సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామంటూ నిరుద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు నుంచి డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రైల్ వరల్డ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసింది.
సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment