భారతీయుడికి టార్గెట్ ఫిక్స్ చేశారు దర్శకుడు శంకర్. 1996లో హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వచ్చిన హిట్ మూవీ ‘ఇండియన్’కి(తెలుగులో భారతీయుడు) సీక్వెల్‌గా తీస్తున్న ‘ఇండియన్ 2’ షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తైవాన్‌లో జరుగుతోంది.
కమల్ హాసన్‌పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇందులో ఓ ట్రైన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉందని కోలీవుడ్ టాక్. అయితే ‘ఇండియన్ 2’ టాకీ పార్ట్ షూటింగ్‌ను జూన్‌కల్లా పూర్తి చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘‘టాకీ పార్టు పూర్తి కాగానే ఓ పాట చిత్రీకరిస్తాం.. దీంతో మేజర్ షూటింగ్ పూర్తవుతుంది. జూన్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను స్టార్ట్ చేస్తాం’’ అన్నారు శంకర్. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్‌సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment