
మంచుమయంగా మారిన శ్రీనగర్‌లోని ఫకీర్ గుజ్రీ ప్రాంతం
శ్రీనగర్/లక్నో/జైపూర్: రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తర భారతం వణుకుతోంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్ లలో చలితీవ్రత ఎక్కువైంది. కశ్మీర్‌లోనైతే పైపులు, ఇతర జలాశయాల్లో నీరు గడ్డకట్టు కుపోతోంది. గురువారం రాత్రి శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పంజాబ్, హర్యానా, రాజ స్తాన్‌లో చలిగాలులు ఎక్కువయ్యాయి.