national assets
-
శ్రేయి కంపెనీలకు ఎన్ఏఆర్సీఎల్ అత్యధిక బిడ్
కోల్‌కతా: సంక్షోభంలోని రెండు శ్రేయి గ్రూప్ కంపెనీలను దక్కించుకునేందుకు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) అత్యధికంగా రూ. 5,555 కోట్ల మేర ’ప్రస్తుత నికర విలువ’ ప్రాతిపదికన బిడ్ దాఖలు చేసింది. ఇందులో రూ. 3,200 కోట్లు నగదు రూపంలో ఉండనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 10 గంటల పాటు రుణదాతల కమిటీ (సీవోసీ) నిర్వహించిన బిడ్డింగ్‌లో వర్దే పార్ట్నర్స్ కన్సార్షియం పక్కకు తప్పుకుంది. ఎన్ఏఆర్సీఎల్ అత్యధికంగా బిడ్ చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానికన్నా స్వల్పంగా వెనుకబడిన ఆథమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా బరిలోనే ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఒక అధికారి తెలిపారు. రెండు సంస్థలు (ఎన్ఏఆర్సీఎల్, ఆథమ్) తమ సమగ్ర ప్రణాళికలను సీవోసీకి సమర్పిస్తాయని, జనవరి 8–9 మధ్య తుది ఓటింగ్ ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం దివాలా పరిష్కార ప్రణాళిక దాదాపు రూ. 13,000–14,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కనిష్టంగా రూ. 9,500–10,000 కోట్లయినా రావచ్చని పేర్కొన్నాయి. గవర్నెన్స్ లోపాలు, రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ల కారణంగా శ్రేయి గ్రూప్‌లోని శ్రేయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ (ఎస్‌ఐఎఫ్‌ఎల్), దాని అనుబంధ సంస్థ శ్రేయి ఎక్విప్మెంట్ ఫైనాన్స్ (ఎస్‌ఈఎఫ్‌ఎల్) బోర్డులను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసింది. ఈ రెండు నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) .. బ్యాంకులకు రూ. 32,750 కోట్ల మేర బాకీ పడ్డాయి. వీటిని రాబట్టుకునేందుకు 2021 అక్టోబర్‌లో దివాలా చట్టం కింద చర్యలు ప్రారంభమయ్యాయి. -
బ్యాడ్ బ్యాంక్‌కు సావరిన్ గ్యారంటీ
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గించేందుకు ఏర్పాటుకానున్న ప్రతిపాదిత నేషనల్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) లేదా బ్యాడ్ బ్యాంక్ జారీ చేసే రిసిట్స్‌కు ప్రభుత్వ (సావరిన్) గ్యారంటీ లభించింది. ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్లు కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విలేకరులకు గురువారం ఈ విషయాన్ని తెలిపారు. ప్రతిపాదిత బ్యాడ్ బ్యాంక్... ఎన్ఏఆర్సీఎల్ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్ సమావేశం బుధవారమే ఆమోదముద్ర వేసింది. అయితే ఇందుకు సంబంధించి రూ.30,600 కోట్ల నిధుల కేటాయింపు జరుపుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికమంత్రి తాజాగా తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో బ్యాంకులు రూ.5.01 లక్షల కోట్ల రుణ రికవరీ చేశాయని నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా తెలిపారు. 2018 మార్చి నుంచీ చూస్తే ఈ విలువ రూ.3.1 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. నవంబర్‌కల్లా లైసెన్సులు బ్యాంకింగ్ మొండిబకాయిల (ఎన్పీఏ) సమస్య పరిష్కారం దిశలో ఇండియన్ బ్యాంక్స్ అసోషియేషన్ (ఐబీఏ) బ్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. లైసెన్స్ మంజూరీకి గత నెల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు ఐబీఏ దరఖాస్తు చేసింది. వచ్చే రెండు నెలల్లో దీనికి ఆర్బీఐ ఆమోదముద్రవేసే అవకాశాలు కూడా ఉన్నాయని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. నిర్వహణా తీరు ఇది... ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం, ఒక బ్యాంక్ నుంచి మొండిబకాయి (ఎన్పీఏ) కొనే సందర్భంలో, అంగీకరించిన విలువలో 15 శాతం వరకూ ఎన్ఏఆర్సీఎల్ నగదు రూపంలో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం కేంద్ర హామీతో కూడిన సెక్యూరిటీ రిసిట్స్ ఉంటాయి. ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది. రిసిట్స్‌కు గ్యారంటీ ఐదేళ్లు... ఆర్థిక సేవల కార్యదర్శి దేబాíÙష్ పాండా తెలిపిన సమాచారం ప్రకారం, రిసిట్స్‌కు సావరిన్ గ్యారంటీ ఐదేళ్ల కాలానికి వర్తిస్తుంది. రిసిట్స్ విలువకు ఎన్ఏఆర్సీఎల్ ఫీజుకూడా చెల్లించాలి. తొలి దశలో దీనికి 0.25 శాతం ఫీజు ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారం విషయంలో ఆలస్యం అయితే ఈ ఫీజు 0.5 శాతం వరకూ పెరుగుతంది. ఈ బ్యాకప్ వ్యవస్థ మొత్తం మొండిబకాయిల భారం సత్వర పరిష్కారానికి, బ్యాంకింగ్‌కు త్వరిత గతిన నిధుల లభ్యతకు, తద్వారా తదుపరి బ్యాంకింగ్ రుణ పంపిణీ పురోగతికి దోహదపడే అంశమని ఆయన వివరించారు. 2021–22 బడ్జెట్ చూస్తే... 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఆర్థికమంత్రి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు. ‘‘మొండిబకాయిల నిర్వహణకు అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ ఏర్పాటు జరుగుతుంది. ఒత్తిడిలో ఉన్న రుణ బకాయిని ఈ కంపెనీ తన ఆ«దీనంలోనికి తీసుకుని నిర్వహిస్తుంది లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఇతర అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు బిడ్డింగ్ ప్రాతిపదికన విక్రయిస్తుంది. తద్వారా రుణ బకాయికి తగిన విలువను పొందుతుంది’’ అని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. వాటాలు ఇలా.. ఎన్ఏఆర్సీఎల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ప్రభుత్వ, ప్రైవేటు, ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఎన్ఏఆర్సీఎల్లో 16 మంది షేర్హోల్డర్లు ఉంటారు. ఎన్ఏఆర్సీఎల్లో 12 శాతం వాటాతో లీడ్ స్పాన్సర్‌గా ఉండామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు. రానున్న కొద్ది కాలంలో దాదాపు రూ.2 లక్షల కోట్ల మొండిబకాయిలను ఎన్ఏఆర్సీఎల్ నిర్వహిస్తుందని (కొనుగోలు చేస్తుందని) అంచనా. ‘4ఆర్’ విధానం ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపడ్డానికి ‘4ఆర్’ వ్యూహాన్ని కేంద్రం అనుసరిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సమస్య గుర్తింపు (రికగ్నేõÙన్), పరిష్కారం (రిజల్యూషన్), అవసరమైన మూలధన కల్పన (రీక్యాపిటలైజేషన్), సంస్కరణలు (రిఫార్మ్) ‘4ఆర్’లో ఉన్నట్లు వివరించారు. కాగా, బ్యాడ్ బ్యాంక్ ఏదైనా ఎన్పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో నష్టం జరిగే సందర్భాలు తక్కువగానే ఉండవచ్చని, ఆ నష్టం ఏ స్థాయిలో ఉంటుందని ఇప్పుడు ఊహించడం సరికాదని ఈ సందర్భంగా సూచించారు. అందువల్ల రిసిట్స్‌కు ప్రభుత్వ గ్యారెంటీ వల్ల ప్రస్తుతానికి ఆర్థిక భారం కేంద్రంపై ఉండబోదని స్పష్టం చేశారు. -
ఆర్బీఐ ముందుకు బ్యాడ్‌బ్యాంక్ లైసెన్స్ దరఖాస్తు!
