మాకు అనుమతులున్నాయి: రాందేవ్ బాబా | we have FSSAI permit and center gave license to us, says Baba Ramdev | Sakshi
Sakshi News home page

మాకు అనుమతులున్నాయి: రాందేవ్ బాబా

Published Thu, Nov 19 2015 10:48 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM

మాకు అనుమతులున్నాయి: రాందేవ్ బాబా - Sakshi

మాకు అనుమతులున్నాయి: రాందేవ్ బాబా

న్యూఢిల్లీ: తన సంస్థ తరుఫున ప్రారంభించిన పతంజలి నూడుల్స్ అనుమతుల వివాదం, ఆరోపణలపై యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి స్పందించారు. మేం ఎలాంటి తప్పు చేయడం లేదు అని రాందేవ్ బాబా పేర్కొన్నారు. పతంజలి నూడుల్స్ కోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని ఆయన తెలిపారు. నూడుల్స్ అమ్మకాల విషయంలో కేంద్రమే మాకు లైసెన్స్ ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలతో నూడుల్స్ వివాదం మరింత ముదిరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

దేశవ్యాప్తంగా గత కొన్ని నెలలుగా పలు రకాల కంపెనీల నూడుల్స్ వివాదం కొనసాగుతుండగానే ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా తన సంస్థ తరుపున పతంజలి నూడుల్స్ ప్రారంభించిన విషయం అందరికీ విదితమే. అయితే, ఈ నూడుల్స్ వ్యాపారం కోసం ఇప్పటి వరకు తమ అనుమతి తీసుకోలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్మన్ ఆశిష్ బహుగుణ బుధవారం తెలిపారు. పైగా ఈ ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఏఐ సంస్థ అనుమతి పొందినట్లు ఉందని తమ దృష్టికి వచ్చిందని చైర్మన్ వెల్లడించిన నేపథ్యంలో.. తమ సొంత సంస్థ తరుఫున ప్రారంభించిన పతంజలి నూడుల్స్కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ మరోసారి వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement