ఆ నలుగురు టాపర్స్పై ఎఫ్ఐఆర్
పట్నా: బీఎస్ఈబీలో టాపర్స్గా నిలిచిన రూబీ రాయ్, సౌరభ్ శ్రేష్ఠ, రాహుల్ కుమార్, శాలినీపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ వ్యవహారానికి సంబంధించి వైశాలిలోని విషుణ్ రే కళాశాల డైరెక్టర్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియకుండా 14మంది టాపర్లుగా నిలిచిన విషయం తెలిసిందే. రాజనీతి శాస్త్రం అంటే వంటలు నేర్పుతారంటూ రూబీ రాయ్ అనే ఓ టాపర్ చెప్పిన వీడియో జాతీయ మీడియాలో హల్‌చల్ సృష్టించింది.
పొలిటికల్ సైన్స్ గురించి ఏమాత్రం తెలియని ఆమెకి ఆ సబ్జెక్టులోనే 100కు 91 మార్కులు వచ్చాయి. ఆమెకు మొత్తం 500 మార్కులకు గాను 444 వచ్చినా, అసలు ఎన్ని మార్కులు వచ్చాయో కూడా తెలియదు. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉప్పందించిన తర్వాత కూడా.. 600 వచ్చినట్లు ఆమె చెప్పింది. మరోవైపు సైన్స్ టాపర్ సౌరవ్ శ్రేష్ఠ కూడా చిన్నచిన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. అల్యూమినియంను యాక్టివ్ మెటల్ అని చెప్పి, సోడియం, ఎలక్ట్రాన్‌లు అంటే ఏంటో తెలియదన్నాడు. దీంతో ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచిన 14 మందికి జూన్ 3వ తేదీన మరోసారి పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు ఆరోగ్యం బాగోలేదనే సాకుతో టాపర్ రుబీ రాయ్ డుమ్మా కొట్టింది.
అలాగే తనను ప్రశ్నలు అడిగినా, క్రాస్ ఎగ్జామిన్ చేసినా ఆత్మహత్య చేసుకుంటానని బిహార్ సైన్స్ టాపర్ సౌరభ్ శ్రేష్ఠ హెచ్చరించాడు. బిహార్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో సైన్స్ గ్రూప్‌లో టాప్ ఐదో ర్యాంకు తెచ్చుకున్న సౌరభ్‌ను 15మంది నిపుణులతో కూడిన ప్యానెల్ ఇటీవల ప్రశ్నించింది. అందులో అతడు సమాధానాలు ఇవ్వలేకపోయాడు. రీ-ఎగ్జామినేషన్‌లో విఫలం కావడంతో సౌరభ్‌తోపాటు పలువురు టాపర్ల ర్యాంకులను బిహార్ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. రీ-ఎగ్జామినేషన్‌లో టాపర్లు అంతా తేలిపోవడంతో వారి ర్యాంకులు రద్దయ్యాయి. ఈ ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేశారు.