అనర్హులలో ఓ టాపర్..!
విశ్లేషణ
అర్హత లేకున్నప్పటికీ బిహార్‌లో 12వ తరగతి పరీక్షల్లో టాపర్ల జాబితాలో చోటు సాధించిన విద్యార్థులలో ఒకరి అరెస్టు వ్యవహారం తీవ్ర సమస్యగా పరిణమించింది. జ్ఞానుల్లా నటించ డంతో పాటుగా, చదు వుపట్ల మొగ్గుచూపని వీరు ఈ కుంభకోణానికి పాల్పడిన ముఠా సభ్యులేనా? బిహార్ రాష్ట్ర విద్యా మండలి అధిపతి లోకేశ్వర్ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా, ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాసిన కళాశాల ప్రిన్సిపల్ ఈ ఉదంతంలో అరెస్టు కావడాన్ని ఎవరైనా అవగతం చేసుకుంటారు.
ఇంతవరకూ అరెస్టయిన 20 మంది విద్యా ర్థులు కోర్టుద్వారా నాన్ బెయిలబుల్ వారంట్ కూడా అందుకున్నారు. పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులపై రహస్య పరిశోధన నిర్వ హించిన ఒక టీవీ చానెల్.. ఆ విద్యార్థులు సాధా రణ ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేకపోయారని కనుగొన్నది. ఇది బట్టబయలు కావడమే పెద్ద అవ మానకరమైన విషయం కాగా, ఆ విద్యార్థులు వంచనకు బలైనవారిగా తప్ప మరోలాగా కనిపిం చడం లేదు. వారికి లభిస్తున్న ప్రచారం వెలుగులో వారి దోషం బయటపడటం లేదు.
ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు ఒక దళారీని పట్టుకుంటారు. విద్యార్థులు అగ్రస్థానం పొందడానికి మార్కులను అధికంగా వేసేందుకు అంగీకరించే ఒక మూల్యాంకన పర్యవేక్షకులు కూడా ఉండే ఉంటారు. ఆ ఎవరో ఒకరిలో చాలా వరకు తల్లిదండ్రులే ఉండి ఉంటారు లేదా, పరీక్షా పత్రాలను దిద్దిన మందమతులతో పాటు టాప్ ర్యాంకుకు బదులుగా ఫెయిల్ కావలసిన తప్పు దారి పట్టిన విద్యార్థులు కూడా ఉండే ఉంటారు. చూసీచూడనట్లు వదిలేసిన టీచర్లు, ప్రిన్సిపల్స్‌ని కూడా మరికొన్ని స్టింగ్ ఆపరేషన్లు ప్రదర్శించాయి. ఈ కుంభకోణం విస్తృతరూపంలో కనిపిస్తోంది.
బిహార్ రాష్ట్రంలోని తల్లిదండ్రులు తమ పిల్లలు కాపీ కొట్టడానికి వారికి సమాధాన పత్రాలు సరఫరా చేసే విషయం జగమెరిగిన సత్యమే. అక్కడ పరీక్షలను పర్యవేక్షించే ఉపాధ్యాయులు ప్రమాణాలను పాటించరు లేదా ఉపేక్ష ప్రదర్శిస్తుం టారు. ఇదంతా నిజాయితీగా కష్టపడకుండానే రివార్డులకోసం ప్రయత్నించే వ్యవస్థకు సంబంధిం చిన కుతంత్రాన్నే చూపిస్తుంది. విద్యార్థులు కూడా దీంట్లో భాగమే. ఈ దఫా టాపర్ కుంభకోణంలో డబ్బు కూడా తనవంతు పాత్ర పోషించినట్లుంది.
పదోతరగతి పరీక్షల్లో పాసయిన వారి శాతాన్ని 39.5 నుంచి 72.25 శాతానికి పెంచడానికి పంజాబ్ విద్యామండలి దాదాపు లక్షమంది విద్యా ర్థులకు 27 గ్రేస్ మార్కులను అనుగ్రహించింది. ఇంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్తీర్ణతా శాతం 48.22 నుంచి 65.21కి పెరిగింది. పాస్ అయిన విద్యార్థుల నాణ్యతను కాకుండా గణాంకాలను మెరుగుపర్చడానికి ఇదొక దిగ్భ్రాం తిపర్చే మార్గం. అధికారికంగానే విజయాల మరీ చికలను ఇలా సృష్టించారు. ఇలాంటి విద్యార్థులు పేలవమైన విద్యనే పొందుతారు కాబట్టి దీర్ఘ కాలంలో నష్టపోయేది వీరే.
ఈ విషయంలో బిహార్‌ది ఒక నేరపూరిత ఉదంతం కాగా, పంజాబ్‌ది మాత్రం నాణ్యతకు నీళ్లువదలి రాష్ట్ర ఉత్తీర్ణతా గణాంకాలను మెరుగుప రచడానికి సంబంధించింది. తదుపరి విద్యాస్థా యితో అంటే ఈ సందర్భంలో జూనియర్ కాలే జీలో పోటీపడటం చాలా కష్టమయ్యేలా, విద్యార్థు లకు పూర్తి హాని కలిగిస్తున్న ఈ వ్యవహారం గురించి ఎవ్వరూ ఏమీ ఆలోచించడం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే పిల్లలతో పాటు మోసపో తున్నదెవరు? సందేశం చాలా స్పష్టంగానే ఉంది. ‘భయపడవద్దు బేటా, నీ లోపాలకు మేము అడ్డు కట్ట వేయడమే కాకుండా కృత్రిమంగా నీకు మెరు గులు దిద్దుతాం కూడా’.
తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాక, నోట్‌బుక్‌ల నుంచి యూనిఫాంల వరకు ప్రతిదీ సంబంధిత స్కూల్ నుంచే తప్పక కొనాలని తల్లిదండ్రులకు యాజమాన్యాలు చెబుతున్నట్లు చిత్రించిన ఒక కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఇక్కడ కూడా డబ్బుపరమైన ప్రయోజనం దాగి ఉంది. మరి ‘చదువు మాటేమిటి’ అని తల్లిదండ్రులు అడిగినప్పుడు, ‘స్కూల్ బయట ట్యుటోరియ ల్స్‌లో చేర్పించండి’ అనే సమాధానం వస్తోంది. అలాంటి ట్యూషన్లను భారీ ఫీజులతో అంది స్తున్నవారు నగర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. వీరు పాఠశాలలు తమ ప్రధాన బాధ్యతలనుంచి తప్పుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి.
ఈ తరహా ట్యుటోరియల్స్ ఏదైనా సబ్జెక్టులో బలహీనంగా ఉండి సహాయం అవసరమైన విద్యా ర్థికి తోడ్పడకపోగా, రెగ్యులర్ వర్క్‌షాపు లను నిర్వహిస్తుంటాయి. ఇక్కడ ఇతరులతో పోటీ పడేం దుకు గంటలకొద్దీ సమయాన్ని విద్యార్థులు వెచ్చిం చాల్సి ఉంటుంది. సాధారణంగా మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ కోర్సులకోసం లేదా ఐఐటీల్లో ప్రవేశా నికి కష్టపడుతున్న విద్యార్థులు వీటిలో చేరుతుం టారు. ఒక సబ్జెక్టులో వెనుకబడి ఉండే విద్యార్థు లను ఇవి విస్మరిస్తుంటాయి. ఇలాంటి వారు ఫలి తాలను సాధించలేక వెనకబడిపోతారు.
ట్యుటోరియల్స్ అనే దినదిన ప్రవర్థమాన మవుతున్న పరిశ్రమ కోసం తల్లిదండ్రుల అర్ధాంగీ కారం ఒక వ్యక్తీకరణగా ఉంటోంది. ఉదాహర ణకు రాజస్థాన్‌లోని కోట గుర్తుకొస్తుందా? ఇక పాఠశా లలు గేటు ముందు బోర్డుతో కూడిన ఆవరణగా మాత్రమే ఉంటాయి. ఆ లోపల ఏం జరుగు తుందో, ఏం జరగదో మీరు పట్టించుకోరు. వీరం దరూ వ్యవస్థ బాధితులే. కానీ మనం మాత్రం నాణ్యతను ప్రోత్సహించడానికి అవి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు నటిస్తుంటాము.
వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్
సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com