మోసపూరిత లావాదేవీలు, ఎవర్‌గ్రీనింగ్ రుణాల కోసం ఉపయోగించే బ్యాంకు ఖాతాలు ఇటీవల అధికమయ్యాయి. కొన్ని బ్యాంకులు ఇలాంటి లక్షలాది అకౌంట్లను కలిగి ఉండటంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
బిజినెస్ స్టాండర్ట్ కథనం ప్రకారం.. “గత రెండు సంవత్సరాల్లో మరింత దృష్టి కేంద్రీకరించిన అంశం.. అంతర్గత ఖాతాల నియంత్రణ, నిర్వహణ. కొన్ని బ్యాంకులకు సరైన కారణం లేకుండా లక్షలాది ఖాతాలు కలిగి ఉన్నాయని మేము గుర్తించాం” అని మంగళవారం బ్యాంకుల చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లు, ఆడిటర్లతో జరిగిన సమావేశంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్.జె పేర్కొన్నారు.
ఈ ఖాతాల్లో కొన్ని మోసపూరిత లావాదేవీలు , రుణాల ఎవర్ గ్రీన్ కోసం వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతర్గత ఖాతాలతో దుర్వినియోగానికి అవకాశం ఉన్నందున వాటిని హేతుబద్ధీకరించాలని, వీలైనంత తగ్గించాలని సీఎఫ్‌లకు స్వామినాథన్ సూచించారు. గత వారం బ్యాంక్ చీఫ్‌లతో జరిగిన సమావేశంలోనూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఇదే అంశాన్ని లేవనెత్తారు. మ్యూల్ ఖాతాలను (చట్టవిరుద్ధమైన ఖాతాలు), డిజిటల్ మోసాలను అరికట్టాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment