ఫ్రెంచ్ విమానాల తయారీదారు ఎయిర్‌బస్ భారతదేశంలో హెచ్125 హెలికాఫ్టర్లను అసెంబ్లింగ్ చేయడానికి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL)తో ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 'మేడ్ ఇన్ ఇండియా' హెచ్125ల డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఫార్న్‌బరో ఇంటర్నేషనల్ ఎయిర్‌షో 2024లో ఈ ఒప్పందంపై చేసినట్లు.. ఎయిర్‌బస్ సీఈఓ గుయిలౌమ్ ఫౌరీ అండ్ టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ప్రకటించారు. కంపెనీ భారతదేశంలో హెలికాప్టర్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఇది పౌర విమానయాన వృద్ధికి తోడ్పడుతుందని టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుకరన్ సింగ్ అన్నారు.
హెచ్125 ఫైనల్ అసెంబ్లీ లైన్ ప్రధాన కాంపోనెంట్ అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ హార్నెస్‌ల ఇన్‌స్టాలేషన్, హైడ్రాలిక్ సర్క్యూట్‌లు, ఫ్లైట్ కంట్రోల్స్, డైనమిక్ కాంపోనెంట్స్, ఫ్యూయల్ సిస్టమ్ అండ్ ఇంజన్‌ల ఏకీకరణను చేపడుతుంది. ఇది హెలికాప్టర్ల టెస్టింగ్ వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది.
హెచ్125 అనేది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సింగిల్-ఇంజిన్ హెలికాప్టర్. ఈ విభాగంలో హెచ్125 అనేది ఇతర హెలికాఫ్టర్ల కంటే ముందు ఉంది. ఈ హెలికాఫ్టర్ స్క్విరెల్ (Ecureuil) కుటుంబానికి చెందింది.
హెచ్125 హెలికాఫ్టర్ వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలదు. వీటిని వైమానిక దళాలు మాత్రమే కాకుండా, అగ్నిమాకప, రెస్క్యూ, ఎయిర్ అంబులెన్స్, ప్రయాణీకుల రవాణా వంటి వివిధ కార్యకలాపాలలో కూడా విరివిగా ఉపయోగించారు. ఎవరెస్ట్ శిఖరంపై ల్యాండ్ అయిన ఏకైక హెలికాప్టర్ కూడా ఇదే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment