హెలికాప్టర్‌ను తయారు చేస్తున్న షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం (ఫైల్‌ఫోటో)
ముంబై: విమానయానం ఇంకా సామాన్యులకు చేరువకాలేదు. ఆశగా ఆకాశంలోకి చూడటమే తప్ప.. ఆ రెక్కల విహంగంలో ఎక్కి ప్రయాణించడం నేటికి కూడా సామాన్యుడికి తలకు మించిన భారమే. ఈ క్రమంలో ఓ వ్యక్తి తానే హెలికాప్టర్‌ను తయారు చేద్దామని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది.. దాని బ్లేడ్ అతడి మీద పడి మరణించాడు. ఈ విషాదకర సంఘటన మహారాష్ట్ర యావత్‌మాల పరిసర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
మహగావ్ తాలుకా ఫుల్సవంగా గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిల్ షేక్ ఇబ్రహీం అనే వ్యక్తి మెకానిక్‌గా పని చేసుకుంటూ ఉండేవాడు. అతడికి చిన్నప్పటి నుంచి విమానాలు, గాల్లో ప్రయాణించడం అంటే చాలా ఇష్టం. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. ఈ క్రమంలో ఇబ్రహీం తానే సొంతంగా ఒక హెలికాప్టర్ తయారు చేయాలని భావించాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుండేవాడు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఇబ్రహీం హెలికాప్టర్‌ను పరీక్షిస్తుండగా.. దానిలో తలెత్తిన లోపం వల్ల బ్లేడ్ అతడి తలపై పడింది. తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స కొనసాగుతుండగానే ఇబ్రహీం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment