
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంపై సోమవారం ఉదయం ఓ హెలికాఫ్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్‌లు ఎగరడం విరుద్దం. కానీ ఇటీవల తిరుమలలో అధికంగా విమానాలు, హెలికాప్టర్‌లు తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అయితే సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలకు ముప్పు ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు అందాయి
కాగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాలను నో ఫ్లైజోన్ గా ప్రకటించారు. కానీ తరచుగా తిరుమల కొండ మీదుగా విమానాలు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి.
