తన కాలానికి ముందు నడిచిన రైతు నేత | tribute to the great former's leader sharad joshi | Sakshi
Sakshi News home page

తన కాలానికి ముందు నడిచిన రైతు నేత

Published Sun, Dec 13 2015 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

తన కాలానికి ముందు నడిచిన రైతు నేత

తన కాలానికి ముందు నడిచిన రైతు నేత

నివాళి
 
‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను శరద్ జోషితో పంచుకున్నప్పుడు నాతో ఏకీభవించారు. ’మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూ వస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపించుకోలేదు. రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావని జోషి నిత్యం చెబుతూనే వచ్చారు.
 
మహారాష్ట్రలోని పుణేలో 80 ఏళ్ల వయస్సులో కన్నుమూ సిన రైతు నేత శరద్ జోషి కాలానికి ముందున్న వ్యక్తి. వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు చెల్లించాలనీ, అదే సమయంలో, తాను ఏ పంటలు పండించుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ రైతుకు ఉండాలని ప్రబోధించిన వ్యక్తి జోషి. ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి నామమాత్రపు పెంపుదలతో కూడిన ధాన్య సేకరణ ధరలను నిర్ణయిస్తుం డటంవల్ల వ్యవసాయానికి ఆటంకం కలగడమే కాకుండా వ్యవసాయాన్ని ప్రతిఫలం లేనిదిగా మార్చివేస్తోందని ఆయన నొక్కి చెప్పారు.

‘‘మాకు సరైన ధర చెల్లించండి. మా గ్రామాల్లో ప్రభు త్వాన్ని మేం కోరుకోం. మంచి వేతనం పొందే ఉపాధ్యాయు లతో మేం మా సొంత ప్రైవేట్ పాఠశాలలను నడిపించుకో గలం. పనిచేయని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు బదులుగా ఫీజులు చెల్లించి మరీ వైద్యసేవలు పొందగలం’’ అంటూ జోషి హేతుపూర్వక వివరణ ఇచ్చారు. రైతులు గడుపుతున్న జీవితం తీరును ఆయన మాటలు చెబుతాయి. ఆయన ప్రతిపాదన వడ్డీవ్యాపారుల పీడన నుంచి రైతు లోకాన్ని బయట పడేస్తుంది.

1980లలో ఉల్లి ధరలు కుప్పగూలినప్పుడు, నాసిక్ సమీపంలోని లాసల్‌గావ్ మార్కెట్‌ను శరద్ జోషీ మూసివే యించారు. అది దేశంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్. రైతులు తాము అమ్మలేని ఉత్పత్తులను వెనక్కు తీసుకెళ్లేందుకు ట్రక్కర్లకు డబ్బులు కూడా చెల్లించలేక నిరసన తెలుపుతూ తమ వ్యవసాయ ఉత్పత్తులను రహదారుల మీదే పడవేసి వెళ్లిపోయేవారు. అప్పుడే ఆయన స్వేచ్ఛా మార్కెట్‌ను సమ ర్థించే సిద్ధాంతవేత్తగానే కాకుండా, ఆందోళనకారుడిగా మారి రైతు సమర్థకుడిగా వెలుగులోకి వచ్చారు.

రాజకీయ నేతలు, రాజకీయాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నది ఆయన అభిప్రాయం. తాను అన్నమాటలో మరీ అంత తప్పేమీలేదు. సరిగ్గా ఏడాది తర్వాత ఉల్లి ధరలు చుక్కలంటినప్పుడు, శరద్ జోషి పేరును పోలి ఉన్న శరద్‌పవార్ ‘అధిక ధరలు ఉన్నాయంటే రైతులకు ప్రయోజనం కలుగుతోందని అర్థం’ అంటూ పరా చకాలాడారు. పవార్ స్పష్టంగానే వినియోగదారుల తోలు వలుస్తున్న మధ్య దళారీలను మర్చిపోయారు. జోషి ఉద్దేశంలో తగిన ధరలు అంటే రైతుల సంక్షేమం పునాదిగా ఉండాలి.

ఎం.ఫిల్ పూర్తి చేసి భారతీయ తపాలాశాఖ ఉద్యోగిగా ఉండి ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ అయిన యూనివర్శల్ పోస్టల్ యూనియన్‌లో పనిచేసిన ఈయన రైతు సమస్యను తన జీవిత లక్ష్యంగా ఎందుకు ఎంచుకున్నట్లు? ఎందుకంటే ఐక్యరాజ్యసమితిలో దశాబ్దం పాటు పనిచేసిన కాలంలో వ్యవసాయ రుణాల కోసం భారతీయ నేతలు బిక్షాపాత్ర పట్టుకుని తిరగటాన్ని జోషి చూస్తూవచ్చారు. అయినా రైతులు ఎందుకు సంతోషంగా ఉండలేకపోయారు? వ్యక్తి గత వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారంగా రైతులు ఆత్మ హత్యలకు పాల్పడటానికి ముందు రోజుల మాట ఇది.

తర్వాత ఆయన భారత్‌కు తిరిగివచ్చి భూమి కొను గోలు చేసి వ్యవసాయం ప్రారంభించారు. బతకడానికి వ్యవ సాయం తగిన వృత్తిగా లేదేమో అన్న భయాలను ఆయన పక్కన బెట్టేశారు. ‘రైతు ఇంక ఏమాత్రం రైతుగా మిగలని రోజు వస్తుంది’ అంటూ కర్నూలుకి చెందిన రాజకీయనేత మద్దూరి సుబ్బారెడ్డి తరచుగా చేస్తూవచ్చిన హెచ్చరికను నేను జోషితో పంచుకున్నప్పుడు ఆయన నాతో ఏకీభవిం చారు. ‘మీరు కర్నూలులో ఆ సత్యాన్ని గ్రహించారు. నేను కూడా ఆ విషయాన్నే చెబుతూవస్తున్నాను’ అన్నారు. కానీ ఈ హెచ్చరికల్లో వేటినీ ఎవరూ పట్టించుకోలేదు. వినిపిం చుకోలేదు.

గ్రామాల్లో తాను నిర్వహించిన లెక్కలేనన్ని సమావే శాల్లో జోషీ ప్రారంభంలోనే చెబుతూ వచ్చిన మాటేమి టంటే, రాజకీయ పక్షపాతం నేపథ్యంలో రైతు సమస్యలు పరిష్కారం కావనే. తన కేంపెయిన్‌లో చేరదల్చుకున్నవారు ‘‘తమ రాజకీయ తొడుగులను, జెండాలను ఇంటివద్దే వది లేసి రావాల’’ని ఆయన తేల్చి చెప్పేవారు. రైతు సమస్య లపై పోరాట నిమగ్నత రాజకీయ విశ్వాసాలకు అతీతంగా ఉండాలన్నది ఆయన అభిప్రాయం. అయితే తనకు తాను గా విధించుకున్న నిబంధన నుంచి ఆయనే తప్పుకోవాల్సి వచ్చింది. తన పోరాట రంగస్థలాన్ని దేశంలో ప్రధాన పంచాయతీ అయిన పార్లమెంటుకు తీసుకుపోవడానికి ఆయన శివసేన మద్దతు కోసం కూడా ప్రయత్నించారు. ఒకప్పుడు ఇదే శివసేనను ఆయన ‘మతతత్వం’ పునాదిగా పెరిగిన ‘రాబందులు’గా వర్ణించారు.

లోక్‌సభలో రైతు సమస్యకు అనుకూల ఓటును పొంద డానికి పలు ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన రాజ్యసభ తలుపులు తట్టారు. కమ్యూనిస్టులకు లాగే ఈయన కూడా రైతులను నిరంతరం సమీకరించడంపైనే విశ్వాసం పెట్టుకు న్నారు. ఆయన వెన్నంటి నడిచినప్పుడు తాను నిర్వహించే కేంపెయిన్ ఎంతో భిన్నంగా ఉండేది. రైతు సమావేశాలను ఎక్కడైనా ఇళ్లలోపలే నిర్వహించేవారు. పెద్ద గదిలోనో, లేదా మిద్దెపైనో స్థలం విశాలంగా ఉంటే అక్కడకూడా సమా వేశాలు నిర్వహించేవారు. లౌడ్ స్పీకర్ల అవసరం ఉండేది కాదు. ఆయన ఖర్చులు కూడా తక్కువే. కేంపెయిన్ చేస్తున్న ప్పుడు ఎవరు ఏది పెడితే దాన్నే ఆరగించేవారు.

రాజాజీ స్వతంత్ర  పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసు కుపోవడానికి జోషి ‘స్వతంత్ర భారత్ పక్ష్’ అనే సొంత పార్టీని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థిని సోషలిజం పేరుతో ప్రమాణ స్వీకారం చేయవల సిందిగా బలవంతం చేయవలసిన అవసరం లేదంటూ జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉదారవాద సమర్థకుడికి సోషలిజం అనే పదం చేదుమాత్రలా ఉంటుం దని ఆయన ఉద్దేశం. దీనికి సంబంధించి ఆయన రాజ్య సభలో ఒక ప్రైవేట్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇందిరాగాంధీ హయాంలో ‘లౌకికవాదం’ అనే పదాన్ని చొప్పించి నందున రాజ్యాంగంలో ‘సోషలిజం’ అనే పదం కొనసాగుతోంది.

అయితే ఉచిత విద్యుత్తు, రుణ మాఫీలను డిమాండ్ చేయడంలో ఒక స్పష్టమైన వైరుధ్యాన్ని ఆయనలో గమనిం చవచ్చు. ధరవరలపై ప్రభుత్వ విధానాల కారణంగా రైతు లు తీవ్రమైన ఆర్థిక అసమగ్రతా స్థాయిల్లో కూరుకుపోతు న్నంత కాలం ఈ డిమాండ్ చేయవలసిందేనని ఆయన అభి ప్రాయం. రైతు సమస్యలపై లాబీ చేస్తున్నామని చెప్పుకునే ఇతరుల్లాగా కాకుండా, అయన అధిక ధరల డిమాండ్ వద్దే ఆగిపోయేవారు కాదు. రైతులకు ప్రయోజనం కలిగించే ఏకైక సాధనంగా స్వేచ్ఛామార్కెట్ కోసం ఆయన కేంపె యిన్ చేశారు. రైతులు లబ్ధి పొందితే ఇతరులూ ప్రయో జనం పొందుతారన్నది ఆయన విశ్వాసం.

ఆయన సాగించిన రైతు సమీకరణలో ఆసక్తికరమైన అంశం ఏదంటే, ఆయన కేంపెయిన్‌లలో ప్రముఖ పాత్ర వహించిన కార్యకర్తలందరూ ఆయన తోటే కొనసాగేవారు కాదు. విభేదాల కారణంగా వారు తమ తమ మార్గాలను ఆశ్రయించేవారు కానీ రైతు సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లేవారు. అందుకే ‘షేత్కారి సంఘటన’ను ముద్రిం చిన పోస్ట్‌బాక్స్ ఎరుపు రంగు పిన్‌ను ధరించడం వారు కొన సాగించేవారు. ఆయన సంస్థ సార్వత్రికమైనదని దీనర్థం. విభే దాలవల్ల వారు విడిపోయనప్పటికీ అదేమంత పెద్ద విషయం కాదు మరి.

- మహేశ్ విజాపుర్కార్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement