opinon
-
ఉచితాలు కావవి... సంక్షేమ పథకాలు
ప్రజాస్వామ్య వ్యవస్థలో సంక్షేమ పథకాలు అనేవి బలహీన వర్గాలకెంతో మేలు చేసేవి. ప్రజాస్వామ్య ప్రభుత్వాల బాధ్యత ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు రూపొందించడం. ఆ పనిని తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ దేశంలోనే అందరికంటే మేలైన రీతిలో అమలు చేస్తున్నారు. రైతును ఆదుకునే పథకాలు, విద్యా సంబంధమైన ఫీజు రీయింబర్స్మెంట్లు, రుణమాఫీలు, వృద్ధాప్య పెన్షన్లు, వివిధ వృత్తుల వారి ఆదాయాలను పెంచే పథకాలెన్నో రూపొందించి ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడాలేవు. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ పథకాలను ఉచితాలంటూ, ఉచితాలు ఇవ్వకూడదంటూ విమర్శలు చేస్తున్నది. పేదల కడుపు కొట్టాలని చూస్తున్నది. ఉచిత కరెంటు, గ్రామీణ పేదలకు లక్షల్లో ఇళ్లు కట్టించడం, రైతుబంధు, ఇంగ్లిష్ మాధ్యమం ద్వారా నాణ్యమైన విద్యను పేదలకు అందించడం, రుణమాఫీ, దళితుల దీన పరిస్థితులను మార్చే దళితబంధు, వ్యవసాయాన్ని లాభసాటి చేయడానికి రైతును ఆదుకోవడం, మహిళలను ఆదుకోవడం... ఇలాంటివన్నీ బీజేపీ దృష్టిలో ఉచితాలే. ఈ ఉచితాల వల్ల నష్టం జరుగుతుందట. సర్వ సంపదలు సృష్టించే ఉత్పత్తి కులాల వారి బతుకుల్లో వెలుగు నింపడానికి అమలు చేసే సంక్షేమ పథకాలు ఉచితాలు ఎలా అవుతాయి? ప్రజాస్వామ్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయడమనేది ప్రభుత్వ అతి ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి. సంక్షేమ పథకాలను బాగా అమలు చేయడం వల్ల ప్రజల్లో హింసాయుత తిరుగుబాటు ధోరణి తగ్గు తుందన్నది వాస్తవం. అందుకే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ ఒక్క విప్లవమూ విజయవంతం కాలేదు. సంక్షేమ పథకాలతో పాటు ఉపాధిహామీ, ఉపాధి కల్పన వంటివి ప్రజల్లో ఉన్న అసంతృప్తిని తగ్గించి దేశం పట్ల ప్రేమను పెంచుతాయి. ప్రజలకిచ్చే సంక్షేమ పథకాలను ఉచితాలనడం ప్రజావ్యతిరేకతకు నిదర్శనం. ఇన్‌కంటాక్స్ పేయర్స్ డబ్బుల నుంచి ఈ డబ్బు వస్తుందట. ఈ కార్పొరేట్ శక్తుల ఆదాయం వేలు, లక్షల కోట్లలో పెరుగడానికి కారణం ఈ దేశ సాధారణ ప్రజలే. వీళ్ళు వాళ్ళ వస్తువులను కొనకుంటే వారికి ఆదాయమెక్కడిది? పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ శక్తులకు, ఇన్‌కంటాక్స్ పేయర్స్‌కు వచ్చే ఆదాయంలోని ప్రతి రూపాయిలో కోట్లాది మంది ప్రజలు రోజూ కొంటున్న వస్తువులపై వేసే పన్నుందనేది వీరు మరచిపోతున్నారు. (క్లిక్ చేయండి: ఓటమి భయంతో రెండు నాల్కలు) ఇంతకీ కార్పొరేట్ శక్తులు, పారిశ్రామిక వేత్తలు, ఇతర ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లోలా పన్ను చెల్లిస్తే దేశ పరిస్థితి ఇలా ఉండేదా? పేదరికం ఈ స్థాయిలో బుసలు కొడుతుందా? ఈ శక్తులు అక్రమ సంపాదనను బ్లాక్ మనీగా ఉంచడం, విదేశీ బ్యాంకుల్లో దాచుకోవడం వల్లనే కదా లక్షల కోట్ల దేశ సంపద లెక్కల్లోకి రాకుండా పోతోంది! ఆ డబ్బునంతా వైట్‌మనీగా మారిస్తే దేశంలో పేదరికం ఉంటుందా? కార్పొరేట్లు... బ్యాంకుల రుణాలను కట్టలేమంటే రుణమాఫీ పేరుతో ఇచ్చే వెసులుబాటు ఉచితం కాదు కానీ ప్రజా సంక్షేమ పథకాలు మాత్రం ఉచితాలా? పేదలకిచ్చే ఉచితాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందా? పన్ను ఎగవేతదారులను సగౌరవంగా విదేశాలకు పంపించడం దేశానికి మేలు చేయడమవుతుందా? పేదలను ఆదుకొనే ప్రభుత్వాలే అసలు సిసలైన సంక్షేమ ప్రభుత్వాలు. వాటిని విమర్శించేవారు ఎప్పటికీ ప్రజావ్యతిరేకులే! (క్లిక్ చేయండి: ఉన్నవాళ్లకే మరిన్ని రాయితీలా?) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ కథారచయిత, విమర్శకులు -
ఆంధ్రకు వరం ఈ కొత్త ‘పార్క్’
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో అంతర్భాగం పారిశ్రామిక ప్రగతి. దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సహజ వనరులు, మానవ వనరులు గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం అవుతాయి. అదే సమయంలో సర్వజనుల అవసరాలు తీరుతాయి. ఇవి ప్రజల ప్రాణాలకు సంబంధించినవి అయినప్పుడు వారి జీవన ప్రమాణ స్థాయి కూడా పెంచుతాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా మన రాష్ట్రానికి కేటాయించిన ‘బల్క్ డ్రగ్ పార్క్’ (బీడీపీ) మనకు ఈ ప్రయోజనాలు అన్నింటినీ కలుగజేయనున్నది. శక్తిమంతమైన పొరుగు రాష్ట్రాలను కాదని కేంద్రం దీనిని మనకు ఇవ్వటం గమనార్హం. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే కర్ణాటకలోనూ ఉన్నా... దాన్ని పక్కన పెట్టి మన రాష్ట్రానికి ప్రాధాన్యత నివ్వటం హర్షణీయం. ‘బల్క్ డ్రగ్ పార్క్’ కేటాయించడానికి కేవలం కేంద్ర ఉదారత మాత్రమే కారణం కాదు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్డు, రైలు, నౌకా రవాణా, విద్యుత్తు, నీటి సదుపాయాలు లాంటి మానవ నిర్మిత, సహజ మౌలిక సదుపాయాలు అనేకం ఉన్నాయి. విదేశీ వాణిజ్యానికి కావాల్సిన ఓడరేవులున్న తీరప్రాంతం ఉంది. నైపుణ్య మానవ వనరులు అందించే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు గోదావరి జిల్లాల్లో విజయ వంతంగా నడుస్తున్న పలు రకాల పరిశ్రమలు ఉన్నాయి. ముఖ్యంగా బల్క్ డ్రగ్స్‌కు కావాల్సిన అనేక రకాల రసాయనాలు, ఇతర ముడి పదార్థాలు సరఫరా చేయగల సామర్థ్యం ఉన్న సంస్థలు అనేకం ఉన్నాయి. ఇటీవల నూతనంగా సామర్లకోటలో ఆదిత్య బిర్లా గ్రూపు నెలకొల్పిన ‘ఆల్కలీ’ పరిశ్రమ కూడా రాబోవు పార్క్ అవసరాలను మరింతగా తీర్చగలదు. ఫార్మా రాజధానిగా పేరుగాంచిన హైదరాబాదులో ఎన్నో ఫార్మా కంపెనీలను సృష్టించి అంతరించిన ఐడీపీఎల్ ఉండేది. దానికి అవసరమైన సమస్త రసాయనాలు, ఆమ్లాలు, వాయు వులు అనేకం తణుకు, కొవ్వూరు, సగ్గొండ ఫ్యాక్టరీల నుండి సప్లై అవుతుండేవి. వ్యవసాయాధార చక్కెర కర్మాగారాలు రైతు శ్రేయస్సు కొరకు తణుకు, చాగల్లు, ఉయ్యూరు లాంటి చోట్ల నెలకొని ఉన్నాయి. ఆ కర్మాగారాలలో చక్కెరతో పాటు మొలాసిస్ వస్తుంది. దాని నుండి ఆల్కహాల్, ఇతర ఆర్గానిక్ రసాయనాలు తయారు చేస్తారు. అవి బల్క్ డ్రగ్స్ తయారీలో వాడతారు. వీటి కారణం గానే ఇప్పటికే తణుకులో ఆస్ప్రిన్, సాలిసిలిక్ యాసిడ్ తయారీ జరుగుతోంది. అంతరిక్ష నౌకల్లో వాడే రాకెట్ లిక్విడ్ ఇంధనం కూడా తణుకులోనే తయారవడానికి ఈ రసాయనాల లభ్యత ముఖ్య కారణం. తూర్పుగోదావరి జిల్లాలో రాబోయే ఈ బీడీపీలోని సంస్థలకు ఇవన్నీ అమర్చి పెట్టినట్లు అందుబాటులో ఉంటాయి. ఈ పార్క్ కేటాయింపులో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఉంటారు. ఈ పార్క్‌లో ఫార్ములేషన్, ప్యాకింగ్, టెస్టింగ్ లాబ్స్, రవాణా, ఫైనాన్స్ లాంటి అనుబంధ సంస్థలు వస్తాయి. అందువల్ల మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాలుష్య నివారణ, నియంత్రణ, పారిశ్రామిక భద్రత, సామాజిక బాధ్యత వంటి విషయాల్లో ఎలాంటి రాజీ పడని సీఎం నేతృత్వంలో.. రాష్ట్రం పారిశ్రామిక వృద్ధిలో అగ్రస్థానంలో నిలుస్తుందని ఆశిద్దాం. (క్లిక్: శాస్త్ర జ్ఞానాభివృద్ధే దేశానికి ఊపిరి) - బి. లలితానంద ప్రసాద్ కార్పొరేట్ వ్యవహారాల నిపుణులు -
విపత్తులు సరే... నివారణ ఎలా?
ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా. అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట! వీటి పరిధి, తీవ్రత కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా, ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ బాధితురాలిగా ఉంటున్నందున, భారత్ ఈ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే. ఈ సూచికకు సంబంధించి భారత్ స్కోర్ 7.7గా ఉంది. దేశ జనాభాలో 32 శాతంమంది జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్న వాస్తవం మర్చిపోకూడదు. మునుపటి అయిదేళ్ల కాలంకంటే ప్రస్తుత అయిదేళ్ల కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు లేదా విపత్తుల బారిన పడ్డారు. విపత్తుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, లేదా అంచనా వేయడంలో సమకాలీన పద్ధతులు యథాతథ స్థితినే తరచుగా పరిగణిస్తున్నాయి తప్ప వ్యవస్థల్లో ప్రమాదాలు ఎలా రూపొందుతున్నాయి అనే అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, కోవిడ్–19 నేప థ్యంలో అహ్మదాబాద్ ఓల్డ్ సిటీలో, ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారు లేదా ఒకే ఇంట్లో అయిదుమందికి పైగా నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా వైరస్‌ని వ్యాపింపజేస్తున్నట్లు కనిపించింది. ఇవి చారిత్రక, సామాజికార్థిక వాస్తవికతలు. కాబట్టి, సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించకపోతే, ఇలాంటి ఆకస్మిక వ్యాధులు పదేపదే పునరావృతమవుతూ ఒకేరకమైన పర్యవసానాలకు దారి తీస్తుంటాయి. దీనికి సంబంధించి విధాన నిర్ణేతలు– సామాజిక, ఆర్థిక దౌర్బల్యాలకు వెనుక గల సమకాలీన, చారిత్రక కారణాలను పరిశోధించాలి. విపత్తు ప్రమాద తగ్గింపుపై అంతర్జాతీయ అంచనా నివేదిక, కోవిడ్–19 ప్రపంచం ముందు సంధించిన సవాలును చర్చిస్తూనే ఆరోగ్య వ్యవస్థలలో ఉనికిలో ఉన్న దుర్బలత్వాలని మహమ్మారి ఎత్తిచూపిన కోణాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. అంతకుమించి అది అసమా నత్వం, నిరుద్యోగితను బలంగా ప్రదర్శించి చూపింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్య, పోషకాహారం, ఆహార భద్రత వంటి విషయాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు, దాని క్రమాలను భారత్‌లోని ప్రపంచ చారిత్రక నగరమైన అహమ్మదాబాద్ ఓల్డ్ సిటీలో నిర్వహించిన తాజా నివేదిక (2022) వెల్లడించింది. శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ ప్రమాదాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. పట్టణీకరణ వేగ ప్రక్రియే వాతావరణ మార్పు ప్రభావాలకు ప్రజలను బలిజీవులుగా మారుస్తోందని నివేదిక తెలిపింది. తీర ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో జనాభా సాంద్రీకరణ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం 2006 నుంచి సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు సంవత్సరానికి 3.7 మిల్లీ మీటర్లుగా ఉంటోందని వెల్లడయింది. ఈ లెక్కన 2100 నాటికి 20 కోట్లమంది ప్రజలు దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. ఆసియా ప్రజలే ప్రధానంగా దీని బారిన పడనున్నారని, ప్రత్యేకించి చైనాలో (4 కోట్ల 30 లక్షల మంది), బంగ్లాదేశ్‌లో (3 కోట్ల 20 లక్షలమంది), భారతదేశంలో (2 కోట్ల 70 లక్షలమంది) దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2015 నుంచి 2030 నాటికి, ప్రతి సంవత్సరం విపత్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మేరకు పెరగవచ్చు. ఇక కరువుల విషయానికి వస్తే 2001 నుంచి 2030 నాటికి 30 శాతం పెరుగుతాయని ప్రస్తుత ధోరణులు సూచిస్తున్నాయి. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్న ఘటనల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. విపత్తుల వల్ల ఎక్కువమంది దెబ్బ తినడమే కాకుండా, దారిద్య్రం కూడా పెరుగుతుంది. 1990లలో విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు సగటున 70 మిలియన్ డాలర్లమేరకు సంభవించగా, 2020 నాటికి సంవత్సరానికి 170 మిలియన్ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్థిక నష్టాలకు సంబంధించి బహుశా 40 శాతానికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. అయితే ఈ బీమా రక్షణ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే చాలావరకు కేంద్రీ కృతం అయింది. (చదవండి: ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!) వాతావరణ అత్యవసర పరిస్థితి, కోవిడ్–19 మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు ఒక కొత్త వాస్తవికతను ముందుకు తీసుకొచ్చాయి. ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో, నిజమైన, నిలకడైన అభివృద్ధిని సాధించటానికి నష్టభయాన్ని అవగాహన చేసుకోవడమే ప్రధానం. భవిష్యత్తు షాక్‌లకు వ్యతిరేకంగా ఉత్తమమైన రక్షణ ఏమిటంటే, ఇప్పుడు వ్యవస్థలను పరివర్తన చెందించి, వాతా వరణ మార్పు, తదితర అవరోధాలను పరిష్కరిస్తూ స్థితిస్థాపకతను నిర్మించుకోవడమే. హానికర పరిస్థితులను తగ్గించి, విపత్తులవైపు నెట్టే అసమానత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా దీంట్లో భాగమే. ఇలా చేయగలిగితేనే కార్యాచరణ సాధ్యం అవుతుంది. (చదవండి: సామాజిక పరివర్తనే సంఘ్ లక్ష్యం) తప్పుల నుంచి నేర్చుకోవడానికీ, అనిశ్చితి పట్ల మరింత స్పష్టంగా కమ్యూనికేట్ కావడం ఎలాగో తిరిగి అంచనా వేసుకోవడానికీ పాలనా వ్యవస్థలు లక్ష్యాల సాధనకు అవసరమైన పద్ధతులను తక్షణం అలవర్చు కోవాలి. పాలనా వ్యవస్థలు తప్పుడు విషయాలను మదిస్తూ వాటి విలువను లెక్కిస్తున్నాయి. మానవ మనస్సు – వ్యవస్థలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, ఉత్పత్తి – సేవలు ఎలా పనిచేస్తాయి, నష్టభయాన్ని అర్థం చేసుకుని వాటిని నిర్వహించడంలో ప్రస్తుత పద్ధతులు ఎలా విఫలమయ్యాయనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ద్వారా మన పాలనా, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం అవసరం. - డాక్టర్ జ్ఞాన్ పాఠక్ ప్రసిద్ధ కాలమిస్ట్ -
రాజ్యాంగ పీఠిక ఓ ప్రకటన!
భారత రాజ్యాంగ పీఠిక ఒక జాతీయ గీతం వలె కనిపిస్తుంది, వినిపిస్తుంది. కవీంద్ర రవీంద్రుడు రాసిన జాతీయ గీతం ‘జనగణ మన అధినాయక జయహే’ ఒక దేశభక్తి గీతం. సందేహం లేదు. ఒక గౌరవ వందన గీతం. ఈ పీఠిక పాట కాదు, ఒక పాఠం. ఒక ప్రతిజ్ఞ. ఒక ప్రకటన. ఒక లక్ష్య వాగ్దానం! ఇందులో నిరంతరం గుర్తుంచుకోవలసిన మంత్రాక్షరాలున్నాయి. దిశా నిర్దేశనం నియంత్రణ చేసే ఒక ఆదేశ పత్రం. ప్రజాసార్వభౌములు జారీ చేసిన ఒక రిట్. అనుల్లంఘనీయ శాసనం. కానీ రక్షిస్తామన్నవారూ, పాటిస్తామన్నవారూ, చదవవలసిన వారూ, అర్థం చేసు కోవలసిన వారూ అందరూ మరిచిపోయారు!! ఈ పీఠిక చదవడం ప్రభువులకు కోపకారణం అయింది! పోలీసులు లాఠీలెత్తారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని విమర్శిస్తూ ప్రసంగించినందుకూ, పీఠిక చదివి నందుకూ, రాజ్యాంగాన్ని జనానికి చూపినందుకూ చంద్రశేఖర్ ఆజాద్‌పై క్రిమినల్ కేసులు పెట్టారు. పీఠికను గుర్తు చేయడం తరాజులకు నచ్చడం లేదు. యూఏపీఏ చట్టం కింద బెయిల్ రాని సెక్షన్లతో కొడుతున్నారు. తిడుతున్నారు. రాజు దైవమై పోతున్నాడు. కోర్టులు బెయిల్ ఇవ్వడం దైవాధీనంగా మారిపోయింది. చివరకు ఢిల్లీ కోర్టు న్యాయాధికారి కామినీ లావ్ ‘‘ధర్నా చేస్తే తప్పేమిటి, నిరసన చేయడం నేరమా? అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు కదా? మీరు అసలు రాజ్యాంగం చదివారా?’’ అని పోలీసులను అడిగారు. న్యాయమూర్తులకూ, న్యాయాధికారులకూ, రాజ్యాంగం కింద నియుక్తులైన అధికారులకూ... అందరికీ రాజ్యాంగం పవిత్ర పత్రమైనపుడూ, ఆ రాజ్యాంగం సరైనదైనపుడూ, చదివితే నేరమా? ఎంత మాత్రం కాదని ఆ కోర్టు తీర్పు చెప్పవలసి వచ్చింది. పీఠిక రాజ్యాంగాన్ని పరిచయం చేస్తుంది. రాజ్యాంగ లక్ష్యం, సూత్రాలు, మౌలిక తత్వం వివరించిన పీఠం అది. పీఠిక చదివితే అరెస్టు చేయరాదని కోర్టు చెప్పిన తరువాత గానీ బెయిల్ దొరకలేదు. విడుదలైన వెంటనే పీఠిక చదివాడాయన, కరతాళ ధ్వనుల మధ్య! ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించడానికి ఉపయోగించే నిరసనోద్యమ దీప్తిగా పీఠికా పఠనం మారిపోయింది. తరువాత కొన్ని నెలలకు భారత ప్రభుత్వం పీఠికా పఠనాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్దేశించింది. 75 సంవత్సరాల అజాదీ ఆమృతోత్సవంలో తప్పనిసరిగా కేంద్ర మంత్రిత్వశాఖలు తమ కార్యాల యాల్లో గోడలమీద ప్రవేశిక లిఖించి పెట్టాలని ఆదేశించింది. రాష్ట్రపతి స్వయంగా పీఠికను అందరితోపాటు చదివే కార్యక్రమాన్ని 2020లో అధికారికంగా ఆరంభిం చారు. 2015లో ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో పీఠిక చదివారు. న్యాయ, పర్యావరణ శాఖామాత్యులు తన మంత్రిత్వ భవనంలో ప్రియాంబుల్ గోడను ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్, కేరళ వంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పీఠికను అన్ని పాఠశాలల్లో తప్పని సరిగా చదవాలని ఆదేశం జారీ చేశాయి. ఇదీ మన పీఠిక! దీన్ని అవతారిక అనీ అంటారు. ఇంగ్లీషులో ప్రియాంబుల్ అన్నారు. భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలను; ఆలోచనా, భావ ప్రకటనా, మత విశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ, అవకాశా ల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్నీ, జాతి ఐక్యత– సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలనీ; మన రాజ్యాంగ పరిషత్తులో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీ కరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించు కున్నాం. మొదట్లో భారత్‌ను సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా పేర్కొన్నారు. అయితే 42వ రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా మారింది. (చదవండి: ‘అడిగే హక్కే’ అన్నిటికీ ఆధారం) 1776లో అమెరికన్ రాజ్యాంగ పీఠిక అమెరికా స్వతంత్ర ప్రకటనలో కీలకమైన భాగం. రాజ్యాంగానికి పీఠిక గుర్తింపు కార్డు వంటిదని శంకరీ ప్రసాద్ కేసులో (1952) జస్టిస్ హిదయతుల్లా పేర్కొన్నారు. విచిత్రమేమంటే పీఠిక మన రాజ్యాంగంలో అంతర్భా గమా లేక బయట ఉన్న ఒక పేజీయా అని పేచీ వచ్చింది. ఈ అంశాన్ని బాగా విచారించి, సుదీర్ఘమైన వాదోపవాదాలు విన్న తరువాత న్యాయమూర్తుల ధర్మాసనం కేశవానంద భారతి కేసులో పీఠిక రాజ్యాంగంలోని అంతర్భాగమేనోయీ అని తీర్పు చెప్పింది. అంతకు ముందు సుప్రీంకోర్టు వారు పీఠిక అంతర్భాగం కాదన్నారు. విచిత్రమేమంటే పీఠికలో ఉన్న హక్కులకు భంగకరమైన నియమాలు, లక్ష్యాలను అడ్డుకునే నియ మాలు కొన్ని మొదటినుంచీ ఉండటం; మరెన్నో తరువాత కాలంలో వచ్చి చేరుతూ ఉండటం గమనించవలసి ఉంది. భారత ప్రజలు చేసుకున్న సామాజిక ఒప్పందమే ఈ పీఠిక. ఇందులో విలువలను కాపాడటానికి మనం దీక్షాబద్ధులం కావాలి. పౌరుడిని చైతన్యవంతమైన, సహేతుకమైన, స్వేచ్ఛాయుతుడైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతిజ్ఞ చేయాలి. మనం ఇంకా కులమతాల చట్రాలలోంచీ, చట్టాల లోంచీ బయటకు రాలేదు. మన ఎన్నికలన్నీ కులమతాలకు చెందిన ఓటర్లను ప్రేరేపించడంతోనే మొదలై, ముగుస్తున్నాయి. 75 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత కూడా మనం సామాజిక అభివృధ్ధి, ప్రజాస్వామ్య విలువల వంటి వాటిని చూడడం లేదు. తాతల నాటి కట్టడాలు తమ ఘన కార్యక్రమం అన్నట్టు చూపి, సంస్కృతిని బూచిగా మార్చి, మతాన్నీ, కులాన్నీ నిత్యం వల్లిస్తూ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రయత్నించడం చూస్తూనే ఉన్నాం. మత్తు పుచ్చుకుని ఇచ్చుకుంటున్నాం. (చదవండి: ఒక తీర్పు – అనేక సందేహాలు) - ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ స్కూల్ ఆఫ్ లా డీన్, మహీంద్రా యూనివర్సిటీ -
మత్తు చల్లుతున్నారు.. అందుకే చూశారా?
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! మత్తు చల్లుతున్నారు ఇదే కాశీ కారిడార్ నిర్మాణం అయిన ఉత్తరప్రదేశ్‌లో వేలాది మంది ప్రభుత్వ వైఫల్యం వల్ల కోవిడ్‌తో చనిపోయారు. ఈ సత్యాన్ని ఏ మత మత్తుమందు కూడా అణిచివేయలేదు. మనం మతానికంటే పాలనకు ప్రాధాన్యత ఇచ్చివుంటే ఇందులో చాలా జీవితాలను కాపాడగలిగేవాళ్లం. – అర్ఫా ఖానమ్ షేర్వానీ, జర్నలిస్ట్ అందుకే చూశారా? విశ్వసుందరి పోటీదారులు ఇచ్చినవి మూర్ఖపు జవాబులని చాలామంది ట్రోల్ చేస్తున్నారు; వీళ్లేదో నిజంగానే జ్ఞాన సముపార్జనకు ఆ కార్యక్రమం చూసినట్టు. అది అందాల పోటీ నాయనా, క్విజ్ ప్రోగ్రామ్ కాదు. – అహ్మద్ షరీఫ్, కమెడియన్ వెనుకడుగులు ప్రధానమంత్రి చురుగ్గా ఉండే మెజారిటీ వర్గపు వారి పూర్తి మతపరమైన కార్యక్రమాలను ఇంకే దేశాలైనా ఇలా ప్రసారం చేస్తాయా? రోజురోజుకీ మనం ప్రజాస్వామ్యం, లౌకికవాదాల పరంగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తున్నాం. – అజయ్ కామత్, నేత్ర వైద్యుడు టీకా వివక్ష ప్రపంచంలో చాలా దేశాలు కోవిడ్ బూస్టర్ డోసుల వెయ్యడానికి సిద్ధమవుతున్నాయి. కానీ మాలావీ (ఆఫ్రికా దేశం)లో కేవలం సుమారు ఆరు లక్షల మందికే ఇప్పటివరకూ పూర్తి టీకాలు పడ్డాయి. 1.8 కోట్ల జనాభాలో ఇది ఏపాటి? ఒమిక్రాన్‌తో నాలుగో వేవ్ వ్యాపిస్తున్న సమయంలో ఇది అన్యాయం కాదా? టీకాలు ప్రపంచంలో అందరికీ సమానంగా అందాలి. – కిసోమో కలింగా, పరిశోధకురాలు రంధ్రాన్వేషకులు జనంలో నిజంగానే ఏదో భాగం కుళ్లిపోయింది. ఒక విషయాన్ని సుసాధ్యం చేసిన ప్పుడు కూడా దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మనం ఇలా ఎందుకు తయారవుతున్నాం? కాశీ కారిడార్ అనేది ప్రగతి. దీన్నెందుకు జీర్ణించుకోరు? ప్రతిదానిలోనూ తప్పు పట్టాలని ఎందుకు చూస్తారు? చేసినదానికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వండి. – సుహేల్ సేఠ్, రచయిత అవే అందం ఒక విదేశీయుడిగా నేను చెప్పగలను. సంప్రదాయాలు, ఆచారాలే భారత్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి. నాకు చాలా నచ్చాయి. – కోబీ శోషానీ, ఇజ్రాయిల్ ఉన్నతాధికారి అసలు అర్థం ఒక నాయకుడు తరచుగా గతాన్ని రెచ్చగొడుతున్నాడంటే, భవిష్యత్ దిశగా అతడి దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదని అర్థం. – సంజయ్ ఝా, కాంగ్రెస్ మాజీ ప్రతినిధి -
మనిషి హక్కుకు గుర్తింపు ఏది?
సాటిమనిషిని మనిషిగా చూడని సందర్భాలెన్నో చూస్తూనే ఉన్నాం. మనల్ని కాపాడిన మానవ హక్కుల పరిరక్షణను మనమే కాలరాస్తున్నాం, హరించివేస్తున్నాం. 1948 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కులను ప్రకటన చేసింది. దాని లక్ష్యం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్షకు గురవ్వకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్న సందేహం రాక తప్పదు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుమారు 30 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోలేకపోవడం బాధాకరం. మానవ హక్కులు గురించి మాట్లాడుకోవడమే తప్ప ఉల్లంఘన జరిగే తీరు మాత్రం మారడం లేదు. నిరంతరం ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్కరు ఉలికిపడుతున్నారు. కోర్టులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ నివారణ మాత్రం కష్టతరమవుతోంది. మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 అక్టోబర్ 12న నాటి ప్రధాని పి.వి. నరసింహరావు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసారు. నేటికి 18 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను మన దేశంలో ఏర్పాటు చేసాయి. (చదవండి: కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?) 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, ఆదర్శవంతమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. దీన్ని చారిత్రక అంశంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి ఆమోదించిన దినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఒక అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి... మానవ హక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకున్నారు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
వైరస్‌కు మన కవచం... సంక్షేమ ఫైర్‌వాల్
విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు కుదుటపడటం ఇప్పట్లో కష్టం. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ స్వీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకోవడం, ఆ తీరును మోస్తున్న ‘మీడియా’ అందుకు కారణం. తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని ప్రాంతీయ అస్తిత్వంగా మలిచి, రాజకీయ ప్రతిపత్తిని పొందడం చూశాక అయినా, ఆంధ్ర పౌరసమాజంలో ప్రాంతీయ బంధనం (రీజినల్ బాండ్) కొరకు ఆలోచన మొదలుకావాలి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రయోజనం కోసం ఒక ‘ఎజెండా’తో పనిచేయాలి. రాష్ట్ర దీర్ఘకాల ప్రయోజనాల కోసం అక్కడి జ్ఞాన సమాజం ఈపాటికి ఒక ముసాయిదా రూపొందించి, ప్రభుత్వంతో ‘డైలాగ్’ మొదలెట్టాలి. అదొక సమాంతర ‘ఒత్తిడి బృందం’ (ప్రెషర్ గ్రూప్) కావాలి. అయితే మొదటి ఐదేళ్ళలో ఇవేమీ జరక్కపోవడంతో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఎన్నికైన ప్రభుత్వం అయినా, ఎన్నిక కావాలనుకున్న ప్రతిపక్షం అయినా ప్రజలు–ప్రాంత హితం వాటి లక్ష్యం కావాలి. కొన్ని పార్టీలు ఎప్పుడూ అధికారానికి దూరమే అయినా, అవి నిత్యం ప్రజల పక్షాన ఉన్నట్టుగా కనీసం కనిపిస్తాయి. ‘బీపీవో ప్రభుత్వాలు’ వచ్చాక, ప్రభుత్వంలో వుంటే ఎక్కువ సంపద, ప్రతిపక్షంగా ఉంటే తక్కువ సంపద ‘ఫార్ములా’ అయింది. అందుకే మూకుమ్మడి పార్టీల ఫిరాయింపు మొదలయింది. వ్యాపారం–రాజకీయం నాణేనికి రెండు వైపులుగా మారింది. విభజన తర్వాత ఏపీలో ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని తన ‘విజన్ 2029’లో ప్రకటించింది. ఇది పూర్తిగా కేంద్రీకృత పాలనా వ్యవస్థ. దాన్ని మరింత సుస్థిర పర్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధులు దాటిమరీ ఇజ్రాయెల్ నుంచి ‘సైబర్ టెక్నాలజీ’ని కూడా తీసుకోవాలని 2017 ఫిబ్రవరి నాటికే అనుకొంది. ఇజ్రాయెల్ దౌత్యవేత్త డేవిడ్ కామెరాన్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఇది జరిగిన ఐదేళ్లకు ఇజ్రాయెల్ సైబర్ ఆర్మ్ ‘పెగసస్ స్పైవేర్’ మన దేశంలో ఆందోళనకరమైన స్థాయిలో జాతీయ వార్త అయింది. ప్రభుత్వంలో లేకపోయినా సమాంతరంగా ‘షాడో–గవర్నెన్స్’ నడిపితే తప్ప, తమ వాణిజ్య ప్రయోజనాలు కొనసాగని పరిస్థితి టీడీపీలో నెలకొంది. సరిగ్గా ఇక్కడే, మనం జనం కోసమా? లేక మనవాళ్ళ ‘బిజినెస్’ కోసమా? అనే చిట్టచివరి ప్రశ్నకు కూడా జవాబు చెప్పవలసిన అగత్యం ప్రతిపక్షానికి ఏర్పడింది. నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీ మనుగడ ‘క్రిటికల్ కేర్’ స్థితికి చేరిన పరిస్థితుల్లో, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన ‘లైన్’ తీసుకోవడానికి కూడా వెరవకపోవడం చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా, ఒక ‘షాడో’ రూపంలో ఒక్కొక్కరిలో ‘స్పైవేర్’గా ప్రవేశిస్తూ, ప్రభుత్వాన్ని అలజడికి గురిచేయాలని ప్రయత్నించడం చూస్తున్నాం. ఇందుకోసం పనిచేసేవారిలో నర్సీపట్నం డాక్టర్ పేరు మనకు తెలిస్తే, రామతీర్థం గుడి విధ్వంసం క్రిమినల్ పేరు తెలియక పోవచ్చు. ఇటువంటి నిరంతర ‘షాడో ట్రాకింగ్’ ఒత్తిడిని తట్టుకుంటూ తన పని తాను చేసుకోవడం తర్వాతి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పని అయింది. ముందుగా బాబు ‘హబ్ అండ్ స్పోక్స్’ పాలసీని ‘జీరో’ చేస్తూ– మూడు రాజధానులు, కొత్త జిల్లాలు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాలు, అన్ని కులాల సంక్షేమానికి సంస్థలు, కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసి షాడో గవర్నెన్స్‌కు తన ‘ఫైర్‌వాల్’తో తొలి చెక్ పెట్టింది జగన్ ప్రభుత్వం. విభజన తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి రాష్ట్ర ‘మ్యాప్’ను ముందు పెట్టుకుని మరీ చేసిన కసరత్తుతో, ‘బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’, ‘పలమనేరు– కుప్పం–మదనపల్లి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటును చూసినప్పుడు, ‘పాలిటీ’ తన సరిహద్దులకు చేరిన విషయం మనకు అర్థం అవుతుంది. ఐదేళ్ళ కోసం ఎన్నికైన ఏ ప్రభుత్వం అయినా తన కాలంలో ఇటువంటి విత్తనాలు నాటాలి. రాజ్యాంగ పరిధిలో మనకున్న అధికారాలతో మనం చేయవలసింది మాని, అవతలివాళ్లు చేస్తున్నది తెలుసుకోవడానికి ‘స్పైవేర్’ ఎందుకు? ‘పెగసస్’ ఉదంతం వెలుగులోకి వచ్చాక, మాజీ జాతీయ భద్రతా సలహాదారు ఎంకే నారాయణన్.. మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ప్రభుత్వాలను కూడా ఇటువంటి ‘సైబర్ ఆయుధాలు’ అస్థిరపరుస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు, ప్రధానంగా రాజకీయాలకు దూరంగా ఉండే మధ్య తరగతి ఆలోచనాపరుల వివేచన ఎంతైనా అవసరమైన దశలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు పూర్తిగా ‘టెర్మినల్’ దశకు చేరడంతో, వాటి తదుపరి దశను ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మున్ముందు ఇది దేశానికి దిక్సూచి కావొచ్చు. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
మట్టికాళ్ల మహా నగరాలు
ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవన్నీ పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి చేరుతాయి. రవాణా, రోడ్లు, పాద చారుల బాటలు, మార్కెట్లు ఇలా దాదాపు ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ ఫిబ్రవరిలో లాతూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడటంతో మన రైల్వేలు మీరజ్ నుంచి 100కు పైగా నీటి రైళ్లను నడి పాయి. తర్వాత, హఠాత్తుగా శుభవార్త వచ్చింది. వానలు కురిసి లాతూరు మంచినీటి అవసరాలను తీర్చే రెండు నీటి వనరులు పూర్తిగా నిండాయి. నీటి సంక్షోభం ‘దాదాపుగా ముగిసి పోయింది’ అని మునిసిపల్ అధికారులు ఆనందంగా చెప్పారు. నీటి ఎద్దడి ఆ నగరపు సామాజిక, ఆర్థిక జీవి తాన్ని కల్లోలపరిచింది. దీంతో తిరిగి ‘సాధారణ’ జీవితం గడపవచ్చని అంతా అశగా ఎదురు చూశారు. అయితే ఈ ‘శుభవార్త’కు మరో భయపెట్టే కోణం కూడా ఉంది. ‘‘15 రోజులకు ఒకసారి చొప్పున అన్ని ప్రాంతాలకు నీరు సరఫరా కావడం ప్రారంభం అవు తుంది. ‘ఇది ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతి, లాతూరువాసులు దీనికి అలవాటు పడ్డారు. రెండు గంటలకుపైగా నీటిని సరఫరా చేస్తాం. ఆ నీటిని ప్రజలు ఇళ్లలోని చిన్న ట్యాంకులలోనూ, పాత్రలు, తదితరాలలో దాచుకుంటారు. ఆ నీరు 15 రోజులకు సరిపోతుంది’ అని పౌర పరిపాల నాధికారులు తెలిపారు’’ అని ఇండి యన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. రెండు వారాలకు ఒకసారా? అది సాధారణమా? తాగడానికి, కడగడానికి, ఉతకడా నికి, మరుగుదొడ్లలో వాడడానికి 15 రోజులకు సరిపడా నీటిని నిల్వచేసుకోగా ఇళ్లలో మిగిలే స్థలం ఎంతో ఊహించండి. తీవ్ర పారిశుద్ధ్య సమస్యతో లాతూరు నగరం మునిగిపోకుండా మిగిలి ఉండటమే ఆశ్చర్యం. ఈ విషయం రెండు అంశాలను ప్రతిఫలిస్తోంది. ఒకటి, పట్టణ నిర్వహణా ప్రమాణాలు అధమ స్థాయిలో ఉన్నాయి. భారతదేశం పట్టణీకరణ చెందడం వల్ల పెరు గుతున్న జనాభాకు అనుగుణంగా సేవలు పెరగడం లేదు కాబట్టి ప్రమాణాలు మరింతగా దిగజారుతు న్నాయి. రెండు, పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉంటుం దని ప్రజలు ఆశించడం లేదు. మెరుగుపరచమని అధికా రులపై ఒత్తిడి తేవడం లేదు. అధికారులు, ప్రణాళికా వేత్తల నిర్లక్ష్యం, పౌరుల నిస్సహాయత కలసి దేన్నయినా సహించడంగా మనకు కనబడుతోంది. ఆవశ్యక సేవల న్నిటినీ పూర్తిగా అందించలేకపోతున్నా మనం మన పట్ట ణాలను, నగరాలను నిర్మాణంలో ఉన్నవిగా చూస్తుం డటం విచిత్రం. ఢిల్లీకి బస్తీలున్నాయి, ముంబైకి మురికి వాడలున్నాయి, అంత కంటే చిన్న పట్టణాలకు సైతం వాటికి తగ్గ మురికి ఉంది. ఈ మురికివాడలకు బయట ఉండే అస్తవ్యస్త పరి స్థితులు సుపరిచితమైనవే... మరీ ఘోరమైన రోడ్లు, నాణ్యతాపరంగా, పరిమాణంపరంగా కూడా అధ్వాన నీటి సరఫరా, నామమాత్రపు వీధి దీపాలు, కాలువ లు, నోళ్లు తెరిచి ఉండే మ్యాన్‌హోల్స్. నగరంలో ఏం ఉంటా యని ఆశిస్తారో అవేవీ నగరాల్లో కనబడవు. పట్టణంలో లేదా చిన్న పట్టణంలోనైనా పరిస్థితి ఇదే. గ్రామాలు పట్టణాలుగా, ఆ తదుపరి నగరాలుగా వృద్ధి చెందుతాయి, మునిసిపల్ కౌన్సిల్స్ కార్పొరే షన్లుగా ఉన్నత స్థాయికి చేరుతాయి. అయినా భూగర్భ నీటి పారుదల మార్గాలు మాత్రం ఉండవు. ఉన్నా, తగు రీతిలో ఘన వ్యర్థాల నిర్వహణ ఉండదు. ఈ పట్టణ ప్రాంతాలలోనే ఢిల్లీ బస్తీలు, ముంబై మురికివాడల వంటినిర్లక్ష్యానికి గురైన అథోఃప్రపంచాలూ ఉంటాయి. అయినా మన సింధూ నాగరికత ఎంతగా అభివృద్ధి చెందిన దో చెప్పుకుంటాం. ఆ నగరాల్లో ఎప్పుడూ పారే నీటి సరఫరా, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇంకుడు గుంతలు ఉండేవని మరచిపోతాం. పట్టణవాసులు ఈ అల్పస్థాయి ప్రమాణాలను ఎందుకు అంగీకరిస్తున్నారు, ఏళ్ల తరబడి ఈ సమస్యలు సలుపుతుండటాన్ని, మరింతగా దిగజారిపోతుండ టాన్ని ఎందుకు అనుమతిస్తున్నట్టు? నీరు పునరుత్పాద కమైనదే అయినా ఆ నీటి వనరును కనుగొని, సక్ర మంగా సంరక్షించి, సమర్థవంతమైన ఉపయోగకం కోసం తగు రీతిలో వాడుకోవాల్సి ఉన్నది, నిజమే. అయితే, ఎప్పుడో ఒకసారి ఆ వనరుకు కొరత ఏర్పడు తుంది లేదా వినాశకరమైనంత ఎక్కువగా వచ్చిపడు తుంది. కానీ కాలువలు, పారిశుద్ధ్యం మాత్రం ప్రకృతిపై ఆధారపడినవి కావు. మన పట్టణ ప్రాంతాల లోటుపాట్ల జాబితాలోకి దాదాపుగా ఏ నగరంలోనైనా ఆవశ్యకంగా, తగినంతగా అందుబాటులో ఉండాల్సినవి అన్నీ చేరు తాయి. రవాణా, రోడ్లు, పాదచారుల బాటలు, మార్కెట్లు ఇలా ప్రతిదీ సమస్యాత్మకమే. ఈ మౌలిక సదుపాయాలు కొరవడినా ‘స్మార్ట్ నగరాలు’ అని మాట్లాడటం హాస్యాస్పదం. అయినా ఈ మట్టి కాళ్లతోనే మన తలలను నక్షత్రాల మధ్య నిలపగల మని విశ్వ సిస్తాం. రెండు వారాలకు ఒకసారి నీటి సరఫరా ‘సాధా రణం’ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ( వ్యాసకర్త: మహేశ్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు) ఈ మెయిల్ mvijapurkar@gmail.com -
ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష
హోదా అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించండి ►ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఇది ► విభజన చట్టంలో హామీలు అమలు జరిపించండ ► విభజన చట్టాన్ని తెలంగాణ ధిక్కరిస్తోంది ► రాయలసీమ కష్టాలు చూడండి ► ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయండి ► రాష్ట్రపతికి ఐదుపేజీల విన్నపం ఇచ్చిన జగన్ ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని, ఐదు కోట్ల ఆంధ్రుల భవితతో ముడివడి ఉన్న అతి ముఖ్యమైన అంశమని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సోమవారం రాత్రి పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, బుట్టా రేణుకలతో కలిసి రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఐదు పేజీల వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ఆంధ్రప్రదేశ్ విభజన మెజారిటీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిం దని గతంలో అనేక సందర్భాల్లో మీ దృష్టికి తెచ్చాం. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలను సస్పెండ్ చేసి, లోక్‌సభ ప్రత్యక్ష ప్రసారాలను నిలుపుదల చేసి బిల్లును ఆమోదింపజేసుకున్నారు. → హైదరాబాద్ కేవలం రాజకీయ రాజధానిగా మాత్రమే కాకుండా అనేక పబ్లిక్ రంగ సంస్థలతో ఆర్థికపరంగా శక్తిమంతమైన కేంద్రంగా అభి వృద్ధి చెందింది. 60 ఏళ్లుగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ తెలంగాణలో ఉండిపోవడంతో నూతన ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా అన్యాయం జరిగింది. →రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు జరిగిన ఉద్యమంలో మా పార్టీ ముందు వరసలో ఉంది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, అన్ని రాజకీయ పార్టీ లకు మేం విజ్ఞప్తిచేశాం. హైదరాబాద్ నగరం, నీళ్ల పంపకాలు, రెవెన్యూ పంపిణీ, కొత్త రాజధాని వ్యయం, సామాజిక, పారిశ్రామిక మౌలిక వసతుల ఏర్పాటు వంటి అనేక సంక్లిష్ట సమస్యలకు పరిష్కారం చూపకుండా విభజన తగదని చెప్పాం. అయినా రాష్ట్రాన్ని విభజించారు. →ప్రత్యేక ప్యాకేజీ, ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా అన్న నాటి ప్రధాన మంత్రి హామీ కారణంగా బీజేపీ విభజన బిల్లుకు మద్దతు ఇచ్చింది. ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక హోదాను తాము పదేళ్లకు వర్తింపజేస్తామని హామీ ఇచ్చింది. నూతన పరిశ్రమలు ఏర్పాటు కావాలంటే మూడేళ్లు పడు తుందని, పదేళ్లు వర్తింపజేస్తేనే ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహ కాలు అందుతాయని చెబుతూ తాము అధికారంలో వచ్చాక పదేళ్లు ఇస్తా మంది. → 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ, బీజేపీ ఈ అంశాన్ని పెట్టి ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నాయి. విద్యావంతుల్లో మెజారిటీ ప్రజలు బీజేపీ, టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా వస్తుందని నమ్మారు. రాజ్యసభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీ మేరకు కేంద్రం 2 మార్చి 2014న కేబినెట్ తీర్మానం కూడా చేసింది. ఐదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కేబినెట్ ప్రణాళిక సంఘానికి మార్గదర్శనం చేసింది. →అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం సాకులు చూపుతూ వచ్చింది. యూపీఏ ప్రభుత్వం ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఈ అంశాన్ని పొందుపరచనందున ప్రస్తుతం కష్టంగా మారిందని చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తోందని మరికొందరు చెబు తున్నారు. →గతంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు ఏనాడూ పార్లమెం టులో చట్టం చేయలేదు. అది కేవలం కేబినెట్ ద్వారా తీసుకున్న నిర్ణయమే. ఒకవేళ అలా ఏదైనా చట్టం చేసి ఉంటే ప్రభుత్వం చూపాలి. →14వ ఆర్థిక సంఘం స్పెషల్ కేటగిరీ స్టేటస్‌కు వ్యతిరేకమని చెప్పడం సరికాదు. ఆ సంఘం ఇచ్చిన నివేదిక ప్రత్యేక హోదా అమలుపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు. వాళ్లకు ఆ అధికారం కూడా లేదు. పైగా ఆ సంఘం సభ్యులు కూడా ఈ సంగతి చెప్పారు. ఆ 11 రాష్ట్రాలకు అంతకుముందూ ప్రత్యేక హోదా ఉంది. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అమలవు తున్న కాలంలోనూ ఉంది. → ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక హోదా అమలుచేయాలని ఇటీవల ఈ అంశంపై రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు అన్ని రాజ కీయ పార్టీలు డిమాండ్ చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం సానుకూ లంగా నిర్ణయం తీసుకోవడం లేదు. → బిల్లు ఆమోదానికి షరతుగా పార్లమెంటులో చేసిన హామీలను పాలకులు తమకు సౌకర్యవంతంగా మరిచిపోతే ప్రజలు పార్లమెంటరీ ప్రజాస్వా మ్యంలో నమ్మకం కోల్పోతారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలన్న షరతుతో విభజన బిల్లు ఆమోదం పొందింది. ఈ షరతు నెరవేరకపోతే ఆ బిల్లుకు కూడా విలువ లేదు. → ఇది ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుతో ముడివడి ఉన్న అతిముఖ్యమైన అంశం ఇది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలుచేసేలా ఆదేశాలు ఇవ్వండి. హామీలు అమలయ్యేలా చూడండి... → ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇతర హామీలు కూడా ఉన్నాయి. పోలవరం సత్వర నిర్మాణం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు, కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తెలంగాణలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, విశాఖ-చెన్నై పారిశ్రామి కారిడార్, ఖమ్మంలో స్టీల్ ప్లాంటు, వైఎస్సార్ జిల్లాలో స్టీలు ప్లాంటు ఏర్పాటు, వైజాగ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు, తెలం గాణలో రోడ్డు ప్రాజెక్టుల ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. కానీ ఏవీ అమలు కాలేదు. ప్రభుత్వం అన్ని హామీలు అమలుచేసేలా మీరు జోక్యం చేసుకోండి. → ఏడు వెనకబడిన జిల్లాలకు ఏటా కేవలం రూ.50 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ నిధులతో ఏం అభివృద్ధి జరుగుతుంది? పైగా వెనకబడిన ప్రాంతాలకు ఇచ్చి బీఆర్జీఎఫ్ నిధులను రద్దు చేశారు. పోల వరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా ఎలాంటి ప్రగతి లేదు. 2016-17 బడ్జెట్లో కేవలం రూ. 100 కోట్లు కేటాయించారు. ఈతీరును చూస్తే కేంద్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టుపై ఇతర ఆలోచనలు ఉన్నట్టు అనుమా నించాల్సి వస్తోంది. అందువల్ల పోలవరం ప్రాజెక్టును ఒక కాలపరిమితితో కనీసం వచ్చే మూడేళ్లలోనైనా పూర్తిచేసేలా కేంద్రాన్ని ఆదేశించండి. తెలంగాణ చట్టాన్ని ధిక్కరిస్తోంది.. → ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 84(3) నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ధిక్కరిస్తూ కృష్ణా, గోదావరి నదుల మీద అనేక సాగునీటి ప్రాజెక్టులు కట్టేందుకు చర్యలు చేపడుతోంది. ఇవి దీర్ఘకాలంలో దిగువ రాష్ట్రమైన ఏపీని బలహీన పరిచే చర్యలు. ఇప్పటికే నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ప్రాంతం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిలో అక్కడి రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారు. గోదావరి ద్వారా కూడా నీళ్లు తక్కువగా రావడంతో ఇటీవలికాలంలో తొలిసారిగా ఏపీలో రైతులు రబీ పంట నష్టపోయారు. →ఏళ్లకు ఏళ్లు కరువును ఎదుర్కొనే రాయలసీమ ప్రాంతం అనేక ఏళ్లుగా తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. అనంతపురం జిల్లా దేశంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ తరువాత రెండో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా. ‘దేశంలోని ఫెమైన్(క్షామం) పటంలో రాయలసీమ జిల్లాలు ఒక నల్లని మచ్చగా ఉన్నాయి. తరచుగా వచ్చే ఈ క్షామం(కరువు)తో రైతులు చితికిపోయి పేదరికంలో మగ్గే దుస్థితికి చేరుకున్నారు. ఒక కరువు నుంచి బయటపడేలోపే ఇంకో కరువులో మగ్గే పరిస్థితి దాపురించింది..’ అని ‘ఫెమైన్స్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో బి.ఎన్.గంగూలీ పేర్కొన్నారు. →వరుస కరువు కాటకాలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని 1952లోనే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సందర్శించారు. గంజి కేంద్రాల్లో భూస్వాములు కూడా వరసలో నిల్చోవడం చూసి నెహ్రూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. → ఏడాదిలో ఒక పంటకైనా నీళ్లిస్తే రాయలసీమ ప్రాంత సమస్య కొంతమేర పరిష్కారమవుతుంది. ఏపీ విభజన అనంతరం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల నీటి అవసరాలను గుర్తించేలా, ముఖ్యంగా కరువు ప్రాంతమైన రాయలసీమ అవసరాలను చూసేలా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పరిశీలించేందుకు దాని కాలపరిమితిని పెంచాలి. →విభిన్న రాష్ట్రాలకు జరిపిన కేటాయింపుల ఆధారంగా వార ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు చట్టబద్ధంగా నీటిని విడుదల చేసేలా చర్యలు తీసు కోవాలి. లేదంటే వరద వస్తే తప్ప అన్ని ప్రాంతాలకు నీళ్లు రావు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయండి →1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని తెచ్చుకున్నాం. 2003లో మళ్లీ 91వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూలును సవరించుకున్నాం. ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ద్వారా ఒక పార్టీ నుంచి నెగ్గి మరో పార్టీలో చేరితో ఆ చట్టసభ సభ్యుడు అనర్హతకు గురవుతాడు. → టీడీపీ అనైతికంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వైఎస్సార్సీపీ నుంచి ఆ పార్టీలోకి ఫిరాయింపులను ప్రోత్సహిస్తోంది. పదవులు, డబ్బు ఆశ చూపి 20 మంది ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకుంది. వీటిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ వద్ద ఫిర్యాదులు చేసినా స్పందించలేదు. అనర్హతకు సంబంధించిన పిటిషన్ల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి లేకపోవడంతో అధికార పార్టీకే చెందిన స్పీకర్ ఎలాంటి చర్యలు తీసు కోరు. కోర్టులు స్పీకర్ నిర్ణయంలో జోక్యం చేసుకోవడం లేదు. అందువల్ల ప్రజాస్వామ్య పరిరక్షణకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించాలి. అనర్హత వేటు వేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కట్టబెట్టాలి. ఏపీలో జరిగిన ఫిరాయింపుల వెనక ఉన్న అవినీతిపై విచారణ జరిపించాలి. సాక్షి, న్యూఢిల్లీ