
ముంబై : అతిపెద్ద ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సంచలన నిర్ణయం తీసుకుంది. నాణ్యతా ప్రమణాలు పాటించని దాదాపు 5 వేల రెస్టారెంట్లను తమ జాబితా నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి నుంచే దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వెల్లడించింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపింది. అంతేకాక దేశంలోని 150 పట్టణాల్లో తమతో ఒప్పందం చేసుకొన్న సంస్థల్లో నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తామని వెల్లడించింది.
ఈ విషయం గురించి జొమాటో సీఈవో మోహిత్ గుప్తా మాట్లాడుతూ ‘నిత్యం మా జాబితాలోకి కొత్తగా 400 రెస్టారెంట్లు వచ్చి చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడం చాలా ముఖ్యం. మాతో సంబంధం ఉన్న దాదాపు 80,000 రెస్టారెంట్ల నాణ్యతా ప్రమాణాలను మరోసారి పరిశీలించాలనుకుంటున్నాం. ఈ క్రమంలో ఆ రెస్టారెంట్లు నాణ్యతా ప్రమాణాలను అందుకొనేందుకు సాయం చేస్తామ’ని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment