టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు | Movie Names, Poetry, Tulsidas In Bihar Topper Ruby Rai's Answer Sheet | Sakshi
Sakshi News home page

టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు

Published Mon, Oct 10 2016 2:52 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు - Sakshi

టాపర్ పేపర్నిండా సినిమాలు, కవితలు

పట్నా: బిహార్ బోర్డు ఎగ్జామ్లో ఆర్ట్స్ విభాగంలో టాపర్గా నిలిచి వివాదంలో చిక్కిన రూబీ రాయ్ పరీక్ష పేపర్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఆమె పరీక్ష పేపర్ నిండా సినిమా పేర్లు కనిపించాయి. పలు కవితలు రాసి ఉన్నాయి. వందకు పైగా ప్రముఖ కవి తులసీ దాస్ పేర్లు దర్శనమిచ్చాయి. అయితే, ఈ ఆన్సర్ షీట్లను పేపర్ వాల్యుయేషన్ చేసే నిపుణులు మార్చారని పోలీసులు చెప్పారు.

వేరే చేతి వ్రాతతో రాసిన పేపర్లను రూబీ ఓఎంఆర్ షీటుకు కట్టారని స్పష్టమైనట్లు తెలిపారు. ఈ ఏడాది వెల్లడైన బిహార్ ఇంటర్ బోర్డు పరీక్ష ఫలితాల్లో 17 ఏళ్ల రూబీ రాయ్ ఆర్ట్స్ విభాగంలో టాపర్ గా వచ్చింది. ఆమెను అనూహ్యంగా ఓ మీడియా ఇంటర్వ్యూ చేయడంతో అసలు ఆమెకు సంబంధిత సబ్జెక్టుపై పూర్తిగా అవగాహన లేదని వెల్లడించింది. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన పోలీసులు మొత్తం కూపీలాగగా అసలు విషయం బయటకొచ్చింది. అసలు తనకు టాపర్ గా రావాలన్న ఉద్దేశం లేదని, కేవలం పాసయితే చాలు అనుకున్నానని రూబీ చెప్పింది. అనంతరం ఈ వ్యవహారం అంతా కూడా పెద్ద కుంభకోణం అని పోలీసులు గుర్తించి మొత్తం 40 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement