హిమపాతాల హెచ్చరికలు | Heavy snowfall in Kashmir, Himachal for next 48 hours | Sakshi
Sakshi News home page

హిమపాతాల హెచ్చరికలు

Published Fri, Jan 27 2017 8:56 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

హిమపాతాల హెచ్చరికలు

హిమపాతాల హెచ్చరికలు

చండీగఢ్‌: జమ్మూ కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిలో హిమపాతాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయని మళ్లీ హెచ్చరికలు జారీ అయ్యాయి. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 24 గంటల పాటు ఇవి అమల్లో ఉంటాయని చండీగఢ్‌లోని మంచు, హిమపాతాల అధ్యయన కేంద్రం(ఎస్‌ఏఎస్‌ఈ) ప్రకటన జారీచేసింది.

జమ్మూ కశ్మీర్‌లో కుప్వారా, బందీపురా, అనంత్‌నాగ్, బారాముల్లా సహా 12 జిల్లాలకు , హిమాచల్‌ప్రదేశ్‌లో కులూ, చంబా, మండి,  షిమ్లా, కిన్నౌర్‌ తదితర జిల్లాలకు ఈ హెచ్చరికలు జారీచేసినట్లు వెల్లడించింది. ప్రజలు తమ ఇళ్లపై పడిన మంచును ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండాలని సూచించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement