Ruby Rai
-
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
-
బిహార్‌లో మరో టాపర్స్ స్కామ్!
పాట్నా: గతేడాది తరహాలోనే మరోసారి బిహార్ రాష్ట్రంలో టాపర్ల కుంభకోణం వెలుగుచూసింది. ప్లస్ టు ఫలితాలు విడుదలైన రోజు నుంచి టాపర్‌గా నిలిచిన గణేష్ కుమార్ కనిపించకుండా పోయాడు. ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 24 ఏళ్ల వయసులో గణేష్ కుమార్ ఈ పరీక్షలకు హాజరైన విషయం తెలిసిందే. మరోవైపు గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టాపర్స్ స్కామ్ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. తన కూతురు టాపర్‌గా నిలవాలని ఆశపడి అడ్డదారి తొక్కినందుకు గతేడాది బిహార్ ప్లస్ టూ టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో గతంలోనే అరెస్ట్ చేసి విచారించారు. బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని, వంటలు ఎలా చేయాలో నేర్చుకోవచ్చునని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పినట్లు బీఎస్ఈబీ చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ స్వయంగా అంగీకరించారు. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాలని చెప్పగా.. టాపర్ రుబీ రాయ్ మాత్రం 'తులసీదాస్ జీ ప్రణామ్' అంటూ కేవలం రెండు పదాలతో వ్యాసం ముగించిడం గమనార్హం. తాజాగా బిహార్ ప్లస్ టు టాపర్ గణేష్ అదృశ్యంతో గతేడాది తరహాలోనే మరో టాపర్స్ స్కామ్ వెలుగుచూసింది. -
టాపర్ స్కామ్: రుబీ రాయ్ తండ్రి అరెస్ట్
బిహార్ బోర్డ్ టాపర్ల కుంభకోణం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగమంతం చేసింది. గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటివరకూ కొందరిని అదుపులోకి తీసుకుని విచారించిన సిట్.. తాజాగా టాపర్ రుబీ రాయ్ తండ్రి అవదేశ్ రాయ్ ని భగవాన్ పూర్ లో అరెస్ట్ చేశారు. గతేడాది బిహార్ బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడంతో టాపర్స్ స్కామ్ వెలుగుచూసిన విషయం తెలిసిందే. కనీస అవగాహన కూడా లేని టాపర్ రుబీ రాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల బండారం బట్టబయలైంది. టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించగా కొందరు విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా మరికొందరు ఎగ్జామ్ అంటేనే భయపడిపోయి ఇంటివద్దే ఉండిపోయారు. భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని చెప్పగా.. బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం కేవలం రెండు పదాలు రాసింది. 'తులసీ దాస్ జీ ప్రణామ్' అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించిడం గమనార్హం. ఒక్క అక్షరం ముక్క రాకున్నా తమ పిల్లలు స్టేట్ టాపర్లుగా నిలిచేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు రూ.20 లక్షలు ముట్టజెప్పారు. బిహార్ స్కూలు పరీక్షల బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ సింగ్ ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించారు. -
టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు
పట్నా: బిహార్ బోర్డు ఎగ్జామ్‌లో ఆర్ట్స్ విభాగంలో టాపర్‌గా నిలిచి వివాదంలో చిక్కిన రూబీ రాయ్ పరీక్ష పేపర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పరీక్ష పేపర్ నిండా సినిమా పేర్లు కనిపించాయి. పలు కవితలు రాసి ఉన్నాయి. వందకు పైగా ప్రముఖ కవి తులసీ దాస్ పేర్లు దర్శనమిచ్చాయి. అయితే, ఈ ఆన్సర్ షీట్లను పేపర్ వాల్యుయేషన్ చేసే నిపుణులు మార్చారని పోలీసులు చెప్పారు. వేరే చేతి వ్రాతతో రాసిన పేపర్లను రూబీ ఓఎంఆర్ షీటుకు కట్టారని స్పష్టమైనట్లు తెలిపారు. ఈ ఏడాది వెల్లడైన బిహార్ ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో 17 ఏళ్ల రూబీ రాయ్ ఆర్ట్స్ విభాగంలో టాపర్ గా వచ్చింది. ఆమెను అనూహ్యంగా ఓ మీడియా ఇంటర్వ్యూ చేయడంతో అసలు ఆమెకు సంబంధిత సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన లేదని వెల్లడించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు మొత్తం కూపీలాగగా అసలు విషయం బయటకొచ్చింది. అసలు తనకు టాపర్ గా రావాలన్న ఉద్దేశం లేదని, కేవలం పాసయితే చాలు అనుకున్నానని రూబీ చెప్పింది. అనంతరం ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద కుంభకోణం అని పోలీసులు గుర్తించి మొత్తం 40 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. -
'బలి చేశారు.. నేనేంటో నిరూపించుకుంటా'
పాట్నా: తానేంటో నిరూపించుకుంటానని మాస్ కాపీయింగ్‌కు పాల్పడి స్టేట్ టాపర్ గా వచ్చి అనంతరం అరెస్టయినబిహార్ స్కూల్ బోర్డు ఆర్ట్స్ టాపర్ రూబీ రాయ్ చెప్పింది. తాను న్యాయవాదిని అవుతానని, లేదంటే ఒక అధికారిగా మారతానని చెప్పింది. బిహార్ స్కూల్ బోర్డు పరీక్షల్లో ఆర్ట్స్ విభాగంలో పరీక్షలు రాసిన రూబీ టాపర్ గా వచ్చింది. అయితే, ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో పొలిటికల్ సైన్స్ వంటల గురించి చెబుతుందని చెప్పి అవాక్కయ్యేలా చేసింది. అనంతరం చేసిన విచారణలో రూబీతో సహా కొందరు విద్యార్థులు భారీ ఎత్తున మాస్ కాపీయింగ్ పాల్పడ్డారని తెలిసింది. దీంతో ఆ విద్యార్థినిని మరికొందరిని అరెస్టు చేసిన అధికారులు ఏడు వారాలపాటు జైలులో ఉంచారు. రిమాండ్ పూర్తి చేసుకొని ఇంటికొచ్చిన సందర్భంగా రూబీ మీడియాతో మాట్లాడుతూ 'నా జీవితంలో జరిగిన ఈ సంఘటన నా ఆలోచన విధానాన్ని మార్చింది. నేను ఇక చదువులపై శ్రద్ధపెడతాను. న్యాయవాదిగానో అధికారిగానో మారతాను. ఇప్పటి వరకు ఏం జరిగిందో అదంతా ముగిసిన గతం. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నన్ను నేను నిరూపించుకునేందుకు బాగా కష్టపడాలనుకుంటున్నాను. నీ జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందో అది మర్చిపోతాను. నేను అమాయకురాలిని. ఎవరో చేసిన కుట్రకు నేను బలయ్యాను. నన్ను ఎందుకు డిటెండ్ చేశారో.. రిమాండ్ కు ఎందుకు పంపించారో నాకు తెలియదు. స్కాంకు పాల్పడినవారికి నాకు ఏం సంబంధం లేదు' అని ఆ విద్యార్థిని చెప్పింది. -
ఎట్టకేలకు ఫేక్ టాపర్ ఇంటికి..
పాట్నా: మోసపూరితంగా వ్యవహరించి బిహార్ లో టాపర్ స్థానం దక్కించుకున్న రూబీ రాయ్ కు దాదాపు ఐదు వారాల తర్వాత ఉపశమనం లభించింది. గత నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న ఆమె తిరిగి ఇంటి ముఖం చూసింది. బిహార్ లో ఆర్ట్స్ విభాగంలో రూబీ టాపర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈమె అనంతరం ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోవడంతోపాటు పొలిటికల్ సైన్స్ వంటల గురించి నేర్పిస్తుందని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తర్వాత జరిపిన పరిశీలనలో ఆమె మాస్ కాపీయింగ్ పాల్పడినట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు అనుమతించలేదు. దీంతో ఆమెను జువెనైల్ హౌస్ కు తరలించారు. ఆమెతో సహా మొత్తం 30మంది జైలులో ఉన్నారు. రూబీ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. తన పరీక్షలు ఎలా పాసవ్వాలా అనే ఆశతోనే రాశాను తప్ప తనకు టాపర్ కావాలన్న కోరిక ఉద్దేశం లేదని చెప్పింది. ఎట్టకేలకు 35 రోజుల తర్వాత రూబీకి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. -
ఎట్టకేలకు ఫేక్ టాపర్ ఇంటికి..
పాట్నా: మోసపూరితంగా వ్యవహరించి బిహార్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో టాపర్ స్థానం దక్కించుకున్న రూబీ రాయ్ కు దాదాపు ఐదు వారాల తర్వాత ఉపశమనం లభించింది. గత నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న ఆమె తిరిగి ఇంటి ముఖం చూసింది. బిహార్ లో ఆర్ట్స్ విభాగంలో రూబీ టాపర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈమె అనంతరం ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోవడంతోపాటు పొలిటికల్ సైన్స్ వంటల గురించి నేర్పిస్తుందని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తర్వాత జరిపిన పరిశీలనలో ఆమె మాస్ కాపీయింగ్ పాల్పడినట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు అనుమతించలేదు. దీంతో ఆమెను జువెనైల్ హౌస్ కు తరలించారు. ఆమెతో సహా మొత్తం 30మంది జైలులో ఉన్నారు. రూబీ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. తన పరీక్షలు ఎలా పాసవ్వాలా అనే ఆశతోనే రాశాను తప్ప తనకు టాపర్ కావాలన్న కోరిక ఉద్దేశం లేదని చెప్పింది. ఎట్టకేలకు 35 రోజుల తర్వాత రూబీకి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది. -
టాపర్ రుబీరాయ్ అరెస్టు సబబేనా?
బిహార్ బోర్డ్ టాపర్ల కుంభకోణంలో విద్యార్థులను అరెస్టు చేయడం కొత్త వివాదాన్ని రేపుతోంది. తమ బిడ్డలకు మంచి ర్యాంకులు రావాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు, డబ్బుకు ఆశపడి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వ అధికారులు ఈ ర్యాంకుల స్కాంకు ప్రధాన కారకులు కాగా, అమాయకులైన విద్యార్థుల అరెస్టు ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై స్పందించిన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ రుబీరాయ్‌ను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో ఇంత పెద్ద కుంభకోణం జరగడానికి నితీశ్‌కుమార్ సర్కారే కారణమని ఆయన నిందించారు. బిహార్ కు చెందిన ఆయన కేంద్ర మానవ వనరులశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు ప్రధాన కారకులైన టాపర్ల కుంభకోణంలో అమాయకులైన విద్యార్థులను బలిచేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ఈ స్కాంలో విద్యార్థులను అరెస్టు చేయడం కాకుండా.. ఇందులోని పెద్ద తలకాయలు, రాజకీయ ప్రముఖుల పేర్లను నితీశ్ ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 12వ తరగతి టాపర్ కుంభకోణంపై విచారణలో భాగంగా రుబీరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
వ్యాసం రాయమంటే.. తను ఏం రాసిందో తెలుసా?
పట్నా: ఎవరైనా వ్యాసం రాయమంటే.. ఏం చేస్తారు. ఇచ్చిన అంశంపై తమకు తెలిసిన పదో పదిహెనో పంక్తులు రాస్తారు. కానీ భక్త కవి తులసి దాస్‌పై వ్యాసం రాయమని కోరినప్పుడు బిహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీ రాయ్ మాత్రం రెండంటే రెండు పదాలు రాసింది. ‘తులసీ దాస్ జీ ప్రణామ్’ అంటు రెండు పదాలు రాసి వ్యాసం ముగించింది. బిహార్‌ను కుదిపేస్తున్న 12వ తరగతి టాపర్ కుంభకోణంపై విచారణలో భాగంగా రుబీరాయ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అరెస్టు చేయడానికి ముందు ఆమె మరోసారి నిపుణుల ఎదుట పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షలో భాగంగా నిపుణులు ఆమెను భక్త కవి తులసీదాస్‌పై వ్యాసం రాయాల్సిందిగా కోరారు. అయితే, రుబీరాయ్ మాత్రం తాను రెండేళ్లు ఎంతో కష్టపడి చదివానని, కానీ, తనకిప్పుడు ఏమీ గుర్తులేదని నిపుణులకు తెలిపింది. హ్యుమానిటిస్ గ్రూప్‌లో ఆమెకు వచ్చిన మార్కులు అక్రమార్గంలో వచ్చినవేనని నిపుణుల బృందం నిర్ధారించిందని, దీంతో ఆమె ఫలితాలను రద్దు చేశామని బిహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) చైర్మన్ ఆనంద్ కిషోర్ తెలిపారు. బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది. దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్టు రుజువుకావడంతో పలువురి ర్యాంకులను రద్దుచేసింది. ఈ టాపర్స్ కుంభకోణంపై సిట్ దర్యాప్తు నిర్వహిస్తోంది. -
బిహార్ టాపర్ రుబిరాయ్ అరెస్టు
పట్నా: బిహార్‌ను కుదిపేసిన ఇంటర్ బోర్డు టాపర్ల స్కాం కీలక పరిణామం చోటుచేసుకుంది. 12వ తరగతి (ఇంటర్) బోర్డు ఫలితాల్లో నంబర్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టుచేశారు. బోర్డ్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న రుబీ రాయ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్) అంటే వంటలకు సంబంధించినదని పేర్కొనడం సంచలనం సృష్టించింది. కనీస అవగాహన కూడా లేని ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూతో ర్యాంకర్ల అసలు బండారం బట్టబయలైంది. దీంతో వివిధ కోర్సుల్లో టాప్ ర్యాంకులు తెచ్చుకున్న మొత్తం 14 మంది విద్యార్థులకు బీఎస్ఈబీ బోర్డు నిపుణులతో మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలకు డుమ్మా కొట్టడంతో రుబీ రాయ్ తాజాగా మరోసారి పరీక్షలకు హాజరైంది. మౌఖిక పరీక్షలు పూర్తయిన తర్వాత టాస్క్ ఫోర్స్ ఆమెను అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పరీక్షలంటేనే మాస్ కాపీయింగ్ కు మారుపేరు. ఈ నేపథ్యంలో టాపర్లతో ఓ టీవీ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో వారి బండారం బయటపడింది. మారుపేర్లతో పరీక్షలు రాయించడమో లేక ఎగ్జామినర్లతో కుమ్మక్కవ్వడం వల్లనో వీరు టాప్ ర్యాంకులు సాధించినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాపర్ కుంభకోణంపై బిహార్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. -
మళ్లీ ప్రశ్నలడిగితే సూసైడ్ చేసుకుంటా: టాపర్
తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. ప్యానెల్ ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిన అతడు తనను ఏమైనా ప్రశ్నించినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని ప్యానెల్‌ను హెచ్చరించాడని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అతడి హెచ్చరికతో రీ-ఎగ్జామినేషన్ ప్రక్రియను ప్యానెల్ కాసేపు నిలిపివేసి.. ఆ తర్వాత అతడిని కొన్ని ప్రశ్నలు అడిగిందని, వాటికి సమాధానాలు చెప్పడంలో తడబడటంతో ప్యానెల్ సౌరభ్‌ను బయటకు పంపించిందని ఆ వర్గాలు తెలిపాయి. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందంటూ' ఇంటర్ టాపర్ రుబీ రాయ్ పేర్కొనడంతో.. బిహార్‌లో ఇంటర్ టాపర్ల బాగోతం వెల్లడైన సంగతి తెలిసిందే. దీంతో టాప్ ర్యాంకులు వచ్చిన విద్యార్థులందరికీ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని బిహార్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. -
పరీక్షకు డుమ్మాకొట్టిన టాపర్
బిహార్ టాపర్ల సత్తా ఏపాటిదో తేలిపోయింది. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారని చెప్పిన రుబీ రాయ్.. బిహార్ బోర్డు పెట్టిన రెండో పరీక్షకు డుమ్మా కొట్టింది. తనకు ఆరోగ్యం బాగోనందున మరింత సమయం ఇవ్వాలని ఆమె కోరినట్లు బోర్డువర్గాలు తెలిపాయి. అయితే అందుకు బోర్డు అంగీకరించలేదు. అది కేవలం వంక మాత్రమేనని, ఆమెపై తగిన చర్యలు తీసుకుంటామని బిహార్ పరీక్షల బోర్డు చైర్మన్ లల్కేశ్వర్ ప్రసాద్ చెప్పారు. బిహార్ 12వ తరగతి పరీక్షలలో టాపర్లుగా వచ్చినవాళ్లను అక్కడి స్థానిక టీవీ చానల్ ఒకటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్లు చిత్రమైన సమాధానాలు చెప్పారు. సైన్స్ టాపర్ అయిన సౌరభ్ కుమార్ అయితే.. నీళ్లకు, హెచ్2ఓకు సంబంధం ఏంటో చెప్పలేకపోయాడు. ఇలా పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి బుక్కయిన టాపర్లందరికీ మళ్లీ చిన్నపాటి పరీక్ష, ఇంటర్వ్యూ పెడతామని బోర్డు చెప్పింది. ఆ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుంచి ఐదారు ప్రశ్నలుంటాయి. వాటికి వాళ్లు రాసిన సమాధానాలను, జవాబు పత్రాల్లోని వాళ్ల చేతిరాతను కూడా పోల్చి చూస్తారు. ఇలా రెండోసారి నిర్వహించిన పరీక్షకు రుబీ రాయ్ డుమ్మా కొట్టింది. మిగిలినవాళ్లు పరీక్ష రాశారు. వాటి ఫలితాలు వెలువడాల్సి ఉంది. అప్పుడు నిజంగా వాళ్లలో సరుకెంతో తేలిపోతుంది. వీళ్ల బదులు వేరేవాళ్లు పరీక్షలు రాసి ఉండొచ్చని, లేదా వాళ్లు రాసిన ఆన్సర్ షీట్లను ఎవరో మార్చి ఉండొచ్చని విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు వాళ్ల ఫలితాలు తేడాగా వస్తే తొలుత పరీక్షలు రాసినప్పుడు ఉన్న ఇన్విజిలేటర్లు, పేపర్లు దిద్దినవాళ్లు.. అందరిపై చర్యలు తప్పవు.