
జమ్ము కశ్మీర్ : జమ్ము కశ్మీర్‌లోని ఉదయ్‌పుర్‌లో జాతీయ రహదారిపై కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా ఎక్కడున్న వాహనాలు అక్కడే ఆగిపోయాయి. భారీగా వర్షం, మంచు కురుస్తుండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు సేదతీరడానికి రోడ్ల పక్కన తాత్కాలిక ఏర్పాట్లను జిల్లా అధికారులు చేశారు. హెల్ప్‌లైన్ నెంబర్‌ను కూడా జారీ చేశారు. మరోవైపు రోడ్డు క్లియర్ చేయడనికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.