పేరు మార్పుల జోరు | Mahesh vijapurkar writes on name changing of national assets | Sakshi
Sakshi News home page

పేరు మార్పుల జోరు

Published Tue, Dec 20 2016 4:07 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

ప్రభాదేవి స్టేషన్‌ కానున్న ముంబై లోకల్‌ రైల్వే స్టేషన్‌ - Sakshi

ప్రభాదేవి స్టేషన్‌ కానున్న ముంబై లోకల్‌ రైల్వే స్టేషన్‌

విశ్లేషణ
స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పుడైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో అధికారులకు తెలియడం లేదు.

మహారాష్ట్రలోని స్థలాలు, సదుపాయాలు, సంస్థల పేర్ల మార్పిడి జోరు ఎడతెరిపి లేకుండా సాగుతోంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫూలే వర్శిటీగా మారింది. ఇతర విశ్వవిద్యాలయా లకు కూడా అలాగే కొత్త పేర్లు వచ్చాయి. ఇదంతా బొంబాయి ముంబైగా మారిన  చాలా కాలం తర్వాతే జరిగింది. కొత్తగా ఒక స్థానిక రైల్వే స్టేషన్‌ మార్పిడి జరిగింది. బొంబాయి గవర్నర్‌గా పనిచేసిన (1853–60) జాన్‌ ఎల్‌ఫిన్‌స్టోన్‌ పేరిట ఉన్న అది ప్రభాదేవి స్టేషన్‌ అయింది. అయితే జాన్‌ ఎలిఫిన్‌స్టోన్‌ పట్ల గౌరవాన్ని, ఆయన జ్ఞాపకాలను చాటుకోవడానికి ఆయన పేరును ఒక వంతెనకు, స్టేషన్‌కు, జౌళి మిల్లుకు కూడా పెట్టారు. గొట్టాల ద్వారా నీటి  సరఫరా వ్యవస్థను ఆ నగరంలో మొట్టమొదట ఏర్పాటు చేసినది ఆయనే.  

ది బొంబాయి గ్రీన్‌ అంచున నిలిచిన ఆసియా టిక్‌ సొసైటీ ఆఫ్‌ ముంబై అతి పురాతన సంస్థలలో ఒకటి. 1804లో దానికి పునాది వేశారు. ఆ ప్రదేశం పేరు ఎలిఫిన్‌స్టోన్‌ సర్కిల్‌ అయింది. స్వతంత్రం వచ్చిన వెంటనే ఆయన పేరును చెరిపేశారు. బొంబాయి క్రానికల్‌ సంపాదకుడు బెంజమిన్‌ హార్నిమన్‌ స్మారక చిహ్నంగా దాన్ని మార్చారు. హార్నిమన్‌ భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతునిచ్చారు.

ఈ పేరు మార్పిడులు జరుగుతున్నది మహ నీయులుగా కొత్తగా ఆవిర్భవించే వారి పేర్లను పెట్టడానికి కొత్త స్థలాలు దొరకక కాదు, జాతీయ వాదం ఉప్పొంగడం వల్ల. తాజాగా పేరు మార్చిన స్టేషన్‌ను ప్రజలు చాలా ఏళ్లపాటూ పాత, సుపరిచి తమైన పేరుతోనే పిలుస్తారు. ముంబైని ఇంకా బొంబాయి అని పిలుస్తున్న వారు ఉన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా (సీఎస్‌టీ) పేరు మార్చిన విక్టోరియా టెర్మినస్‌ (వీటి)ను కూడా. ఆ సీఎస్‌టీ పేరును తిరిగి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌గా(సీఎస్‌ఎమ్‌టీ) మారుస్తున్నారు. ‘మహరాజ్‌’ లోపించడమంటే ఆ మరాఠా సామ్రాట్‌ పట్ల అపచారమేననే తప్పుడు అవగాహనే ఇందుకు కారణం. శివాజీ రాష్ట్రానికే ఆదర్శ ప్రతీక అనడంలో సందేహం లేదు. ఆయనను ప్రేమగా శివబా అని పిలుచుకుంటారు. పండాపూర్‌లోని దేవుని పేరిట మహా రాష్ట్రను విఠల అని పిలిచేవారు. తుకారాం సైతం ఆయనను కొలిచాడు.

ముంబై తీరంలో సము ద్రంలో బ్రహ్మాండమైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండగా ‘మహరాజ్‌’ చేర్చాలనడం నిర్హేతు కమైనది. ఇది సంకుచిత ప్రాంతీయ సెంటిమెంట్లను సొమ్ముచేసుకోవాలని ప్రాకులాడటమే. స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పు డైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో స్థానిక ప్రయోజనాలకు దాసోహం అంటున్న అధి కారులకు తెలియడం లేదు. దక్షిణ ముంబైలోని ప్రధాన కూడ లిలో గుర్రమెక్కి ఉన్న కింగ్‌ ఎడ్వర్డ్‌-7 విగ్రహాన్ని 1960లలో తొలగించారు. కాలా ఘోడా (నల్ల గుర్రం)గా ఆ విగ్రహం సుప్రసిద్ధమైనది.  చరిత్రంత నిరర్థకమైనది ఏదీ లేదన్నట్టుగా చేశారీ ఈ పని. ఆ కాలా ఘోడా విగ్రహాన్ని విక్టోరియా గార్డెన్‌లో ఓ మూల పారేశారు. శివాజీ తల్లి జిజాబాయిని మరచి పోకూడదన్నట్టుగా దానికి జిజామాతా ఉద్యాన్‌ అని కొత్త పేరు పెట్టారు. స్థానికులు దాన్ని ఎప్పటి నుంచో రాణీబాగ్‌గా పిలిచేవారు. ప్రజా స్మృతుల తీరు విచిత్రంగా ఉంటుంది. కాలా ఘోడా విగ్రహాన్నయితే తొలగించారుగానీ ఇప్పుడు అక్కడ ఒక నల్ల గుర్రం విగ్రహాన్ని పెట్టక తప్పేట్టు లేదు. ఏటా అక్కడ కాలా ఘోడా పండుగ జరుగు తుంటుంది మరి.

బొంబాయిని ముంబైగా మార్చినట్టుగా ఎలిఫిన్‌ స్టోన్‌ స్టేషన్‌కు కూడా దాని పాత పేరును పెట్టి ఉంటే అర్థం చేసుకోగలం. కానీ అంతకు ముందు అక్కడ స్టేషనే లేదు.1853లో బోరి బందర్‌ నుంచి థానేకు మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ప్రారంభమైనప్పుడే దానికి ఆ పేరు పెట్టారు (బోరిబందర్‌ అంటే ఇప్పుడు సీఎస్‌టీగా ఉండి సీఎస్‌ఎమ్‌టీగా మార బోతున్న వీటీ). 300 ఏళ్ల క్రితం నాటి ప్రభాదేవి గుడికి గుర్తుగా దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. కాకపోతే దీనివల్ల దాదర్‌ స్టేషన్‌ పేరును చైత్య భూమిగా మార్చాలనే ఒత్తిడి మరింత పెరుగుతుంది.

చైత్యభూమి దాదర్‌ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని, సముద్ర తీరాన ఉన్న డాక్టర్‌ అంబేడ్కర్‌ను దహనం చేసిన స్థలం. ఏటా దళితులు డిసెంబర్‌ 6న అక్కడికి తీర్థయాత్రలా సాగుతారు. అక్కడికి కూతవేటు దూరంలోని పాడుబడ్డ ఒక జౌళిమిల్లు ఆవరణనంతటినీ భారత రాజ్యాంగ నిర్మాత బ్రహ్మాం డమైన స్మృతి చిహ్నంగా మారుస్తున్నారు. అయితే అదేమీ దాదర్‌ పేరు మార్పు డిమాండును బలహీ నపరచదు. రాజకీయాలే కొలబద్ధ అయినప్పుడు ఏదైనా సాధ్యమే.

-మహేష్‌ విజాపృకర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement