నగదు రహిత జీవితం
విశ్లేషణ
పెద్ద నోట్ల రద్దు ప్రకటించి దాదాపు నెల రోజులవుతోంది. మీ డబ్బు ఉన్నట్లుండి చిత్తుకాగితంగా మారిపోయింది. మీ ఏటీఎం నుంచి కానీ, మీరు ఖాతా తెరిచిన బ్యాంకు నుంచి కానీ డబ్బు తీసుకోలేరు. నగదు లేని జీవితం విభిన్నంగానూ, భయంకరమైన అసౌకర్యంగాను ఉంటుంది కాబట్టి ఎంతో కొంతల మొత్తాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఘర్షించవలసిందే. మీ నిర్ణయం తప్పు అని నరేంద్రమోదీకి చెప్పడానికి కూడా మీరు సిద్ధం. కొద్దికాలంపాటు నగదు లేని జీవితానికి అలవాటుపడిన వారికి మల్లే.. ఉన్నట్లుండి నగదు లేకపోవడం అనే స్థితిని పోల్చలేం.
మీ పనిమనిషి, డ్రైవర్, వంటమనిషి, వ్యవసాయ కూలీ, వడ్రంగి, తోలుపనివాడు మొదలైనవారికి నెలలో రెండోభాగం ప్రారంభం అయ్యే సమయానికి పెద్దగా తేడా కనిపించలేదు కాని జీవితం మరింత భారమవడం ప్రారంభమైంది. వారి జీతాలను చెల్లించారు కానీ వారు రూ. 2,000ల బ్యాంకు నోటును ఉపయోగించలేరు. చిన్న నోట్ల కొరత తీవ్రం కావడంతో వారు కోరుకున్న వాటిని ఆ పెద్ద నోటు అందించలేదు. సులభ లావాదేవీలకు రూ. 100, రూ. 50, రూ. 10ల నోట్లు తగినంతగా లేవు. వారి చిన్న చిన్న అవసరాలను ఒకే చోట కొనుక్కోలేరు. వారున్న ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉండే షాపులనుంచే వారు కొంటుంటారు. తమ మొబైల్ బిల్స్‌ని వారు ప్లాస్టిక్ డబ్బుతో చెల్లించలేరు.
సేవారంగంలోని ఈ తక్కువ జీతం సంపాదించేవారు ప్రస్తుతం నగదు రహిత స్థితిపై మీ కలవరాన్ని చూసి సంతోషిస్తుంటారు. ఎందుకంటే ప్రతి నెలా 10వ తేదీ తర్వాత వారి చేతుల్లో డబ్బు ఉండటం అనేది అసాధారణ విషయంగానే ఉంటుంది. నెల పొడవునా తగి నంత డబ్బు వారు ఎన్నడూ చూడలేరు. గత వారంలో రూ. 2,000 బ్యాంకు నోట్ల రూపంలో వారికి చెల్లించిన జీతాలు కంటికి కనిపిస్తాయి కానీ అంత సులభంగా వారు ఆ నోట్లను ఉపయోగించలేరు. అది కాస్త ఇబ్బంది పెడుతుంది. కానీ వారెలాగోలా ఓర్చుకుంటారు. ఎందుకంటే వారికి జీవితమంటేనే కష్టాలతో కూడుకున్నది. ఇది మరొక కష్టం మాత్రమే.
సాధారణంగా మీకు అప్పులివ్వడానికి వ్యతిరేకించే కిరాణా కొట్టు యజమాని మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును ఆమోదించడానికి సిద్ధపడవచ్చు. వారిలో కొందరు నిర్దయులు ఈ సౌకర్యం కల్పించినందుకు గాను మీ బిల్లుపై 2-3 శాతం రుసుము విధించవచ్చు. అనేక లావాదేవీల్లో పెద్ద నోట్లకు చిల్లర పొందడానికి మీరు అవసరానికి మించి కొనుగోలు చేయవలసి రావచ్చు. మీ అవసరాల కొనుగోలుకు రూ.350లు చాలుననుకుంటే, మీరు రూ. 700లకు కొనుగోలు చేస్తే తప్ప మీకు రూ.1,300ల చిల్లర లభించకపోవచ్చు.
