bihar toppers
-
టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్
బిహార్ బోర్డ్ టాపర్ల కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగమంతం చేసింది. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటివరకూ కొందరిని అదుపులోకి తీసుకుని విచారించిన సిట్.. తాజాగా టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో అరెస్ట్ చేశారు. గతేడాది బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కనీస అవగాహన కూడా లేని టాపర్ రుబీ రాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల బండారం బట్టబయలైంది. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని చెప్పగా.. బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం కేవలం రెండు పదాలు రాసింది. 'తులసీ దాస్ జీ ప్రణామ్' అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించిడం గమనార్హం. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పారు. బిహార్ స్కూలు పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. -
అనర్హులలో ఓ టాపర్..!
విశ్లేషణ అర్హత లేకున్నప్పటికీ బిహార్‌లో 12వ తరగతి పరీక్షల్లో టాపర్ల జాబితాలో చోటు సాధించిన విద్యార్థులలో ఒకరి అరెస్టు వ్యవహారం తీవ్ర సమస్యగా పరిణమించింది. జ్ఞానుల్లా నటించ డంతో పాటుగా, చదు వుపట్ల మొగ్గుచూపని వీరు ఈ కుంభకోణానికి పాల్పడిన ముఠా సభ్యులేనా? బిహార్ రాష్ట్ర విద్యా మండలి అధిపతి లోకేశ్వర్ ప్రసాద్, ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హా, ఇద్దరు విద్యార్థులు పరీక్షలు రాసిన కళాశాల ప్రిన్సిపల్ ఈ ఉదంతంలో అరెస్టు కావడాన్ని ఎవరైనా అవగతం చేసుకుంటారు. ఇంతవరకూ అరెస్టయిన 20 మంది విద్యా ర్థులు కోర్టుద్వారా నాన్ బెయిలబుల్ వారంట్ కూడా అందుకున్నారు. పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించిన విద్యార్థులపై రహస్య పరిశోధన నిర్వ హించిన ఒక టీవీ చానెల్.. ఆ విద్యార్థులు సాధా రణ ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేకపోయారని కనుగొన్నది. ఇది బట్టబయలు కావడమే పెద్ద అవ మానకరమైన విషయం కాగా, ఆ విద్యార్థులు వంచనకు బలైనవారిగా తప్ప మరోలాగా కనిపిం చడం లేదు. వారికి లభిస్తున్న ప్రచారం వెలుగులో వారి దోషం బయటపడటం లేదు. ప్రతి సందర్భంలోనూ ఎవరో ఒకరు ఒక దళారీని పట్టుకుంటారు. విద్యార్థులు అగ్రస్థానం పొందడానికి మార్కులను అధికంగా వేసేందుకు అంగీకరించే ఒక మూల్యాంకన పర్యవేక్షకులు కూడా ఉండే ఉంటారు. ఆ ఎవరో ఒకరిలో చాలా వరకు తల్లిదండ్రులే ఉండి ఉంటారు లేదా, పరీక్షా పత్రాలను దిద్దిన మందమతులతో పాటు టాప్ ర్యాంకుకు బదులుగా ఫెయిల్ కావలసిన తప్పు దారి పట్టిన విద్యార్థులు కూడా ఉండే ఉంటారు. చూసీచూడనట్లు వదిలేసిన టీచర్లు, ప్రిన్సిపల్స్‌ని కూడా మరికొన్ని స్టింగ్ ఆపరేషన్లు ప్రదర్శించాయి. ఈ కుంభకోణం విస్తృతరూపంలో కనిపిస్తోంది. బిహార్ రాష్ట్రంలోని తల్లిదండ్రులు తమ పిల్లలు కాపీ కొట్టడానికి వారికి సమాధాన పత్రాలు సరఫరా చేసే విషయం జగమెరిగిన సత్యమే. అక్కడ పరీక్షలను పర్యవేక్షించే ఉపాధ్యాయులు ప్రమాణాలను పాటించరు లేదా ఉపేక్ష ప్రదర్శిస్తుం టారు. ఇదంతా నిజాయితీగా కష్టపడకుండానే రివార్డులకోసం ప్రయత్నించే వ్యవస్థకు సంబంధిం చిన కుతంత్రాన్నే చూపిస్తుంది. విద్యార్థులు కూడా దీంట్లో భాగమే. ఈ దఫా టాపర్ కుంభకోణంలో డబ్బు కూడా తనవంతు పాత్ర పోషించినట్లుంది. పదోతరగతి పరీక్షల్లో పాసయిన వారి శాతాన్ని 39.5 నుంచి 72.25 శాతానికి పెంచడానికి పంజాబ్ విద్యామండలి దాదాపు లక్షమంది విద్యా ర్థులకు 27 గ్రేస్ మార్కులను అనుగ్రహించింది. ఇంతకుముందు సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్తీర్ణతా శాతం 48.22 నుంచి 65.21కి పెరిగింది. పాస్ అయిన విద్యార్థుల నాణ్యతను కాకుండా గణాంకాలను మెరుగుపర్చడానికి ఇదొక దిగ్భ్రాం తిపర్చే మార్గం. అధికారికంగానే విజయాల మరీ చికలను ఇలా సృష్టించారు. ఇలాంటి విద్యార్థులు పేలవమైన విద్యనే పొందుతారు కాబట్టి దీర్ఘ కాలంలో నష్టపోయేది వీరే. ఈ విషయంలో బిహార్‌ది ఒక నేరపూరిత ఉదంతం కాగా, పంజాబ్‌ది మాత్రం నాణ్యతకు నీళ్లువదలి రాష్ట్ర ఉత్తీర్ణతా గణాంకాలను మెరుగుప రచడానికి సంబంధించింది. తదుపరి విద్యాస్థా యితో అంటే ఈ సందర్భంలో జూనియర్ కాలే జీలో పోటీపడటం చాలా కష్టమయ్యేలా, విద్యార్థు లకు పూర్తి హాని కలిగిస్తున్న ఈ వ్యవహారం గురించి ఎవ్వరూ ఏమీ ఆలోచించడం లేదు. క్లుప్తంగా చెప్పాలంటే పిల్లలతో పాటు మోసపో తున్నదెవరు? సందేశం చాలా స్పష్టంగానే ఉంది. ‘భయపడవద్దు బేటా, నీ లోపాలకు మేము అడ్డు కట్ట వేయడమే కాకుండా కృత్రిమంగా నీకు మెరు గులు దిద్దుతాం కూడా’. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాక, నోట్‌బుక్‌ల నుంచి యూనిఫాంల వరకు ప్రతిదీ సంబంధిత స్కూల్ నుంచే తప్పక కొనాలని తల్లిదండ్రులకు యాజమాన్యాలు చెబుతున్నట్లు చిత్రించిన ఒక కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడి యాలో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఇక్కడ కూడా డబ్బుపరమైన ప్రయోజనం దాగి ఉంది. మరి ‘చదువు మాటేమిటి’ అని తల్లిదండ్రులు అడిగినప్పుడు, ‘స్కూల్ బయట ట్యుటోరియ ల్స్‌లో చేర్పించండి’ అనే సమాధానం వస్తోంది. అలాంటి ట్యూషన్లను భారీ ఫీజులతో అంది స్తున్నవారు నగర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. వీరు పాఠశాలలు తమ ప్రధాన బాధ్యతలనుంచి తప్పుకోవడానికి ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈ తరహా ట్యుటోరియల్స్ ఏదైనా సబ్జెక్టులో బలహీనంగా ఉండి సహాయం అవసరమైన విద్యా ర్థికి తోడ్పడకపోగా, రెగ్యులర్ వర్క్‌షాపు లను నిర్వహిస్తుంటాయి. ఇక్కడ ఇతరులతో పోటీ పడేం దుకు గంటలకొద్దీ సమయాన్ని విద్యార్థులు వెచ్చిం చాల్సి ఉంటుంది. సాధారణంగా మెడిసిన్ లేదా ఇంజినీరింగ్ కోర్సులకోసం లేదా ఐఐటీల్లో ప్రవేశా నికి కష్టపడుతున్న విద్యార్థులు వీటిలో చేరుతుం టారు. ఒక సబ్జెక్టులో వెనుకబడి ఉండే విద్యార్థు లను ఇవి విస్మరిస్తుంటాయి. ఇలాంటి వారు ఫలి తాలను సాధించలేక వెనకబడిపోతారు. ట్యుటోరియల్స్ అనే దినదిన ప్రవర్థమాన మవుతున్న పరిశ్రమ కోసం తల్లిదండ్రుల అర్ధాంగీ కారం ఒక వ్యక్తీకరణగా ఉంటోంది. ఉదాహర ణకు రాజస్థాన్‌లోని కోట గుర్తుకొస్తుందా? ఇక పాఠశా లలు గేటు ముందు బోర్డుతో కూడిన ఆవరణగా మాత్రమే ఉంటాయి. ఆ లోపల ఏం జరుగు తుందో, ఏం జరగదో మీరు పట్టించుకోరు. వీరం దరూ వ్యవస్థ బాధితులే. కానీ మనం మాత్రం నాణ్యతను ప్రోత్సహించడానికి అవి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు నటిస్తుంటాము. వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్ సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
టాప్ ర్యాంక్ రేటు.. 20 లక్షలు!
బిహార్ టాప్ ర్యాంకర్లకు చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పొట్టకోస్తే అక్షరం ముక్క రాకుండానే టాప్ ర్యాంకు సాధించడానికి వాళ్లు ఒక్కొక్కళ్లు ఎంత ముట్టజెప్పారో తెలుసా.. అక్షరాలా రూ. 20 లక్షలు. ఈ విషయాన్ని స్వయంగా బిహార్ స్కూలు పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ అంగీకరించారు. అలాగే, అసలు ఏమాత్రం సదుపాయాలు లేని జూనియర్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వడానికి కూడా 4 లక్షల చొప్పున లంచం తీసుకున్నానని చెప్పారు. సింగ్‌తో పాటు ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే ఉషా సిన్హాను మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారణలో ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. తన హయాంలో ఆయనగారు దాదాపు 100 కాలేజీలకు గుర్తింపు ఇచ్చారు. ఈ దంపతులిద్దరినీ సోమవారం నాడు వారణాసిలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాకెట్ మొత్తానికి ఓ కాలేజి ప్రిన్సిపల్ బచ్చారాయ్ రింగ్ లీడర్ అని తెలిసింది. బీఎస్ఈబీ నిర్వహించే సీనియర్ ఇంటర్ పరీక్షలలో టాప్ ర్యాంకులు రావడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఈ దందా మొదలుపెట్టింది అతడేనని అంటున్నారు. బిహార్ హయ్యర్ సెకండరీ విద్య డైరెక్టర్ రాజీవ్ కుమార్ ప్రసాద్ రంజన్ పేరును కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. -
ఆ నలుగురు టాపర్స్పై ఎఫ్ఐఆర్
పట్నా: బీఎస్ఈబీలో టాపర్స్‌గా నిలిచిన రూబీ రాయ్, సౌరభ్ శ్రేష్ఠ, రాహుల్ కుమార్, శాలినీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైశాలిలోని విషుణ్ రే కళాశాల డైరెక్టర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండా 14మంది టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారంటూ రూబీ రాయ్ అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్చల్ సృష్టించింది. పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని ఆమెకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. మరోవైపు సైన్స్ టాపర్ సౌరవ్ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్లు అంటే ఏంటో తెలియదన్నాడు. దీంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో టాపర్ రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. అలాగే తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. అందులో అతడు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు. -
మళ్లీ ప్రశ్నలడిగితే సూసైడ్ చేసుకుంటా: టాపర్
తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. ప్యానెల్ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిన అతడు తనను ఏమైనా ప్రశ్నించినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ప్యానెల్‌ను హెచ్చరించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతడి హెచ్చరికతో రీ-ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్యానెల్ కాసేపు నిలిపివేసి.. ఆ తర్వాత అతడిని కొన్ని ప్రశ్నలు అడిగిందని, వాటికి సమాధానాలు చెప్పడంలో తడబడటంతో ప్యానెల్ సౌరభ్‌ను బయటకు పంపించిందని ఆ వర్గాలు తెలిపాయి. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందంటూ' ఇంటర్ టాపర్ రుబీ రాయ్ పేర్కొనడంతో.. బిహార్‌లో ఇంటర్ టాపర్ల బాగోతం వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బిహార్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. -
పరీక్షకు డుమ్మాకొట్టిన టాపర్
బిహార్ టాపర్ల సత్తా ఏపాటిదో తేలిపోయింది. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారని చెప్పిన రుబీ రాయ్.. బిహార్ బోర్డు పెట్టిన రెండో పరీక్షకు డుమ్మా కొట్టింది. తనకు ఆరోగ్యం బాగోనందున మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లు బోర్డువర్గాలు తెలిపాయి. అయితే అందుకు బోర్డు అంగీకరించలేదు. అది కేవలం వంక మాత్రమేనని, ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ చెప్పారు. బిహార్ 12వ తరగతి పరీక్షలలో టాపర్లుగా వచ్చినవాళ్లను అక్కడి స్థానిక టీవీ చానల్ ఒకటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లు చిత్రమైన సమాధానాలు చెప్పారు. సైన్స్ టాపర్ అయిన సౌరభ్ కుమార్ అయితే.. నీళ్లకు, హెచ్2ఓకు సంబంధం ఏంటో చెప్పలేకపోయాడు. ఇలా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి బుక్కయిన టాపర్లందరికీ మళ్లీ చిన్నపాటి పరీక్ష, ఇంటర్వ్యూ పెడతామని బోర్డు చెప్పింది. ఆ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుంచి ఐదారు ప్రశ్నలుంటాయి. వాటికి వాళ్లు రాసిన సమాధానాలను, జవాబు పత్రాల్లోని వాళ్ల చేతిరాతను కూడా పోల్చి చూస్తారు. ఇలా రెండోసారి నిర్వహించిన పరీక్షకు రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. మిగిలినవాళ్లు పరీక్ష రాశారు. వాటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. అప్పుడు నిజంగా వాళ్లలో సరుకెంతో తేలిపోతుంది. వీళ్ల బదులు వేరేవాళ్లు పరీక్షలు రాసి ఉండొచ్చని, లేదా వాళ్లు రాసిన ఆన్సర్ షీట్లను ఎవరో మార్చి ఉండొచ్చని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ల ఫలితాలు తేడాగా వస్తే తొలుత పరీక్షలు రాసినప్పుడు ఉన్న ఇన్విజిలేటర్లు, పేపర్లు దిద్దినవాళ్లు.. అందరిపై చర్యలు తప్పవు. -
ఆ టాపర్లకు మళ్లీ పరీక్షలు
తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండానే టాపర్లుగా నిలిచిన 14 మందికి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బిహార్ పాఠశాల పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) నిర్ణయించింది. నిజంగా వాళ్లంతా ఇంటర్ టాపర్లు అయ్యే అర్హత కలిగి ఉన్నారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తామంటున్నారు. పొలిటికల్ సైన్స్ అంటే పనికిరాని సైన్స్ అని రూబీ రే అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్చల్ సృష్టించింది. దాంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నారు. పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని రూబీకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. ఇక సైన్స్ టాపర్ సౌరవ్ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్లు అంటే ఏంటో తెలియదన్నాడు. ఈ వ్యవహారంతో కంగుతిన్న బీఎస్ఈబీ అధికారులు వీళ్లందరికీ మళ్లీ పరీక్షలు పెట్టాలని నిర్ణయించారు. వారికి చిన్న రాతపరీక్షతో పాటు ఒక ఇంటర్వ్యూ కూడా పెడతామని బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ తెలిపారు. అందులో టాపర్లు ఫెయిలైతే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. అంతేకాదు.. పరీక్షల్లో వాళ్ల పేపర్లు దిద్దిన అధ్యాపకులు, ఇన్విజిలేటర్లపై కూడా చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి చెప్పారు. రూబీ, సౌరవ్ ఇద్దరూ వైశాలిలోని విషుణ్ రే కాలేజిలో చదివారు.