మట్టికాళ్ల మహా నగరాలు
ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవన్నీ పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి చేరుతాయి. రవాణా, రోడ్లు, పాద చారుల బాటలు, మార్కెట్లు ఇలా దాదాపు ప్రతిదీ సమస్యాత్మకమే.
ఈ ఫిబ్రవరిలో లాతూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో మన రైల్వేలు మీరజ్ నుంచి 100కు పైగా నీటి రైళ్లను నడి పాయి. తర్వాత, హఠాత్తుగా శుభవార్త వచ్చింది. వానలు కురిసి లాతూరు మంచినీటి అవసరాలను తీర్చే రెండు నీటి వనరులు పూర్తిగా నిండాయి. నీటి సంక్షోభం ‘దాదాపుగా ముగిసి పోయింది’ అని మునిసిపల్ అధికారులు ఆనందంగా చెప్పారు. నీటి ఎద్దడి ఆ నగరపు సామాజిక, ఆర్థిక జీవి తాన్ని కల్లోలపరిచింది. దీంతో తిరిగి ‘సాధారణ’ జీవితం గడపవచ్చని అంతా అశగా ఎదురు చూశారు.
అయితే ఈ ‘శుభవార్త’కు మరో భయపెట్టే కోణం కూడా ఉంది. ‘‘15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా కావడం ప్రారంభం అవు తుంది. ‘ఇది ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతి, లాతూరువాసులు దీనికి అలవాటు పడ్డారు. రెండు గంటలకుపైగా నీటిని సరఫరా చేస్తాం. ఆ నీటిని ప్రజలు ఇళ్లలోని చిన్న ట్యాంకులలోనూ, పాత్రలు, తదితరాలలో దాచుకుంటారు. ఆ నీరు 15 రోజులకు సరిపోతుంది’ అని పౌర పరిపాల నాధికారులు తెలిపారు’’ అని ఇండి యన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రెండు వారాలకు ఒకసారా? అది సాధారణమా? తాగడానికి, కడగడానికి, ఉతకడా నికి, మరుగుదొడ్లలో వాడడానికి 15 రోజులకు సరిపడా నీటిని నిల్వచేసుకోగా ఇళ్లలో మిగిలే స్థలం ఎంతో ఊహించండి. తీవ్ర పారిశుద్ధ్య సమస్యతో లాతూరు నగరం మునిగిపోకుండా మిగిలి ఉండటమే ఆశ్చర్యం.
ఈ విషయం రెండు అంశాలను ప్రతిఫలిస్తోంది. ఒకటి, పట్టణ నిర్వహణా ప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయి. భారతదేశం పట్టణీకరణ చెందడం వల్ల పెరు గుతున్న జనాభాకు అనుగుణంగా సేవలు పెరగడం లేదు కాబట్టి ప్రమాణాలు మరింతగా దిగజారుతు న్నాయి. రెండు, పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుం దని ప్రజలు ఆశించడం లేదు. మెరుగుపరచమని అధికా రులపై ఒత్తిడి తేవడం లేదు. అధికారులు, ప్రణాళికా వేత్తల నిర్లక్ష్యం, పౌరుల నిస్సహాయత కలసి దేన్నయినా సహించడంగా మనకు కనబడుతోంది. ఆవశ్యక సేవల న్నిటినీ పూర్తిగా అందించలేకపోతున్నా మనం మన పట్ట ణాలను, నగరాలను నిర్మాణంలో ఉన్నవిగా చూస్తుం డటం విచిత్రం. ఢిల్లీకి బస్తీలున్నాయి, ముంబైకి మురికి వాడలున్నాయి, అంత కంటే చిన్న పట్టణాలకు సైతం వాటికి తగ్గ మురికి ఉంది.
ఈ మురికివాడలకు బయట ఉండే అస్తవ్యస్త పరి స్థితులు సుపరిచితమైనవే... మరీ ఘోరమైన రోడ్లు, నాణ్యతాపరంగా, పరిమాణంపరంగా కూడా అధ్వాన నీటి సరఫరా, నామమాత్రపు వీధి దీపాలు, కాలువ లు, నోళ్లు తెరిచి ఉండే మ్యాన్‌హోల్స్. నగరంలో ఏం ఉంటా యని ఆశిస్తారో అవేవీ నగరాల్లో కనబడవు. పట్టణంలో లేదా చిన్న పట్టణంలోనైనా పరిస్థితి ఇదే.
గ్రామాలు పట్టణాలుగా, ఆ తదుపరి నగరాలుగా వృద్ధి చెందుతాయి, మునిసిపల్ కౌన్సిల్స్ కార్పొరే షన్లుగా ఉన్నత స్థాయికి చేరుతాయి. అయినా భూగర్భ నీటి పారుదల మార్గాలు మాత్రం ఉండవు. ఉన్నా, తగు రీతిలో ఘన వ్యర్థాల నిర్వహణ ఉండదు. ఈ పట్టణ ప్రాంతాలలోనే ఢిల్లీ బస్తీలు, ముంబై మురికివాడల వంటినిర్లక్ష్యానికి గురైన అథోఃప్రపంచాలూ ఉంటాయి. అయినా మన సింధూ నాగరికత ఎంతగా అభివృద్ధి చెందిన దో చెప్పుకుంటాం. ఆ నగరాల్లో ఎప్పుడూ పారే నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంకుడు గుంతలు ఉండేవని మరచిపోతాం.
పట్టణవాసులు ఈ అల్పస్థాయి ప్రమాణాలను ఎందుకు అంగీకరిస్తున్నారు, ఏళ్ల తరబడి ఈ సమస్యలు సలుపుతుండటాన్ని, మరింతగా దిగజారిపోతుండ టాన్ని ఎందుకు అనుమతిస్తున్నట్టు?
నీరు పునరుత్పాద కమైనదే అయినా ఆ నీటి వనరును కనుగొని, సక్ర మంగా సంరక్షించి, సమర్థవంతమైన ఉపయోగకం కోసం తగు రీతిలో వాడుకోవాల్సి ఉన్నది, నిజమే. అయితే, ఎప్పుడో ఒకసారి ఆ వనరుకు కొరత ఏర్పడు తుంది లేదా వినాశకరమైనంత ఎక్కువగా వచ్చిపడు తుంది. కానీ కాలువలు, పారిశుద్ధ్యం మాత్రం ప్రకృతిపై ఆధారపడినవి కావు. మన పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి దాదాపుగా ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవి అన్నీ చేరు తాయి. రవాణా, రోడ్లు, పాదచారుల బాటలు, మార్కెట్లు ఇలా ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ మౌలిక సదుపాయాలు కొరవడినా ‘స్మార్ట్ నగరాలు’ అని మాట్లాడటం హాస్యాస్పదం. అయినా ఈ మట్టి కాళ్లతోనే మన తలలను నక్షత్రాల మధ్య నిలపగల మని విశ్వ సిస్తాం. రెండు వారాలకు ఒకసారి నీటి సరఫరా ‘సాధా రణం’ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు.
( వ్యాసకర్త: మహేశ్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు)
ఈ మెయిల్ mvijapurkar@gmail.com