ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌ | Helicopter Involved In Rescue Operation Crashes In Uttarakhand | Sakshi
Sakshi News home page

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

Aug 21 2019 3:20 PM | Updated on Aug 21 2019 3:21 PM

Helicopter Involved In Rescue Operation Crashes In Uttarakhand - Sakshi

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌ 

హరిద్వార్‌ : వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్‌ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్‌లో ఉన్న పైలట్‌ రాజ్‌పాల్‌, కో పైలట్‌ కప్తల్‌ లాల్‌, రమేష్‌ సవార్‌ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నిర్వాసితులకు సహాయ సామాగ్రిని ఈ హెలికాఫ్టర్‌లో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరకాశీ సమీపంలోని మోల్ది గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. హెలికాఫ్టర్‌కు వైర్‌ తగలడంతో చాపర్‌ కూలిందని అరాకోట్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వరద ముంచెత్తడంతో మిగతా ప్రపంచానికి ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రూ 15 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement