసం మరిన్ని రక్షణాత్మక సౌకర్యాలను మెరుగుపరచడం చేయాలని సూచించారు. భవిష్యత్‌లో మరో ఎల్ఫిన్‌స్టోన్ వంటి దుర్ఘటనలు జరగకుండా రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని సచిన్ తన లేఖలో రైల్వే మంత్రిని కోరారు. -
23మంది మృతి: ఆ తొక్కిసలాటకు కారణం ఇదేనట!
సాక్షి, ముంబై: 23 మంది మృతికి కారణమైన ముంబై ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు కారణం భారీ వర్షమేనట.. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన వెస్ట్రన్ రైల్వే (డబ్ల్యూఆర్) చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్.. తన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ ఘటనలో గాయపడిన 30మంది ప్రయాణికుల వాంగ్మూలాన్ని సేకరించడంతోపాటు.. ఈ ఘటన వీడియో దృశ్యాలను పరిశీలించిన దర్యాప్తు అధికారి ఈమేరకు నిర్ధారించారని అధికారులు తెలిపారు. గత నెల 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన రోజు భారీ వర్షం పడిందని, ఈ వర్షం వల్ల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు రావడంతో అప్పటికీ రద్దీగా ఉన్న ఆ వంతెనపై గందరగోళం ఏర్పడి.. తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయని దర్యాప్తు నివేదిక పేర్కొంది. క్రమంగా ప్రయాణికుల రాక పెరిగిపోవడం కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సమస్యను జఠిలం చేసిందని తెలిపింది. అయితే, ఈ ఘటనకు కొందరూ ఊహించినట్టు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రయాణికులు పేర్కొన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రయాణికులు భారీ లగేజ్‌లతో రావడంతో రద్దీలో వారు బ్యాలెన్స్ కోల్పోవడం కూడా తొక్కిసలాటకు దారితీసిందని తెలిపింది. రద్దీ వేళల్లో భారీ లగేజ్‌లతో ప్రయాణికులు రాకుండా చూడాలని నివేదిక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గరున్న బుకింగ్ కార్యాలయాన్ని మార్చాలని, ప్రస్తుతమున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని విస్తరించడంతోపాటు మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటుచేయాలని దర్యాప్తు నివేదిక సూచించింది. -
హాకర్ల సమస్య పరిష్కారం?
విశ్లేషణ అధికారులు పూనుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచగలరు. హఠాత్తుగా వీధి వ్యాపారులు మటుమాయం కావడమే అందుకు నిదర్శనం. కానీ, వీధి వ్యాపా రుల విధానాన్ని తేలేకపోతే వారి జీవనోపాధి హక్కుకు భంగం కలుగుతుంది. రెండు ఘటనలు, ముంబై ప్రాంత స్థానిక రైల్వే స్టేషన్ల లోకి ప్రయాణికుల రాకపో కలు, స్టేషన్ లోపలి కదలికలు స్వేచ్ఛగా సాగడానికి ఉన్న అడ్డంకులను తొలగించాయి. ఒకటి, ఎల్ఫిన్‌స్టోన్ స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాట. మరొ కటి, స్టేషన్ల బయటా లోపలా ఉండే వీధి వర్తకులు (హాకర్స్) 15 రోజులలోగా ఖాళీ చేయాలని రాజ్ ఠాక్రే జారీ చేసిన హెచ్చరిక. అలా చేయక పోతే, పరిణామాలు హింసా త్మకంగా ఉండగలవని ఆయన సంకేతించారు కూడా. వీధి వ్యాపారులతో తలెత్తున్న ఈ సమస్య పట్ల అధి కారులు ఎప్పటికప్పుడు అలసత్వం చూపుతూ వస్తు న్నారు. ఒక సందర్భంలోనైతే ప్రజలు వారిని ఆదరించ రాదని కోరుతూ, ఆ బాధ్యతను వారి మీదకే నెట్టేశారు. ఎంత గట్టి చర్యలను చేపట్టినా వీధి వ్యాపారులు మొండి కేస్తున్నారని తరుచుగా అధికారులు చెబుతుండేవారు. కాబట్టి ప్రజలు తమను తామే తప్పు పట్టుకోవాలని అర్థం. వీధి వ్యాపారులు మొండివారు నిజమే, కానీ అధి కారులు పట్టుదలతో ప్రయత్నించారనడం మాత్రం నిజం కాదు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సమితి కొంత కాలంగా పలుకుబడిని కోల్పోతోంది. దాని క్యాడర్ పునాది బలహీనపడింది. పని ప్రదేశాలకు సురక్షి తంగా Ðð ళ్లి రావడం అనే సమస్య సరిగ్గా సమయానికి వారి చేతికి అందివచ్చింది. రాజ్, రైల్వే కార్యాలయాలను సందర్శించి వచ్చి ‘‘15 రోజుల్లోగా వీధి వ్యాపారులను తొలగించకపోతే మా తదుపరి మోర్చా శాంతియుతంగా జరగకపోవచ్చు’’ అని చెప్పారు. ఇది అందరి మనసు ల్లోని ఆందోళనను తాకింది. రాజ్ వ్యతిరేకించే బిహార్, యూపీ వారు సహా ప్రతి ప్రయాణికుడి హృదయాన్నీ ఆయన మీటారు. ఈ సమస్య అంత సార్వత్రికమైనది మరి. ఇది, తెలివి ఉన్నా చాకచక్యంలేని ముంబై నగర నిర్వహణా వ్యవస్థలోని ఒక ముఖ్య బలహీనతకు సంబంధించినది. వీధివర్తకుల సంఖ్య ఎంతో కూడా తెలియని నగర పాలక సంస్థల నిర్వహణకు సంబంధించిన ఈ బలహీనత... విధానాలు సహా అన్ని స్థాయిలలో వీధి వర్తకులతో వ్యవహరించే అందరిలోనూ ఉంది. అయితే, ఈ కాలమ్‌లో రాజ్ ఠాక్రేపై కంటే ఎక్కు వగా వీధి వర్తకులపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. సమస్యా త్మకమైన ముంబై నగర జీవితంలో వారు ఒక భాగం. అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ పుట్టుకొచ్చేసి వీధి వర్తకులు స్టేషన్లకు వెళ్లివచ్చే దారులను, కాలినడక వంతెనలను, వీధి పక్క పాదచారుల బాటలను ఆక్రమిం చేస్తుంటారు. ప్రయాణికులు వారి సమస్యగురించి చికాకు పడుతూనే వారిని ఆదరిస్తుంటారు. అందుబాటులోని దుకాణాలుగా వ్యవహరిస్తూ వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో భాగమై పోయారు. వలస వచ్చినవారికి, ఇటీవలి కాలంలో స్థానికులకు సైతం అది తేలికగా, త్వరితగతిన సంపాదించుకోగలిగిన జీవనోపాధి కావడమే అందుకు కారణం. నగర ప్రాంత స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు బహుశా వీరికి సంబంధించిన గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఉండరు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ ధరల మూలంగా చిన్న ఇంటి దుకాణం పెట్టుకోవడం కూడా అసాధ్యంగా మారింది. ఇది కూడా వారి ఉనికికి కారణం. పార్లమెంటు, వీధి వ్యాపారంపై చట్టపరమైన నిబం ధనలను, రూపొందించింది. వీధి వ్యాపారుల జీవనో పాధి హక్కుకు రక్షణను కల్పించే తీర్పును సుప్రీం కోర్టు 2014లోనే ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వీధి వ్యాపార విధానాన్ని ఇంతవరకు రూపొందించనే లేదు. వారు చెల్లించే రూ. 2,000 కోట్ల విలువైన ముడుపులే ఇందుకు కారణమని, కనీసం ఒక వీధి వ్యాపారుల ట్రేడ్ యూనియన్ చెప్పింది. ఆ సంఖ్య బహుశా ఎక్కువగా చేసి చెప్పనది కావచ్చు. కానీ, వీధి వ్యాపారులతో వ్యవహరించే శాఖకు చెందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి స్వార్థ ప్రయో జనం ఉన్నది నిజమే. వీధి దుకాణదారులను తొలగిం చాక, వారు జరిమానా చెల్లించేసి తిరిగి వస్తారు, జరిమా నాల పెంపుదల వారిని నిరోధించేదిగా ఏం పని చేయక పోగా, లంచాల మొత్తంలో పెరుగుదలకు కారణమౌ తుంది. ముంబై నగర జనాభాను బట్టి చూస్తే చట్టప్రకా రమే మూడు లక్షల మంది వీధి వ్యాపారులను వారి వృత్తులను కొనసాగించుకోడానికి అనుమతించవచ్చు. రహదారుల పక్క కాలిబాటలకు, రోడ్లపై పయ నించే వారికి కనీసమైన అటంకం మాత్రమే కలిగించే విధంగా వారిని వేరే చోట్లకు తరలించడంతోపాటూ, వారి ప్రయోజనాలను కూడా కాపాడటం సులువేమీ కాదు. ప్రధాన రహదారులకు దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతాల నివాసులు వారిని ఆహ్వానించరు. వీధివ్యాపారులూ అలాంటి చోట్లకు వెళ్లాలని కోరుకోరు. వీధి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పే వారిలో చాలా మంది ఇంత జాగా సంపాదించుకోవాలనుకునే నకిలీ వ్యాపారులని ఒక సర్వేలో తేలింది. అధికార యంత్రాం గం నివారించగలిగిన తలనొప్పులే ఇవన్నీ. ప్రస్తుతానికే అయినా రైల్వే స్టేషన్ల లోపల, చుట్టూతా ఉండే వీధి వర్తకులంతా రాత్రికి రాత్రే ఒక్కరూ కనబడకుండా మటుమాయం కావడం అనే ఘటన.. అధికారులు కోరుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచ గలరనే భరోసాను మనకు తిరిగి కల్పించాలి. అయితే, వీధి వ్యాపారుల విధానాన్ని రూపొందించడంలో అన వసర జాప్యం చేయడం వల్ల నగర జనాభాలోని గణ నీయమైన భాగపు జీవనోపాధి హక్కుకు భంగం కలి గించినట్టు అవుతుంది. కావాలంటే ఆ చట్టాన్ని ప్రశ్నించ వచ్చుగానీ, అలాంటి చట్టం ఉన్నదని విస్మరించలేం. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
సోమరితనానికి రక్షణా?
విశ్లేషణ దశాబ్దికి ముందే ఆ వంతెన తట్టుకోగల సామర్ధ్యాన్ని మించి రద్దీ పెరిగిపోయింది. అయినా, విశాలమైన వంతెన గురించి 2015లో గాని ఆలోచించలేదు. ఇలాంటి దుర్ఘటన సంభవించవచ్చని అధికారుల కంటే ముందుగా ప్రజలు పసిగట్టారు. ముంబైలోని ఎలిఫిన్స్టన్ స్టేషన్ కాలి నడక వంతెనపై జరిగిన తొక్కిసలాటలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మన ప్రణాళికా రచన, నిర్వహణలను గుర్రానికి ముందు బండిని కట్టడమనే రుగ్మత పట్టి పీడిస్తోంది. అందుకు ఈ దుర్ఘటనే సాక్ష్యం. మూతపడ్డ జౌళి మిల్లుల స్థానంలో కొత్త వాణిజ్య ప్రాంతం ఆవిర్భావంతో ఆ దగ్గరలోని లోయర్ పరెల్, ఎలిఫిన్స్టన్ స్టేషన్లలో తొక్కిసలాటలు పెరుగుతాయని అందరికీ తెలిసిందే. ముంబై వాసులు, ఎవరికి వారే బతుకు తెరువు పోరాటంలో మునిగి ఉంటారు. కాబట్టి అది లేదని, ఇది కావాలని ఫిర్యాదు చెయ్యరు, కావాలని కోరరు. అంతేకాదు, బహిరంగ ప్రదేశాలన్నీ కిక్కిరిసి పోయి ఉండటం సహా అన్ని రంగాలలోని అధ్వాన నిర్వహణకు వారు అలవాటు పడిపోయారనేది కూడా వాస్తవమే. అంతమాత్రాన, రానున్న సంక్షోభాన్ని లేదా సంక్షోభం తలెత్తే పరిస్థితులను పరిష్కరించకపోవడానికి అది సంజాయిషీ కాజాలదు. ప్రభుత్వ విధానాన్ని, మునిసిపల్ చట్టాలను అనుసరించి మూతపడ్డ మిల్లుల భూములను పునర్వినియోగించడం రెండు దశాబ్దాలుగా జరుగుతోంది. దశాబ్దికి ముందే ఆ వంతెన తట్టుకోగల సామర్థ్యాన్ని మించి రద్దీ పెరిగింది. మరింత విశాలమైన వంతెన గురించి 2015లో గాని ఆలోచన మొదలెట్టలేదు. అధికారులకంటే ఎంతో ముందుగా ఆ వంతెనను ఉపయోగించే వారు ఇలాంటి దుర్ఘటన సంభవించవచ్చని పసిగట్టారు. ఆవిర్భవిస్తున్న ఆ నూతన వాణిజ్య ప్రాంతంలోకి ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి అవసరమైన సదుపాయాలు అస్పష్టంగానే ఉన్నాయి. ఆ స్థితికి తగ్గట్టుగా గ్రేటర్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ మిల్లు భూములలో అసాధారణ వేగంతో పెంపొందుతున్న రియల్ ఎస్టేట్ వృద్ధిని నియంత్రించి ఉండాల్సింది. మిల్లు యజమానులు, బిల్డర్–డెవలపర్ల లాబీ, అధికార యంత్రాంగం, రాజకీయ ప్రయోజనాలు భూమి పునర్వినియోగం వేగంగా పెరగడాన్ని ప్రేరేపించారు. స్టేషన్ల వద్ద ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటాన్ని చూసి రైల్వే అధికారులు తదనుగుణంగా ప్రణాళికలను ప్రారంభించాల్సింది. వారు కళ్లు మూసుకున్నారు. లోయర్ పరెల్, ఎలిఫిన్స్టన్ స్టేషన్ల విషయంలో రెండు పెద్ద అధికార సంస్థల మధ్య తీవ్ర సమన్వయ లోపం ఉంది. రైల్వే అధికారులు హఠాత్తుగా ఇప్పుడు మేల్కొని ఎంతో కాలంగా అవసరమైన పలు సదుపాయాలకు ప్రణాళికలను రూపొందించడం మొదలెట్టారు. నిర్ణయాధికారాలను దిగువ స్థాయిలకు వికేంద్రీకరించి. వాటి అమలుకు నిర్ణీత కాల వ్యవధులను నిర్ణయించారు. సదుపాయాలపై దృష్టిని కేంద్రీకరించగలిగేలా ఎగువ నుంచి పోయే రైల్వే లైన్ల వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రాధాన్యాలను తర్వాతికి మార్చారు. ఏమైతేనేం కుంభకర్ణుడు నిద్రలేచాడు. అయితే మధ్యలోనే తిరిగి ఆవలించడం మొదలెడతాడేమో ఎవరికీ తెలియదు. లోకల్ రైల్వే వ్యవస్థలోని రైళ్ల సంఖ్యను, ప్రయాణికులను చేరవేయగల వాటి సామర్థ్యాన్ని మరింత పెంచడానికి కృషి నిస్సందేహంగా ఎప్పుడూ జరుగుతూనే ఉంది. కాకపోతే, కోర్టులు ఆదేశించిన్పప్పుడే మౌలిక సదుపాయాలు కార్య రూపం ధరిస్తున్నాయి. న్యాయ జోక్యమే లేకపోతే ప్లాట్‌ఫారాలకు, బోగీలకు మ«ధ్య అంతరం సమస్యను పట్టించుకునే వారే కారు. మరిన్ని అదనపు బోగీలను చేర్చడానికి వీలుగా పొడిగించిన ప్లాట్‌ఫారాలకు పై కప్పు లేకపోవడం వానాకాలం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ ఛత్రం కింద పనిచేసే సంస్థలన్నిటికీ పెంపొందే అవసరాల వృద్ధి వల్ల తలెత్తే సమస్యలకు అనుగుణంగా ప్రణాళికలను మొదలెట్టగల ఊహాత్మకత కొరవడింది. ప్రణాళికావేత్తల, నిర్వాహకుల చేతుల్లో ఉందని అనే లోగానే మనలాంటి దేశాల్లో సప్లయ్, డిమాండ్‌ని మించి పోతుంది. పాతవాటి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునేంతగా రద్దీ పెరిగిపోయినప్పుడే కొత్త విమానాశ్రయాలకు ప్రణాళికలను రచిస్తున్నారు. అధికార యంత్రాంగంలో కాలయాపన, సోమరితనం రివాజుగా మారాయి. ఎలాంటి లోటుపాట్లనైనా పంటి బిగువున భరించడానికి ప్రజలు చూపే సుముఖతే సోమరితనం చూపే దోషులకు రక్షణ అవుతోంది. చిన్న, విస్తరిస్తున్న పట్టణాలకు ఆనుకుని ఉన్న పంట భూములను ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్లు వేయడాన్ని, ఆ ప్రాంతం అంతా సమాధి రాళ్ల సముద్రంలా అనిపించడాన్ని మనం చూడలేదా? రోడ్లు, నీరు, పారిశుద్ధ్యం వంటి సేవలను అరకొరగా అందించడానికి సైతం పౌర సంస్థలు మహా మందకొడిగా కదులుతుంటాయి. సదుపాయాలను కల్పించలేనప్పడు నిర్మాణాలకు ఎందుకు అనుమతులను జారీ చేయాలి? లేక ఆవి పూర్తి అయ్యే వరకు ఆలస్యం చేయాలా? లోయర్ పరెల్–ఎలిఫిన్స్టన్ ప్రాంతం ఏదో ఒంటరి ఉదాహరణ కాదు. శిథిలమౌతున్న పాత ఆక్రమణలు లేదా తక్కువ ఎత్తు భవనాలు, శతాబ్దం క్రితం ప్రణాళికలు రూపొందించి, నిర్మించినప్పుడు సరిపడేవే అయినా ఇప్పుడు ఇరుగ్గా మారిన రహదారులను ఆకాశహర్మ్యాలుగా పునరాభివృద్ధి చేయడాన్ని అనుమతించారు. కానీ పౌర సదుపాయాల సరఫరా మాత్రం విస్తరింపజేయలేదు. అవే రోడ్లు, అవే నీటి పైపులైన్లు, కాలువలు ఈ పెరిగిన డిమాండును తట్టుకోగలవని ఆశిస్తారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com