జీవితం ఉన్నట్లుండి నూతన సాధారణ స్థితికి చేరుతోంది. తమ ఖర్చులు ఎలా తగ్గిపోయాయి అనే విషయంపై ప్రజలు మాట్లాడుతున్నారు. నవంబర్ నెల అక్టోబర్ నెలలా లేదు. గత నెల తొలి వారం తర్వాత పెద్ద నోట్ల రద్దు ఉనికిలోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసి ఎప్పటిలాగే ఖర్చుపెట్టుకున్నారు. కానీ సంకట స్థితి మాత్రం అనుభవంలోకి వచ్చేసింది. చిన్న నాణేలు పిల్లల హుండీల్లోకి వెళ్లిపోయాయి. మీరు రూ.10ల కాగితం ఇచ్చినా సరే.. దుకాణాదారులు దానికి కూడా చిల్లర లేదని చెప్పేస్తున్నారు.
మీ ప్యాంట్ జేబులో లేక మీరు పట్టుకెళ్లే బ్యాగుల్లో బరువుగా అనిపించే 1, 2, 5, 10 రూపాయల నాణేలకు ఆ మరుసటి దినమే ఉన్నట్లుండి ఇంత ప్రాముఖ్యత ఏర్పడుతుందని ఎవరు భావించారు? రూ. 2,000లకు తక్కువ విలువ ఉన్న ద్రవ్యాన్ని దేన్నైనా బ్యాంకు అందిస్తోందా అంటే అవి రూ.10 ల నాణేలు మాత్రమే.. అవే ఇప్పుడు గౌరవనీయమైనవిగా మారారుు. ఇవి ఉన్నవారు జాగ్రత్తగా ఖర్చుపెడుతున్నారు. కరెన్సీ నోట్ల సరఫరా ఎప్పుడు మెరుగుపడుతుందో ఎవరికి తెలుసు?
ఈ పరిస్థితి మధ్యతరగతి ఖర్చులను తగ్గిస్తోంది. ఇది తాత్కాలికం మాత్రమే. బ్యాంకులు సెల్ఫ్ పేరిట రాసిన చెక్కును గౌరవించాల్సిందే. ప్రజలు కొనుగోళ్లను పూర్తిగా వదిలేయలేదు కానీ వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టాక, జీవితం యధాస్థితికి రావచ్చు. కానీ చాలామందికి అది గతంలోలాగే ఉంటుంది. ఇంతవరకు బ్యాంకు ఖాతాలు లేని వారు తాము గతంలో జనధన్ బ్యాంకు ఖాతాలు తెరవనందుకు ఇప్పుడు పశ్చాత్తాపపడుతుంటారు. అక్రమార్జనపరులు జనధన్ ఖాతాల్లో తమ నగదును బదిలీ చేసి ఉంటే, ఆ నగదు పేదల ఖాతాల్లోనే కొనసాగించేలా చూస్తానని ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు.
జనధన్ ఖాతాల్లోకి వచ్చి పడిన ఈ అదనపు నగదు ఎవరో ఒక పన్ను ఎగవేతదారు అక్రమార్జనే అయి ఉంటుంది కనుక దాన్ని ఖాతాదారులు తిరిగి వెనక్కు ఇవ్వవద్దని మోదీ సూచించారు. కానీ పేదల విషయానికి వస్తే తర్వాత వారికి దక్కే నగదు కంటే ఇప్పుడు వారికి దక్కే నగదే చాలా ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. భవిష్యత్తులో వచ్చి పడే దానికంటే ఇప్పుడు తమ చేతికి దక్కేదాని పట్లే వారికి ఆకర్షణ ఉంటుంది.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com