టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్ | SIT arrests Ruby Rai father Avdesh Rai in bihar topper scam | Sakshi
Sakshi News home page

టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్

Published Sat, Feb 11 2017 6:27 PM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్ - Sakshi

టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్

బిహార్ బోర్డ్ టాపర్ల కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగమంతం చేసింది. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటివరకూ కొందరిని అదుపులోకి తీసుకుని విచారించిన సిట్.. తాజాగా టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో అరెస్ట్ చేశారు. గతేడాది బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కనీస అవగాహన కూడా లేని టాపర్ రుబీ రాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల బండారం బట్టబయలైంది.

టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని చెప్పగా.. బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం కేవలం రెండు పదాలు రాసింది. 'తులసీ దాస్‌ జీ ప్రణామ్' అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించిడం గమనార్హం. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పారు. బిహార్ స్కూలు పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement