ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళను డబ్బులు అడగటం వంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది వాట్సాప్ వేదికగా మోసాలు చేయడానికి పూనుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. 'మీరు మెసేజ్ చూసాక ఫోన్ చేయండి.. ధన్యవాదాలు' అంటూ అధికారులు పంపించినట్లు మెసేజులు చాలామందికి వచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కి మాత్రమే కాకుండా ఇలాంటి మెసేజులు ఇతర ఏ యాప్స్‌కి వచ్చినా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
ఈ మెసేజులు చూసి ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. కావున వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో విదేశాల నెంబర్ కోడ్స్‌తో ఫేక్ కాల్స్ వచ్చేవి. ఇలాంటి వాటి వల్ల కూడా చాలామంది డబ్బు కోల్పోయే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఒకప్పుడు రూ. 65 జీతానికి ఉద్యోగం.. ఇప్పుడు వేల కోట్ల కంపెనీకి బాస్! ఎలా అంటే?
నిజానికి మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ గానీ, ఫోన్ గానీ వచ్చినట్లయితే.. వాటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్స్‌ని బ్లాక్ చేసుకోవడం మంచిది. అంతే కాకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్‌లో ఫ్రీ వై-ఫై ఉపయోగించుకోకుండా ఉండటం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment