హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఫోటో వైరల్‌ | Kamal Haasan Takes Special Helicopter To Indian 2 Shooting | Sakshi
Sakshi News home page

Kamal Haasan: హెలి​కాప్టర్‌లో షూటింగ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఫోటో వైరల్‌

Published Thu, Feb 2 2023 8:47 AM | Last Updated on Thu, Feb 2 2023 9:58 AM

Kamal Haasan Takes Special Helicopter To Indian 2 Shooting - Sakshi

హెలికాప్టర్‌లో షూటింగ్‌ లొకేషన్‌కు వెళుతున్నారు కమల్‌హాసన్‌. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఇండియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లోనే ‘ఇండియన్‌ 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షటింగ్‌ ప్రస్తుతం కడపలోని గండికోట విలేజ్‌లో జరుగుతోంది. తిరుపతి నుంచి గండికోట లొకేషన్‌కు రోజూ హెలికాప్టర్‌లో వెళ్తున్నారు కమల్‌హాసన్‌.

కాగా కమల్‌ హెలికాప్టర్‌ రైడ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ చిత్రం షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి, కాల్షీట్స్, షూటింగ్‌ సమయం వృథా కాకుండా చూసేందుకు కమల్‌ ఇలా హెలికాప్టర్‌ రైడ్‌ చేస్తున్నారన్నది కోలీవుడ్‌ టాక్‌. కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్‌సింగ్, బాబీ సింహా కీ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement