Northern India
-
North India Rainfall Photos: ముంచెత్తిన ‘కుండపోత’.. ఉత్తరాది అతలాకుతలం (ఫోటోలు)
-
చలికి వణుకుతున్న ఉత్తర భారతం
శ్రీనగర్/లక్నో/జైపూర్: రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉత్తర భారతం వణుకుతోంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, యూపీ, పంజాబ్, హరియాణా, రాజస్తాన్ లలో చలితీవ్రత ఎక్కువైంది. కశ్మీర్‌లోనైతే పైపులు, ఇతర జలాశయాల్లో నీరు గడ్డకట్టు కుపోతోంది. గురువారం రాత్రి శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 6.3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. పంజాబ్, హర్యానా, రాజ స్తాన్‌లో చలిగాలులు ఎక్కువయ్యాయి. -
సైబర్ వసూళ్లు పెరుగుతున్నాయి!
- ర్యాన్సమ్ వేర్ అటాక్‌లో నాలుగో స్థానంలో భారత్ - నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేశ్ చోప్రా సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు కేవలం పీసీలు, ల్యాప్‌టాప్‌లకు పరిమితమనుకున్న బలవంతపు వసూళ్ల (ర్యాన్సమ్వేర్) వ్యవహారం ఇప్పుడు స్మార్ట్ఫోన్లకూ విస్తరించిందని, ప్రజలు వీటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అంతర్జాతీయ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ తయారీ సంస్థ నార్తర్న్ బై సెమాంటిక్ హెచ్చరిస్తోంది. సైబర్ ప్రపంచంలో బలవంతపు వసూళ్ల విషయంలో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉందని నార్తర్న్ ఇండియా కంట్రీ మేనేజర్ రితేష్ చోప్రా పేర్కొన్నారు. ర్యాన్‌సమ్‌వేర్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. స్మార్ట్‌వాచీల్లో, టెలివిజన్లలో వైరస్‌ను చొప్పించి అవి పనిచేయకుండా చేస్తున్నారని, అడిగిన డబ్బు ఇచ్చినా సమస్య పరిష్కారమవుతుందన్న గ్యారంటీ లేదని వివరించారు. సమాచారం మొత్తాన్ని రహస్య సంకేత భాషలోకి మార్చేసే టెక్నాలజీ (ఎన్క్రిప్షన్) అందరికీ అందుబాటులోకి రావడంతో సమస్య మరింత జటిలమవుతోందని చెప్పారు. ఈ ఏడాది ఒక్క మార్చిలోనే దేశవ్యాప్తంగా 1.2 లక్షల ర్యాన్సమ్వేర్ ఇన్ఫెక్షన్లు జరిగాయని, రూ.200 నుంచి రెండు మూడు లక్షల రూపాయల వరకు వసూలు చేసే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. స్మార్ట్‌ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌ల సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవడం, బ్యాకప్ చేసుకోవడం, అనుమానాస్పద మెయిళ్లు, మొబైల్ ఆప్స్‌ను డౌన్లోడ్ చేసుకోకపోవడం వంటి పనులతో ర్యాన్సమ్ బారిన పడకుండా చూసుకోవచ్చునని సూచించారు. ర్యాన్సమ్ వేర్ సెల్ పెట్టాలేమో: ఏసీపీ రఘువీర్ నైజీరియన్ ఫ్రాడ్, క్రెడిట్, డెబిట్ కార్డులతో జరిగే మోసాలతోపాటు ఇటీవలి కాలంలో ర్యాన్సమ్వేర్ మోసాలు కూడా ఎక్కువవుతున్నాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ రఘువీర్ తెలిపారు. వివిధ కారణాల వల్ల చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయట్లేదని చెప్పారు. ఈ రకమైన నేరాలు పెరుగుతున్న విధానం చూస్తుంటే త్వరలోనే వీటి దర్యాప్తునకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి రావచ్చన్నారు. -
ఉత్తర భారతంలో కన్వర్ పండుగ
-
ఉత్తరభారతంలో భూకంపం.. జనం పరుగులు
నేపాల్‌లో పుట్టిన భూకంపం మరోసారి ఉత్తర భారత దేశాన్ని కూడా చిగురుటాకులా వణికించింది. పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావాన్ని ప్రజలు స్పష్టంగా చూశారు. మూడో అంతస్థులో ఉండి పని చేసుకుంటున్న తాము ఉన్నట్టుండి అటూ ఇటూ ఊగిపోయామని, ఏం జరిగిందో అర్థమయ్యేలోపే భూకంపం అన్నారని దాంతో వెంటనే కిందకు పరుగులు తీశామని ఢిల్లీకి చెందిన ఓ గృహిణి తెలిపారు. తాను పాఠం చెబుతుండగా ఓ పిల్లాడు ఉన్నట్టుండి భూకంపం వచ్చిందన్నాడని, ముందు ఏదో జోక్ వేశాడనుకుంటే ఈలోపు బల్లలు కూడా ఊగడంతో వెంటనే అర్థం చేసుకుని అంతా బయటకు పరుగులు తీశామని ప్రైవేటు స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు. ఢిల్లీలో భూకంపం కారణంగా మెట్రో రైలు సర్వీసులను కాసేపు నిలిపివేశారు. నోయిడాలోని పలు షాపింగ్ మాల్స్ నుంచి జనం బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి తీవ్రంగా ప్రకంపించిందని, అపార నష్టం సూచనలు ఉన్నాయని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీ తెలిపింది. నేపాల్‌లోని ఢోలాక-సింధుపల్చోక్ మధ్య భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4 గా నమోదైంది. కఠ్మాండు నుంచి తూర్పుదిశగా ఉన్న భిర్కోట్ కేంద్రంగా భారీ భూకంపం వచ్చింది. హిమాలయ పరివాహక ప్రాంతమంతా ప్రకంపనలు వచ్చాయి. నేపాల్ సరిహద్దు ప్రాంతంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూ ప్రకంపనలతో కఠ్మాంటు ఎయిర్‌పోర్టు నుంచి జనం పరుగులు తీశారు. భూమి కంపించడం మొదలుపెట్టగానే పెద్దగా కేకలు వేస్తూ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పారిపోయారు. నేపాల్‌తో పాటు బంగ్లాదేశ్, చైనా, అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కూడా భూకంప ప్రభావం కనిపించింది. నేపాల్‌లో భూమికి 19 కిలోమీటరల్ లోపల భూమి కంపించినట్లు అమెరికా భూగర్భ శాఖ తెలిపింది. -
ఉత్తర భారత్ లో భారీ భూకంపం
-
ఉత్తర భారతంలో ఘనంగా 'కర్వా చౌత్'