
Groom Father Spent Rs 6.5 Lakh Booking The Helicopter: నిజంగా ఒక్కోసారి విమర్శలు మనల్ని ఎంత దూరం అయిన తీసుకువెళ్తాయి అనడానికి ఇదొక నిదర్శనం. రాజస్తాన్‌లోని కరౌలి జిల్లాలోని కామ్రీ గ్రామానికి చెందిన రాధేశ్యామ్ సైనీ ఒక రోజు తన బిడ్డతో ఒక చిన్న హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా ఒక వ్యక్తి సరదాగా కొడుకు పెళ్లికి నిజమైన హెలికాప్టర్‌ని తీసుకురావలి అని హేళనగా అన్నాడు. అయితే రాధేశ్యామ్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా అనుకున్నాడు. ఎప్పటికైన కొడుకు పెళ్లికి హెలికాప్టర్ బుక్‌చేసి తన గ్రామంలోని వాళ్లను ఆశ్చర్యపరచాలి అని అనుకుంటాడు.
అతను అనుకున్నట్లుగానే తన కొడుకు పెళ్లికి నిజంగానే హెలికాప్టర్‌ను రూ 6 లక్షలు వెచ్చించి మరీ బుక్ చేశాడు. అయితే వధువు తండ్రి దినేష్ చాలా పేదవాడు. మరోవైపు పెళ్లికూతురు మాత్రం తాను కలలో కూడా ఊహించని విధంగా స్పెషల్ హెలికాప్టర్ రైడ్‌లో రావడంతో ఆమె చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు హెలికాప్టర్‌లో బయలుదేరిన వధూవరులను చూసి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి హెలికాప్టర్‌లో వధువు ఖుష్బూ అత్తమామల ఇంటికి వెళ్లడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొందని లక్ష్మణ్ అనే గ్రామస్తుడు తెలిపారు.
(చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పై చిరుత దాడి! ఐతే ఆ తర్వాత.)
Comments
Please login to add a commentAdd a comment