
మంచు కురిసే లోపల మారణహోమం!
సర్జికల్ దాడులపై ప్రతీకారేచ్ఛతో పాక్ రగిలిపోతోందా? అంటే తాజగా ఇంటిలిజెన్స్ విడుదల చేసిన రిపోర్టులు దీన్నే సూచిస్తున్నాయి. అంతేకాకుండా నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దుల్లో భద్రతా దళాలపై పాకిస్తాన్ రేంజర్లు జరుపుతున్న వరుస కాల్పులు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని ఇంటిలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి.
మంచు కురవడం ప్రారంభమయ్యే నాటికే టెర్రరిస్టులను భారత్ లోకి పంపి సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ చూస్తున్నట్లు సమాచారం. గడచిన నాలుగు రోజులుగా నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఎస్ఎస్ జీ కమాండో ప్లటూన్లను మోహరిస్తుండటం ఇంటిలిజెన్స్ హెచ్చరికలను బలపరుస్తున్నాయి. పాక్ కు చెందిన 14 నుంచి 15 ఎస్ఎస్ జీ ప్లటూన్లను ఓ కల్నల్ ర్యాంకు ఆఫీసర్ ఎల్వోసీ వద్ద లీడ్ చేస్తున్నట్లు తెలిసింది.
గత రెండు రోజులుగా పాకిస్తాన్ పదే పదే బీఎస్ఎఫ్ జవానుల క్యాంపులపై మోటర్లతో కాల్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ సరిహద్దులో గల కతువా, హీరానగర్, సాంబా, ఆర్నియా, ఆర్ఎస్ పురా, అక్నూర్ ప్రాంతాలతో పాటు ఎల్వోసీ వెంబడి తంగ్ ధర్, పూంచ్ సెక్టార్లలో విచక్షణారహితంగా పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. అయితే, ఈ దాడులన్నింటిని బీఎస్ఎఫ్ దళాలు సమర్ధవంతగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే.