గ్వాడలహారా (మెక్సికో): ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు టోర్నీ నిర్వాహకులు ఏకంగా హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. మెక్సికోలోని గ్వాడలహారా నగరంలో ప్రస్తుతం డబ్ల్యూటీఏ–500 టెన్నిస్ టోర్నమెంట్ జరుగుతోంది.
ఇక్కడ తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతుంటాయి. హోటల్స్ నుంచి ప్లేయర్లను నిరీ్ణత సమయంలోగా స్టేడియానికి తీసుకొచ్చేందుకు రోడ్డు మార్గంలో కుదరదని భావించిన గ్వాడలహారా టోర్నీ ఆర్గనైజర్లు హెలికాప్టర్లను వినియోగిస్తున్నారు.
దీనిపై టోర్నీ డైరెక్టర్ గుస్టావో శాంటోస్‌కాయ్ మాట్లాడుతూ ప్లేయర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. క్రీడాకారిణులు కూడా ఈ తరహా రవాణా అనుభవాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నారని చెప్పారు.
‘ప్రపంచ వ్యాప్తంగా కొన్ని టోర్నీల్లో అప్పుడప్పుడు ప్లేయర్లను ఇలా హెలికాప్టర్లలో వేదిక వద్దకు తీసుకొస్తారు. కానీ రెగ్యులర్‌గా మాత్రం ఈ సదుపాయం ఉండదు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి ప్లేయర్లను చాపర్లలోనే హోటల్ గదుల నుంచి టెన్నిస్ కోర్టులకు తీసుకొస్తున్నారు’ అని డబ్ల్యూటీఏ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ అలెక్స్ ప్రియర్ తెలిపారు.
ఆకాశ మార్గాన త్వరితగతిన వేదికకు చేరుకోవడం ద్వారా ప్లేయర్లంతా ఎలాంటి ప్రయాణ బడలిక లేకుండా మ్యాచ్‌ల బరిలోకి దిగుతున్నారు. గ్వాడలహారా సబర్బన్ సిటీలో రోడ్డు మార్గాలన్నీ రద్దీగా ఉంటాయి.
ప్లేయర్లు బస చేసే హోటల్స్ నుంచి టోర్నీ వేదికకు మధ్య దూరం 11 కిలో మీటర్లు ఉంటుంది. అయితే ఈ మాత్రం దూరానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పట్టడంతో నిర్వాహకులు చాపర్లను అందుబాటులోకి తెచ్చారు. దీని వల్ల నాలుగైదు నిమిషాల్లోనే క్రీడాకారిణులు స్టేడియానికి చేరుకుంటున్నారు.
చదవండి: ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ కన్నుమూత..
Comments
Please login to add a commentAdd a comment