న్యూఢిల్లీ: నేషనల్ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్)కు సంబంధించి లైసెన్స్ కోసం ఆర్బీఐకి త్వరలోనే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దరఖాస్తు చేసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగంలో వసూలు కాని మొండి బకాయిల సమస్యకు పరిష్కారంగా ఎన్ఏఆర్సీఎల్ఎల్ (బ్యాడ్ బ్యాంకు) ఏర్పాటును 2021–22 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన విషయం తెలిసిందే. రూ.100 కోట్ల అధీకృత మూలధనంతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా ఈ నెల 7న ఎన్ఏఆర్సీఎల్ను ఏర్పాటు చేసినట్టు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఫైలింగ్స్ చెబుతున్నాయి. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చినట్టయితే ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. -
పేరు మార్పుల జోరు
విశ్లేషణ స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పుడైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో అధికారులకు తెలియడం లేదు. మహారాష్ట్రలోని స్థలాలు, సదుపాయాలు, సంస్థల పేర్ల మార్పిడి జోరు ఎడతెరిపి లేకుండా సాగుతోంది. పుణే విశ్వవిద్యాలయం సావిత్రిబాయి ఫూలే వర్శిటీగా మారింది. ఇతర విశ్వవిద్యాలయా లకు కూడా అలాగే కొత్త పేర్లు వచ్చాయి. ఇదంతా బొంబాయి ముంబైగా మారిన చాలా కాలం తర్వాతే జరిగింది. కొత్తగా ఒక స్థానిక రైల్వే స్టేషన్ మార్పిడి జరిగింది. బొంబాయి గవర్నర్‌గా పనిచేసిన (1853–60) జాన్ ఎల్ఫిన్‌స్టోన్ పేరిట ఉన్న అది ప్రభాదేవి స్టేషన్ అయింది. అయితే జాన్ ఎలిఫిన్స్టోన్ పట్ల గౌరవాన్ని, ఆయన జ్ఞాపకాలను చాటుకోవడానికి ఆయన పేరును ఒక వంతెనకు, స్టేషన్‌కు, జౌళి మిల్లుకు కూడా పెట్టారు. గొట్టాల ద్వారా నీటి సరఫరా వ్యవస్థను ఆ నగరంలో మొట్టమొదట ఏర్పాటు చేసినది ఆయనే. ది బొంబాయి గ్రీన్ అంచున నిలిచిన ఆసియా టిక్ సొసైటీ ఆఫ్ ముంబై అతి పురాతన సంస్థలలో ఒకటి. 1804లో దానికి పునాది వేశారు. ఆ ప్రదేశం పేరు ఎలిఫిన్స్టోన్ సర్కిల్ అయింది. స్వతంత్రం వచ్చిన వెంటనే ఆయన పేరును చెరిపేశారు. బొంబాయి క్రానికల్ సంపాదకుడు బెంజమిన్ హార్నిమన్ స్మారక చిహ్నంగా దాన్ని మార్చారు. హార్నిమన్ భారత స్వాతంత్య్రోద్యమానికి మద్దతునిచ్చారు. ఈ పేరు మార్పిడులు జరుగుతున్నది మహ నీయులుగా కొత్తగా ఆవిర్భవించే వారి పేర్లను పెట్టడానికి కొత్త స్థలాలు దొరకక కాదు, జాతీయ వాదం ఉప్పొంగడం వల్ల. తాజాగా పేరు మార్చిన స్టేషన్‌ను ప్రజలు చాలా ఏళ్లపాటూ పాత, సుపరిచి తమైన పేరుతోనే పిలుస్తారు. ముంబైని ఇంకా బొంబాయి అని పిలుస్తున్న వారు ఉన్నారు. అలాగే ఛత్రపతి శివాజీ టెర్మినస్‌గా (సీఎస్టీ) పేరు మార్చిన విక్టోరియా టెర్మినస్ (వీటి)ను కూడా. ఆ సీఎస్టీ పేరును తిరిగి ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్‌గా(సీఎస్ఎమ్టీ) మారుస్తున్నారు. ‘మహరాజ్’ లోపించడమంటే ఆ మరాఠా సామ్రాట్ పట్ల అపచారమేననే తప్పుడు అవగాహనే ఇందుకు కారణం. శివాజీ రాష్ట్రానికే ఆదర్శ ప్రతీక అనడంలో సందేహం లేదు. ఆయనను ప్రేమగా శివబా అని పిలుచుకుంటారు. పండాపూర్లోని దేవుని పేరిట మహా రాష్ట్రను విఠల అని పిలిచేవారు. తుకారాం సైతం ఆయనను కొలిచాడు. ముంబై తీరంలో సము ద్రంలో బ్రహ్మాండమైన శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండగా ‘మహరాజ్’ చేర్చాలనడం నిర్హేతు కమైనది. ఇది సంకుచిత ప్రాంతీయ సెంటిమెంట్లను సొమ్ముచేసుకోవాలని ప్రాకులాడటమే. స్థానికతను చాటుకోవాలంటూ ఇంగ్లిషు వారి పేరున్న ప్రతిదానికీ భారతీయుల పేర్లను, ఇక ఇప్పు డైతే మరాఠీల పేర్లను పెట్టడం ఎంత వ్యర్థమో స్థానిక ప్రయోజనాలకు దాసోహం అంటున్న అధి కారులకు తెలియడం లేదు. దక్షిణ ముంబైలోని ప్రధాన కూడ లిలో గుర్రమెక్కి ఉన్న కింగ్ ఎడ్వర్డ్-7 విగ్రహాన్ని 1960లలో తొలగించారు. కాలా ఘోడా (నల్ల గుర్రం)గా ఆ విగ్రహం సుప్రసిద్ధమైనది. చరిత్రంత నిరర్థకమైనది ఏదీ లేదన్నట్టుగా చేశారీ ఈ పని. ఆ కాలా ఘోడా విగ్రహాన్ని విక్టోరియా గార్డెన్లో ఓ మూల పారేశారు. శివాజీ తల్లి జిజాబాయిని మరచి పోకూడదన్నట్టుగా దానికి జిజామాతా ఉద్యాన్ అని కొత్త పేరు పెట్టారు. స్థానికులు దాన్ని ఎప్పటి నుంచో రాణీబాగ్గా పిలిచేవారు. ప్రజా స్మృతుల తీరు విచిత్రంగా ఉంటుంది. కాలా ఘోడా విగ్రహాన్నయితే తొలగించారుగానీ ఇప్పుడు అక్కడ ఒక నల్ల గుర్రం విగ్రహాన్ని పెట్టక తప్పేట్టు లేదు. ఏటా అక్కడ కాలా ఘోడా పండుగ జరుగు తుంటుంది మరి. బొంబాయిని ముంబైగా మార్చినట్టుగా ఎలిఫిన్ స్టోన్ స్టేషన్‌కు కూడా దాని పాత పేరును పెట్టి ఉంటే అర్థం చేసుకోగలం. కానీ అంతకు ముందు అక్కడ స్టేషనే లేదు.1853లో బోరి బందర్ నుంచి థానేకు మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ప్రారంభమైనప్పుడే దానికి ఆ పేరు పెట్టారు (బోరిబందర్ అంటే ఇప్పుడు సీఎస్టీగా ఉండి సీఎస్ఎమ్టీగా మార బోతున్న వీటీ). 300 ఏళ్ల క్రితం నాటి ప్రభాదేవి గుడికి గుర్తుగా దాన్ని మార్చాల్సిన అవసరమే లేదు. కాకపోతే దీనివల్ల దాదర్ స్టేషన్ పేరును చైత్య భూమిగా మార్చాలనే ఒత్తిడి మరింత పెరుగుతుంది. చైత్యభూమి దాదర్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోని, సముద్ర తీరాన ఉన్న డాక్టర్ అంబేడ్కర్‌ను దహనం చేసిన స్థలం. ఏటా దళితులు డిసెంబర్ 6న అక్కడికి తీర్థయాత్రలా సాగుతారు. అక్కడికి కూతవేటు దూరంలోని పాడుబడ్డ ఒక జౌళిమిల్లు ఆవరణనంతటినీ భారత రాజ్యాంగ నిర్మాత బ్రహ్మాం డమైన స్మృతి చిహ్నంగా మారుస్తున్నారు. అయితే అదేమీ దాదర్ పేరు మార్పు డిమాండును బలహీ నపరచదు. రాజకీయాలే కొలబద్ధ అయినప్పుడు ఏదైనా సాధ్యమే. -మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com