పాట్నా: మోసపూరితంగా వ్యవహరించి బిహార్ లో టాపర్ స్థానం దక్కించుకున్న రూబీ రాయ్ కు దాదాపు ఐదు వారాల తర్వాత ఉపశమనం లభించింది. గత నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న ఆమె తిరిగి ఇంటి ముఖం చూసింది. బిహార్ లో ఆర్ట్స్ విభాగంలో రూబీ టాపర్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈమె అనంతరం ఓ మీడియా చేసిన ఇంటర్వ్యూలో సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వలేకపోవడంతోపాటు పొలిటికల్ సైన్స్ వంటల గురించి నేర్పిస్తుందని చెప్పి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
తర్వాత జరిపిన పరిశీలనలో ఆమె మాస్ కాపీయింగ్ పాల్పడినట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు. రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నా కోర్టు అనుమతించలేదు. దీంతో ఆమెను జువెనైల్ హౌస్ కు తరలించారు. ఆమెతో సహా మొత్తం 30మంది జైలులో ఉన్నారు. రూబీ కాలేజీ ప్రిన్సిపాల్ కూడా ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. తన పరీక్షలు ఎలా పాసవ్వాలా అనే ఆశతోనే రాశాను తప్ప తనకు టాపర్ కావాలన్న కోరిక ఉద్దేశం లేదని చెప్పింది. ఎట్టకేలకు 35 రోజుల తర్వాత రూబీకి ఇంటికి వెళ్లే అవకాశం వచ్చింది.
ఎట్టకేలకు ఫేక్ టాపర్ ఇంటికి..
Published Mon, Aug 1 2016 4:59 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement